భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Sunday, April 24, 2011

సత్యనారాయణరాజు నుంచి.. సత్యసాయిగా..

మానవసేవే మాధవసేవగా, సర్వ మత సారం సాయి అభిమతంగా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను ప్రబోధిస్తూ సత్యసాయిబాబా ప్రత్యక్షదైవంగా భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు బాబా బోధనలను ప్రత్యక్షంగా ఆలకించి, ఆయనను దర్శించుకునేందుకు ప్రతి ఏడాదీ ఇక్కడికి వస్తారు. తాము ఒక శాంతి, ప్రేమ, ఆధ్యాత్మిక ప్రపంచంలో
ఉన్నామన్న భావనతో స్వాంతన పొందుతున్నారు.

అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం గొల్లపల్లి (పుట్టపర్తి)లో ఈశ్వరాంబ, పెదవెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యనారాయణరాజు జన్మించారు. చిరు ప్రాయం నుంచే ఆయన ప్రత్యేక ప్రవర్తనతో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. పొరుగింటి కరణం సుబ్బమ్మ.. సత్యనారాయణరాజు ప్రవర్తనను గమనించి అతను గొప్పవ్యక్తి అవుతాడని చెబుతుండే వారు. చిన్ననాటి సత్యనారాయణరాజు బోధనలకు ఆమె ప్రచారం కల్పించారు. ఆయన బోధనలు ఇరుగుపొరుగు గ్రామాల వారిని ఆకర్షించాయి. పశువుల కాపరులు, సన్నిహితులు కోరిన కోర్కెలు తీరుస్తూ ఆయన మహిమలు చేసి చూపసాగారు. పుట్టపర్తిలోని ప్రాథమిక పాఠశాలలో 1931 నుంచి 1936 వరకు విద్యాభ్యాసం చేశారు. 6వ తరగతి నుంచి బుక్కపట్నంలో చదివారు. 1940లో ఉరవకొండలో 9వ తరగతి పూర్తి చేసి విద్యకు స్వస్తి పలికారు. అంతకు ముందు కొంత కాలం కడప జిల్లా (ప్రస్తుతం వైఎస్‌ఆర్ జిల్లా) కమలాపురంలో గడిపారు. తన 14వ ఏట ఉరవకొండలోని ఒక బండరాయిపై మల్లెపూలు చల్లి సత్యసాయి బాబా అని పేరును సృష్టించి అవతార పురుషునిగా ప్రకటించుకున్నారు.


అనంతరం గొల్లపల్లి చేరుకున్న బాబా.. ఆ గ్రామం పేరును పుట్టపర్తిగా నామకరణం చేశారు. తన బోధనలతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను ఆకర్షించసాగారు. సత్యనారాయణరాజు భక్తులకు సత్యసాయిబాబాగా ఆరాద్యుడయ్యారు. 1941లో తన భవిష్యత్ వాణిని ప్రకటించారు. 1948లో ప్రశాంతి నిలయం మందిరాన్ని నెలకొల్పారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు బాబా కీర్తిప్రతిష్టలు జిల్లాలు, రాష్ట్రాలు, దేశం ఎల్లలు దాటి విశ్వవ్యాప్తమయ్యాయి. ప్రపంచ దేశాలకు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రశాంతి నిలయంలో సనాతన ధర్మాలను సూచించే స్థూపాన్ని నెలకొల్పారు. మానవసేవే మాధవసేవ అనే సూక్తిని నమ్మిన ఆయన ప్రేమతత్వానికి సేవా భావాన్ని జోడించి సమాజ సేవకు ఉపక్రమించారు. ‘జయతునాం నరజన్మనం దుర్లభం’ అనే రీతిలో ఎంతో ఉత్తమమైన మానవజన్మ ఎత్తిన మనిషి తనతోటి జీవులతో సఖ్యతగా మెలగాలని బోధించసాగారు. తోటి మనిషికి సాయం అందించని జన్మ నిరర్థకమన్నారు. అదే విధానాన్ని ఆయన పాటించి విద్య, వైద్యం, తాగునీటి పథకాలను అందించటమే కాదు.. దేశ వ్యాప్తంగా ఏ ఉపద్రవం ఏర్పడినా సాయిభక్తులు సహాయ సహకారాలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత సత్యసాయికి దక్కుతుంది. ఒక వ్యక్తిగా జన్మించి అవదూతగా అవతరించి లోక కల్యాణార్థం నిత్య సాధన చేస్తున్న సత్యసాయి తన 96వ యేట సజీవ సమాధి అవుతానని అప్పట్లో ప్రకటించారు. 


ఇదీ సత్యసాయి దినచర్య..
ఆధ్యాత్మిక బోధనలతో కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్న సత్యసాయిదినచర్య ఆసక్తికరంగా ఉంటుంది. బాబా యజుర్వేద మందిరంలో ఉంటారు. వ్యక్తిగత దినచర్య అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆయన దినచర్య ఇలా...

తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేవటం
మూడు నుంచి ఆరు గంటల వరకు ఓంకారం చదువుకోవటం
ఆరు నుంచి ఏడు గంటల వరకు భక్తులు రాసిన ఉత్తరాలను చదవటం
7-8 గంటల మధ్య అల్పాహారం
8-9 గంటల మధ్య భక్తులకు ప్రత్యేక దర్శనం
తొమ్మిది నుంచి 9.30 గంటల మధ్య భజనలో పాల్గొనటం
9.30 గంటలకు యజుర్వేద మందిరానికి చేరుకుని విశ్రాంతి తీసుకోవటం
మధ్యాహ్నం మూడు నుంచి 3.30 గంటల వరకు ప్రశాంతి నిలయంలో భక్తులకు దర్శనం
3.30 నుంచి సాయంత్రం ఐదు వరకు వీఐపీలతో మాట్లాడటం
ఐదు నుంచి 5.30 వరకు ప్రశాంతి నిలయంలో జరిగే భజన కార్యక్రమంలో పాల్గొనటం
5.30 నుంచి ఏడు గంటల వరకు యజుర్వేద మందిరంలో
ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య భోజనం
ఏడున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రస్టు వ్యవహారాలు చూడటం 



ఎనిమిదేళ్లుగా వీల్‌చైర్‌కు పరిమితమైన బాబా 
 
 బెంగుళూరు వైట్‌ఫీల్డ్ ఆశ్రమంలో 2003లో జారిపడి కాలు విరగటంతో అప్పటి నుంచి సత్యసాయి వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. అరుుతే అనతి కాలంలోనే కోలుకుని కొంతకాలం ఆంతరంగికుల సాయంతో నడిచి వచ్చి భక్తులకు దర్శనమిచ్చేవారు. కానీ వయసు రీత్యా శరీరం సహకరించకపోవటంతో వీల్‌చైర్‌లో తన నివాస మందిరం నుంచి సభా మందిరానికి వచ్చి దర్శనమిచ్చేవారు. ట్రస్ట్ వ్యవహారాలను, సేవా కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూ అనేక ప్రాంతాలలో పర్యటించారు. బాబా వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటి నుంచి పాద నమస్కార భాగ్యానికి భక్తులు దూరమయ్యారు. దూరం నుంచే బాబాను దర్శించుకోవాల్సి వచ్చింది. 

మార్చి 28 నుంచి ఏప్రిల్ 24 దాకా...
 నవంబర్ 23న 85వ జన్మదినోత్సవాన్ని పూర్తిచేసుకున్న బాబా ఆ తరువాత కొద్ది రోజులకు స్లోయింగ్ ఆఫ్ ది హార్ట్ బీట్(హృదయ స్పందన నెమ్మదించడం) సమస్యతో బాధపడుతుండడాన్ని డాక్టర్లు గుర్తించారు. నాలుగు రోజుల పాటు ఆయన నివాస మందిరమైన యజుర్వేద మందిరంలోనే చికిత్స చేశారు. అయినా బాబా ఆరోగ్య పరిస్థితిలో మార్పులేకపోవడంతో మార్చి 28న సిమ్స్(శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్) ఆస్పత్రికి తరలించారు. సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఏఎన్ సఫాయా ఆధ్వర్యంలో చికిత్సలు అందించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమమిదీ...

మార్చి 28: బాబా హృదయ స్పందనలో హెచ్చుతగ్గులున్నట్లు, న్యుమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. పేస్‌మేకర్, వెంటిలేటర్ అమర్చారు.

ఏప్రిల్ 4: మూత్రపిండం పనిచేయడం లేదని వైద్యులు ధ్రువీకరించారు. రక్తపోటు కూడా సక్రమంగా లేదని గుర్తించారు. దాంతో బాబా ఆరోగ్యం విషమించిందని సిమ్స్ డెరైక్టర్ ఏఎన్ సఫాయా ప్రకటించారు.
ఏప్రిల్ 6: పేస్‌మేకర్, వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తూనే కిడ్నీలకు సీఆర్‌ఆర్‌టీ ద్వారా డయాలసిస్ ప్రక్రియను ప్రారంభించారు.

ఏప్రిల్ 7: బాబాకి కామెర్లు ముదిరినట్లు గుర్తించి, కాలేయానికి ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ప్రకటించారు. కాలేయానికి చికిత్స చేయడం ప్రారంభించారు.
ఏప్రిల్ 8: బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది.
ఏప్రిల్ 16: ఎంత చికిత్స చేసినా కామెర్లు, జ్వరం తగ్గలేదు. దీనికి తోడు బాబాకు కొత్తగా లోబీపీ ఉన్నట్లు వెల్లడైంది. అదే రోజున చికిత్సకు అవయవాలు సహకరించడం లేదని గుర్తించారు.
ఏప్రిల్ 21: మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్‌తో బాధపడుతున్న బాబా ఆరోగ్యం పూర్తిగా విషమించిందని సఫాయా ప్రకటించారు.
ఏప్రిల్ 22: స్వామి ఆరోగ్యం పూర్తిగా ఆందోళనకరంగా మారిందని, భగవత్ స్వరూపుడైన బాబా ఆరోగ్యాన్ని ఆయనే రక్షించుకోవాలని, తాము చేసేది మానవ ప్రయత్నం మాత్రమేనని సఫాయా పేర్కొన్నారు.

ఏప్రిల్ 23: ఒక్క గుండె తప్ప ఏ అవయవాలూ పనిచేయడం లేదని వైద్యులు ప్రకటించారు.
ఏప్రిల్ 24: గుండె, శ్వాస వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఆదివారం ఉదయం 7.40 గంటలకు బాబా తుది శ్వాస విడిచారని ఉదయం 10.15 గంటలకు సఫాయా అధికారికంగా ప్రకటించారు.


తొలి విదేశీ భక్తురాలు హిల్డా
 
న్యూయార్క్‌కు చెందిన హిల్డాచాల్ట్రన్ సత్యసాయికి మొట్టమొదటి విదేశీ భక్తురాలు. నూయార్క్‌లో యోగా టీచర్‌గా విధులు నిర్వహించే హిల్డా 1982లో భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో పుట్టపర్తిలోని సత్యసాయి బాబా గురించి ఆమెకు తెలియటంతో మార్చి 18న ప్రశాంతి నిలయానికి వచ్చారు. సాధారణ విజిటర్‌గా వచ్చిన ఆమె బాబాకు భక్తురాలిగా మారారు. ఇప్పుడు ప్రపంచంలోని 223 దేశాల్లో మహిళా భక్తులు ఉన్నారు.

మహిళలకు అత్యున్నత గౌరవం

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో విశేష స్థానమున్న మహిళలకు సత్యసాయి సన్నిధిలో అంతే సముచిత గౌరవం దక్కుతోంది. ఏటా జరిగే సత్యసాయి బాబా జన్మదినోత్సవ కార్యక్రమాల్లో ‘మహిళా దినోత్సవం’ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మహిళ విజ్ఞానవంతురాలైతే సంస్కృతి, సంప్రదాయాలు నిలిచి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే భావన తరచూ బాబా వ్యక్తం చేసేవారు. అందులో భాగంగానే మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో నాటి రాష్టప్రతి వి.వి.గిరి చేతుల మీదుగా మహిళా డిగ్రీ కళాశాలను బాబా ప్రారంభింపజేశారు. హాస్టల్‌ను వి.వి.గిరి సతీమణి సరస్వతి గిరి ప్రారంభించారు. జిల్లాలో మొదటి మహిళా కళాశాలను నెలకొల్పిన ఘనత బాబాకు దక్కుతుంది.

మూడు దశాబ్దాలుగా మహిళా దినోత్సవం

బాబా జన్మదినోత్సవం సందర్భంగా మూడు దశాబ్దాలుగా మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని సాయి భక్తులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన మహిళలు ఏటా నవంబర్ 19న మహిళా దినోత్సవానికి హాజరవుతుంటారు. మహిళా దినోత్సవంలో అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించటం విశేషం. సాయి ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు విన టానికి హాజరయ్యే మహిళలకు ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. ప్రశాంతి నిలయంలోని అన్ని విభాగాల్లో కూడా మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. బాబా 85వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన మహిళా దినోత్సవంలో (2010) భారత రాష్టప్రతి ప్రతిభాపాటిల్ పాల్గొన్నారు.

2004లో ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ప్రాజెక్టు

సత్యసాయి మాతృమూర్తి పేరుతో ‘ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ప్రాజెక్టు’ను 2004లో బాబా ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును ‘శ్రీ సత్యసాయి ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్టు’గా మార్చారు. ఇది 2005 ఫిబ్రవరి 18 నుంచి సేవలు అందించసాగింది. ఈ ట్రస్ట్ ద్వారా గ్రామీణ మహిళలకు విద్య, ఉపాధి, వైద్య సహాయ కార్యక్రమాలు, తల్లీ పిల్లల వైద్య శిబిరాలు, చేతి వృత్తుల్లో శిక్షణ అందజేస్తున్నారు.


తల్లికిచ్చిన మాట కోసమే.. పుట్టపర్తిని వీడలేదు 


 పుట్టపర్తి.. ఒకప్పుడు మారుమూలగ్రామం.. నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం.. దీనంతటికీ కారణం సత్యసాయి.. మాతృమూర్తికి ఇచ్చిన మాట కోసమే ఆయన పుట్టపర్తిని వీడి వెళ్లలేదు. ఈ విషయాన్ని ఆయన 2002 ఆగస్టు 31న పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ సభామందిరంలో భక్తులకు వివరించారు.పుట్టపర్తి మారుమూల పల్లెగా ఉన్న కాలంలోనూ తన ఆధ్యాత్మిక సందేశాన్ని అక్కడి నుంచే ప్రపంచానికి విన్పించారు. ఒక రోజున సాకమ్మ అనే భక్తురాలు ‘స్వామీ ఈ పల్లెకు వచ్చిపోవాలంటే మాకు కష్టంగా ఉంది. ఇక్కడికి కార్లు రావడానికి వీల్లేదు. ఎడ్లబండి మీద రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మీరు బెంగళూరు వచ్చేయండి. అక్కడ మీకు గొప్ప భవనం కట్టిస్తాము’ అని వేడుకొంది. బాబా స్పందిస్తూ ‘అక్కడ గొప్ప భవనాలు నాకు అక్కర్లేదు. ఇక్కడున్న చిన్న గది చాలు’ అని సెలవిచ్చారు. ఆయినా ఆ భక్తురాలు పట్టువీడలేదు. అప్పుడు స్వామి మాతృమూర్తి ఈశ్వరమ్మ జోక్యం చేసుకుంటూ ‘మొక్క ఎక్కడ పుట్టిందో అక్కడే దానికి పాదుకట్టి, ఎరువు వేసి, నీరు పోసి పెంచాలి. అప్పుడే అది గొప్ప వృక్షంగా తయారవుతుంది. దాన్ని కొంతకాలం ఒక చోట ఉంచడం, తర్వాత పెరికివేసి ఇంకొకచోట పాతిపెట్టడం...ఈ రీతిగా చేస్తూ ఉంటే అది ఎలా వృద్ధికి రాగలదు? కనుక మీరు పుట్టిన గ్రామంలోనే ఉండండి’ అంటూ బాబాను కోరింది. దీంతో పుట్టపర్తిని వదిలి పెట్టనని, భక్తుల దగ్గరకు వెళ్లి వస్తుంటానని బాబా తన మాతృమూర్తికి వాగ్దానం చేశారు.
1926 - 2011


1926: నవంబరు 23న అనంతపురం జిల్లా గొల్లపల్లిలో సత్యసాయి జననం
1936: తన 10వ ఏటనే ‘బంధారి భజన సమాజం’ స్థాపించి ‘సత్య’ పేరుతో భజన పాటలు పాడేవారు.
1938: 12 ఏళ్ల వయసులో ‘చెప్పినాడు క్షేత్ర’ నాటికను స్వయంగా రాసి సాయి దర్శకత్వం వహించి, నటించారు.
1940: 14 ఏళ్ల వయసులో అక్టోబర్ 20న ఉరవకొండలో సత్యనారాయణరాజు అన్న తన పేరు మార్చుకుని ‘సత్యసాయి’ అవతారమని ప్రకటించుకున్నారు. అవతారమూర్తిగా ప్రకటన చేసిన తర్వాత ‘మానస భజరే గురుచరణమ్’ అనే భజన గీతాన్ని స్వామి ఆలపించి తొలి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.

1946: ఊటీ, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో సాయి పర్యటించిన సమయంలో ముస్లింలు బాబా ప్రసంగాలకు ఆకర్షితులై భక్తులుగా మారారు.
1947: అక్టోబరు 25న తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామి ప్రసంగించారు.
1948: అర్జెంటైనాకు చెందిన వ్యక్తి తొలి విదేశీ భక్తుడు. ఈ ఏడాదిలోనే లాటిన్ అమెరికాలో ప్రచారం. ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధానిగా గుర్తింపు పొందిన ప్రశాంతి నిలయానికి శంకుస్థాపన.
1950: నవంబర్ 23న బాబా 25వ జన్మదినోత్సం సందర్భంగా ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం.
1957: వెంకటగిరిలో సాయి భక్తులు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి చేసిన ప్రసంగం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టింది. అప్పటి వరకు బ్రిటిష్ పాలనలో అస్తవ్యస్తమైన భారతీయ సంస్కృతిని సరిదిద్దుకునేందుకు సాయి చేసిన ప్రసంగాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

1958: సత్యసాయి ప్రసంగాలు, సేవా కార్యక్రమాలు తెలియచేసే ప్రేమవాహిని, ధర్మవాహిని, ధ్యానవాహిని, సందేహ నివారిణి పేరుతో ‘సనాతన సారథి’ పుస్తకాన్ని అనేక భాషల్లో ముద్రించటం ప్రారంభించారు. తెలుగు, మళయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ, అస్సామీ, సింధీ, నేపాలీ, ఆంగ్ల భాషల్లో సాయి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

1960: ప్రొఫెసర్ కస్తూరి రాసిన సత్యసాయి జీవిత చరిత్ర మొదటి భాగం విడుదల చేశారు. తర్వాత మూడు భాగాలు విడుదలయ్యాయి.
1961: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ‘సనాతన ధర్మ సూత్రాల’ను బాబా భక్తులకు విశదపరిచారు.
1962: పనామా నుంచి తొలి విదేశీ ప్రయాణానికి సత్యసాయి శ్రీకారం చుట్టారు.
1963: జపాన్ నుంచి ‘రామ్‌చంద్ కుగని’ అనే వ్యక్తి ప్రశాంతి నిలయానికి వచ్చి సాయి భక్తుడిగా మారారు.
1964: సత్యసాయి చైనా పర్యటనలో ఆస్ట్రేలియాకు చెందిన ‘కోవర్ట్ ముర్బట్’ సాయి భక్తుడిగా మారారు. ఆయన 1971లో ‘బాబా అద్భుతాలు’ అనే పుస్తకాన్ని రచించారు.
1965: అమెరికాకు చెందిన డాక్టర్ జాన్ ‘సాయి మిషన్’ను ప్రారంభించారు.

1966: సోషల్ వర్కర్ ఓబెల్‌మెహ్రే ముఖ్య అతిథిగా సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రారంభమైంది. రష్యాకు చెందిన ఇంద్రాదేవి అమెరికాలో నివసిస్తున్న యోగా గురువు. ఆమె సాయి సేవా కార్యక్రమాలకు ముగ్ధురాలై భక్తురాలిగా మారారు. నార్వేకు చెందిన జోగాన్‌సన్ అనే వ్యక్తి బాబాను ముంబైలో కలిసి సాయి ప్రచారకుడిగా మారారు.
1967: ఏప్రిల్ 20, 21 తేదీల్లో సాయి ఆర్గనైజేషన్స్ సమావేశం చెన్నైలో జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని సాయి ఆర్గనైజేషన్ సభ్యులతోపాటు హాంకాంగ్, చైనా, జపాన్, శ్రీలంక, నార్వే దేశాల భక్తులు పాల్గొన్నారు.
1968: ముంబైలో ‘ధర్మక్షేత్ర’ పేరుతో సాయి ఆర్గనైజేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక, సింగపూర్, మనీలా, కువైట్, దుబాయ్, నైరోబి, ఫిజీ, వెస్టిండీస్, పెరూ, బ్రెజిల్ దేశాలకు చెందిన సాయి భక్తులు పాల్గొన్నారు. జూన్ 30న దక్షిణాఫ్రికాకు చెందిన ‘ఫ్లోరెన్’ సాయి భక్తుడిగా మారారు.
1969: గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సనాతన ధర్మాలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి సత్యసాయి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. స్థానిక పత్రిక ‘నవకాల్’ బాబా ప్రసంగాలు, సేవల గురించి ప్రచురించిన వ్యాసాలు ఎంతోమంది మంది భక్తులకు మార్గదర్శకంగా నిలిచాయి.

1970: సాయి ప్రసంగాలు, భజనలు, బోధనలు పుస్తకాల రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగింది.
1971: హేవార్డ్ అనే సాయి భక్తుడు ‘ది మెన్ మిరాకిల్’ పేరుతో రాసిన పుస్తకాన్ని లండన్‌లో విడుదల చేశారు. మొత్తం నాలుగు భాగాలుగా ప్రచురితమైంది. అమెరికా సినీ దర్శకుడు, రచయిత ఆర్నాల్డ్‌సూల్మిన్ ‘బాబా’ పేరుతో రాసిన పుస్తకాన్ని న్యూయార్క్‌లో విడుదల చేశారు. కాలిఫోర్నియాలో ‘సాయి ప్రచురణ, విక్రయ కేంద్రం’ ప్రారంభించారు.
1972: హాంకాంగ్‌లో సాయి ప్రచార ఆర్గనైజేషన్ పేరుతో శాస్ర్తి అనే భక్తుడు సంస్థను ప్రారంభించి పేదలకు ఆహారం, గూడు కల్పించసాగారు.

1973: మెక్సికో నుంచి లూయిస్ మునిచ్ సతీసమేతంగా ప్రశాంతి నిలయానికి వచ్చి బాబా ఆశీస్సులు పొంది మెక్సికోలో సాయి కేంద్రాన్ని ప్రారంభించారు.
1974: అమెరికాలో జాన్ ఇస్లాబ్ అనే భక్తుడు సాయి ఆర్గనైజేషన్ ప్రారంభించారు. బాబా ప్రసంగాలను అర్లెటీ అనే భక్తుడు స్పానిష్ భాషలోకి అనువదించి వెనిజులాలో సాయి ఆర్గనైజేషన్ ప్రారంభించారు.
1975: జపాన్, ఇండోనేషియాల్లో హిరుబర్వాని అనే భక్తుడు సాయి కేంద్రాలను ప్రారంభించారు. డాక్టర్ ఆలీ హుస్సేన్ స్విట్జర్లాండ్‌లో సెంటర్‌ను ప్రారంభించగా, ఆస్ట్రేలియా, జర్మనీలో కూడా ఇదే ఏడాది పారంభమయ్యాయి.

1979: పెరూలో బ్రైటో దంపతులు శాంతినిలయాన్ని ప్రారంభించారు.
1980: గురుపౌర్ణమి సందర్భంగా ఆస్ట్రేలియాలోని స్టాక్‌ఫీల్డ్‌లో సాయి కేంద్రం ప్రారంభించారు. అర్జెంటైనా, చిలీ, తైవాన్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
1983: ఏప్రిల్‌లో అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించారు. ఇందూలాల్ షా ఆస్ట్రేలియాలో సెంటర్‌ను ప్రారంభించారు. 1985: బ్యాంకాక్‌లో సత్యసాయి ట్రస్ట్, చార్లెస్ బిన్ రాసిన ‘సాయిరాం’ పుస్తకం, జాన్ హిల్స్ లాఫ్ రాసిన ‘బాబా - నేను’ అనే పుస్తకం, సామ్‌వెల్ రాసిన ‘స్పిరిచ్యువల్ మైండ్’, క్రిస్టిల్ రాసిన సాయిబాబా అనుభవాలు అనే పుస్తకాలు ముద్రించారు.
1987: బ్రెజిల్‌లో సాయి ఆర్గనైజేషన్ ప్రారంభమైంది.
1988: ఉరుగ్వేలో సాయి ఆర్గనైజేషన్‌తోపాటు వృద్ధాశ్రమం, విద్యాసంస్థ, పేదలకు ఆహారం అందచేసే సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి.

1991: ఆస్ట్రియాలో సత్యసాయి సెంటర్‌ను ఏర్పాటు చేసి యూరోపియన్ హెల్పింగ్ సర్వీసెస్‌ను ప్రారంభించారు.
1992: బ్రెజిల్‌లో నలుగురు విద్యార్థులతో సాయి విద్యాసంస్థ ప్రారంభమైంది.
1995: సత్యసాయి బోధనలు వినేందుకు 20,000 మంది ఒకేసారి కూర్చునే విధంగా ‘సాయి కుల్వంత్ హాల్’ను ప్రశాంతి నిలయంలో ప్రారంభించారు.
1999: ఢిల్లీలో సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ ప్రారంభమైంది.
2001: ప్రశాంతి నిలయంలో సాయి పబ్లిషింగ్ డివిజన్ ఏర్పాటు, సాయి రేడియో ప్రారంభమైంది.
2005: నవంబర్‌లో సత్యసాయి విద్యార్థుల ప్రపంచ మహాసభ జరిగింది.
2006: నవంబర్‌లో అంతర్జాతీయ సత్యసాయి ట్రస్ట్ ప్రారంభం
2007: సాయి ప్రేమ పేరుతో 85 దేశాలకు చెందిన 66 వేల మంది యువతీయువకులు ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.
2009: అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో సత్యసాయి ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ ప్రారంభించారు.
2010: నవంబర్‌లో పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి 85వ జన్మదినోత్సవ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన అతిథులు, రాష్టప్రతి, ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు ఎందరో హాజరయ్యారు.
2011: మార్చి 28న అనారోగ్యానికి గురైన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌లో చేరారు. ఏప్రిల్ 24న పరమపదించారు.
 

ప్రేమ-సేవ.. మానవసేవే- మాధవ సేవ.. ఈ రెండు బోధనలతోనే కోట్లాది మంది భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సత్యసాయిబాబా ప్రపంచవ్యాప్తంగా ‘ఓం సాయిరాం’ నామాన్ని ప్రతి ఒక్కరూ జపించేలా చేశారు. అనంతపురం జిల్లా గొల్లపల్లిలో రత్నాకరం సత్యనారాయణరాజుగా 1926 నవంబర్ 23న జన్మించారు. 1940 అక్టోబర్ 20న ఉరవకొండలో ‘శ్రీ సత్యసాయి’ అవతార ప్రకటనతో కలియుగ ఆధ్యాత్మిక దైవంగా భాసిల్లుతున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రశాంతి నిలయాన్ని కేంద్రంగా రూపొందించి గొల్లపల్లి గ్రామానికిపుట్టపర్తిగా ప్రపంచదేశాల్లో గుర్తింపు తెచ్చారు. ప్రశాంతి నిలయం ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ‘సత్యసాయి ట్రస్ట్’ పేరుతో విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు అందజేస్తున్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సాయి భక్తులు ఉన్నారు. ప్రతి రాష్ట్రం, జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల పేరుతో అనేక రకాల సేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవగా సత్యసాయి బాబా ప్రవచనాలను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా కోటాను కోట్ల మంది సాయి భక్తులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సాయి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలోని ఐదు ఖండాల ప్రజలను ఒక్కచోట చూసే అవకాశం సత్యసాయి వల్ల రాష్ట్ర ప్రజలకు దక్కింది.


ప్రపంచ వ్యాప్తంగా సాయి ఆర్గనైజేషన్స్


భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 223 దేశాలకు చెందిన ప్రజలు, ఆయా దేశాల అధినేతల నుంచి సేవలు అందుకున్న ఘనత సత్యసాయికి దక్కింది. అమెరికా, ఇజ్రాయెల్, వెస్టిండీస్, బార్బడోస్ అండ్ కరేబియన్ దీవులు, కెనడా, బెల్జియం, క్యూబా, ఎల్‌సాల్వెడార్, గ్వాటెమాలా, ఫ్రెంచి గయానా, మెక్సికో, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, వెనెజులా, అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, చిలీ, పరాగ్వే, ఉరుగ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, ఫసిఫిక్ ఐలాండ్, ఫిలిప్పీన్స్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, థాయిలాండ్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్, చైనా, హాంకాంగ్, జపాన్, కొరియా, తైవాన్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, బోస్నియా, బల్గేరియా, గ్రీస్, రొమేనియా, సెర్బియా, అస్ట్రియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, హంగరీ, స్లొవేకియా, బెల్జియం, డెన్మార్క్, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఎస్టోనియా, ఫిన్లండ్, లాట్వివా, లిథువేనియా, పోలండ్, అజర్‌బైజాన్, అర్మేనియా, జార్జియా, కజకిస్థాన్, మాల్దోవా, రష్యా, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఉక్రెయిన్, ఇంగ్లండ్, ఐర్లండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, లిబియా, సోమాలియా, స్వాజిలాండ్, టాంజానియా, ఉగండా, జాంబియా, జింబాబ్వే, అబుదాబీ, దుబాయి, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, సెర్బియా, అల్బేనియా, సైప్రస్, అమెరికా తదితర దేశాల్లో సాయి సేవలు కొనసాగుతున్నాయి.


ప్రపంచంలోని సేవా సంస్థల సేవలు


సత్యసాయి బాబా స్పిరుచ్యువల్ ఆఫ్ కెనడా పేరుతో కొన్ని దేశాల్లో, యూరప్ ఖండంలోని 50 దేశాల్లో, అమెరికాలో యూఎస్ సాయి ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సాయి ఆర్గనైజేషన్, యూఎస్ సాయి సెంటర్ రిసోర్సెస్, యూఎస్‌ఏ డివోషన్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, సర్వీస్ వింగ్, యంగ్ అడల్ట్స్, సాయి బుక్ సెంటర్ కేంద్రాలు యూఎస్‌ఏ సాయి ఆర్గనైజేషన్ పరిధిలో పనిచేస్తున్నాయి. ఈ సంస్థ 66 దేశాల్లో సేవలు అందిస్తోంది.












జగమంత విషాదం * సత్యసాయి మహాభినిష్ర్కమణం

గుండె, శ్వాస వ్యవస్థల వైఫల్యం కారణంగా కన్నుమూసిన సత్యసాయి
శోకసంద్రంలో భక్త కోటి... కన్నీటిసంద్రమైన ప్రశాంతి నిలయం
నేడు, రేపు సాయి కుల్వంత్ హాల్‌లో భక్తుల సందర్శనకు పార్థివదేహం
పుట్టపర్తికి తరలివస్తున్న ప్రముఖులు.. సేవామూర్తికి కన్నీటి నివాళులు
సత్యసాయికి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్, సీఎం కిరణ్...
రేపు పుట్టపర్తికి రానున్న ప్రధాని మన్మోహన్ సింగ్

ప్రపంచమంతా ప్రేమమయం కావాలని పరితపించిన సత్యసాయిబాబా మహాభినిష్ర్కమణం చేశారు... జగమంతా విషాదంలో మునిగిపోయింది. హృదయ సంబంధ వ్యాధితో పుట్టపర్తిలోని సిమ్స్ ఆస్పత్రిలో చేరి 28 రోజులుగా చికిత్స పొందుతున్న బాబా.. ఆదివారం ఉదయం పరమపదించారు. గుండె, శ్వాస వ్యవస్థలు పనిచేయటం ఆగిపోవడంతో బాబా కన్నుమూశారని వైద్యులు వెల్లడించారు. దీంతో పుట్టపర్తి సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తజనకోటి శోకసంద్రంలో మునిగి పోయింది. బాబా పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఆదివారం సాయంత్రం ప్రశాంతి నిలయానికి తరలించారు. సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు భక్తుల సందర్శనకోసం పార్థివదేహాన్ని అక్కడే ఉంచుతారు. బుధవారం ఉదయం అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సత్యసాయి పార్థివదేహాన్ని సందర్శించేందుకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకూ వెల్లువలా తరలివస్తున్నారు.

  ‘ఈ దేహాన్ని ఎన్ని విధాలుగా పోషించినా.. ఏనాడో.. ఏ క్షణానో.. ఎలా పోతుందో.. ఎవరికీ తెలియదు. ఏనాటికైనా మృత్యువు తప్పేది కాదు.. అది సృష్టి ధర్మం కూడా..! అందుకని దేహాభిమానం విడిచిపెట్టాలి. సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి’ అని మానవ జీవిత పరమార్థాన్ని విశ్వానికి చాటిచెప్పిన సామాజిక సేవామూర్తి, అధ్యాత్మిక సూరీడు పుట్టపర్తి సత్యసాయిబాబా సృష్టి ధర్మాన్ని పాటించారు. ఆదివారం ఉదయం 7:40 గంటలకు బాబా తన భౌతికదేహాన్ని వదిలి దివికేగారు. బాబా మహాభినిష్ర్కమణం భక్తకోటిని శోకసంద్రంలో ముంచెత్తింది. భక్తుల రోదనలతో.. ఆర్తనాదాలతో పుట్టపర్తి కన్నీటి సంద్రంగా మారింది. గుండె కొట్టుకోవటం మందగించటం (స్లోయింగ్ ఆఫ్ ది హార్ట్ బీట్) వల్ల బాబాను మార్చి 28న సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు సిమ్స్ (శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్) ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎ.ఎన్.సఫాయా నేతృత్వంలో 15 మంది సభ్యులున్న వైద్య బృందం బాబాకు చికిత్స చేసింది.

హృదయ స్పందన సక్రమంగా లేకపోవటంతో బాబా శ్వాస స్వయంగా తీసుకోలేకపోయారు. దాంతో.. వెంటిలేటర్ ద్వారా కృత్రిమంగా శ్వాస అందించారు. ఆ క్రమంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరటంతో చికిత్స ద్వారా వాటిని తొలగించారు. హృదయ స్పందనను సరిచేయటం కోసం పేస్‌మేకర్‌ను అమర్చారు. యూరిన్ అవుట్‌పుట్ సరిగ్గా లేకపోవటంతో మూత్రపిండాల్లో సమస్య ఉందని గుర్తించిన వైద్యులు.. సీఆర్‌ఆర్‌టీ పద్ధతిలో డయాలసిస్ చేశారు. ఇదే తరహా చికిత్సను మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకూ అందించారు. కానీ.. వైద్యానికి బాబా అవయవాల స్పందన ఆశించిన మేరకు లేకపోయింది. ఏప్రిల్ 4న సాయంత్రం 5 గంటలకు బాబా ఆరోగ్యం విషమించింది. అయితే.. వైద్యులు అందించిన చికిత్స వల్ల ఆ సాయంత్రం 8 గంటలకే బాబా ఆరోగ్యం ఒకింత కుదుటపడింది. దాంతో.. అదే తరహా చికిత్సను కొనసాగిస్తూ వచ్చారు. ఏప్రిల్ 7న బాబాకు కామెర్లు సోకాయి. కాలేయం పూర్తిగా చెడిపోయింది. దాంతో.. బాబా మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్‌కు గురయ్యారు. అన్ని అవయవాలకు చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. ఏప్రిల్ 21 నాటికి బాబా ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఆ తర్వాత వైద్యులు అందించిన చికిత్సకు బాబా అవయవాలు స్పందించలేదు. చివరకు గుండె, శ్వాస వ్యవస్థలు చెడిపోవటంతో ఆదివారం ఉదయం 7:40 గంటలకు బాబా కన్నుమూశారు. సత్యసాయి బాబా పరమపదించినట్లు సిమ్స్ డెరైక్టర్ ఎ.ఎన్.సఫాయా ఆదివారం ఉదయం 10:15 గంటలకు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో అధికారికంగా ప్రకటించారు.

పుట్టపర్తికి తరలివస్తున్న ప్రముఖులు

బాబా పరమపదించారనే సమాచారం తెలియగానే సత్యసాయి కుటుంబ సభ్యులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సత్యసాయి కుటుంబ సభ్యులు, బంధువులు సిమ్స్‌లో బాబా పార్థివదేహం ఉన్న ఐసీయూలోకి వెళ్లి కన్నీటి నివాళులు అర్పించారు. బాబా సోదరుడు జానకిరామయ్య కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్ కన్నీటి పర్యంతమయ్యారు. బాబా ఇక లేరు అన్న వార్తను విన్న ప్రముఖులు పుట్టపర్తికి తరలివచ్చారు. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ప్రత్యేక హెలికాప్టర్‌లో 11:30 గంటలకు పుట్టపర్తికి వచ్చారు. అప్పటికే పుట్టపర్తికి చేరుకున్న మంత్రులు జె.గీతారెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి తదితరులతో కలిసి సిమ్స్‌లో ఐసీయూలో ఉన్న బాబా పార్థివదేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సాయిబాబా భౌతికంగా దూరమవ్వటం విశ్వ మానవాళికి తీరని లోటన్నారు. సత్యసాయి ట్రస్టు కార్యక్రమాలు యథాతథంగా నడుస్తాయని సీఎం భరోసా ఇచ్చారు.

ఇదే మాట ట్రస్టు సభ్యులు కూడా చెప్పారు. రాష్ట్రంలో నాలుగు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లాకు సెలవు దినంగా ప్రకటించారు. కడప ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లటానికి ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. బాబా మరణవార్త విని.. ఉప ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని పుట్టపర్తికి వచ్చారు. బాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్, తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్‌లు సిమ్స్‌లో బాబా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, నందమూరి లక్ష్మీపార్వతి, టీవీఎస్ సంస్థల అధినేత శ్రీనివాసన్, టీటీడీ మాజీ చైర్మన్ డి.కె.ఆదికేశవులు తదితరులు బాబా పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


కన్నీటి సంద్రమైన పుట్టపర్తి

సత్యసాయి బాబా భౌతికంగా ఇక లేరన్న సమాచారం విన్న పుట్టపర్తి ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. బాబా పార్థివదేహాన్ని సిమ్స్ అంబులెన్స్‌లో ఆదివారం మధ్యాహ్నం 2:25 గంటలకు సిమ్స్ నుంచి ప్రశాంతి నిలయానికి తరలించారు. సిమ్స్ నుంచి ఎనుములపల్లి బైపాస్, గోకులం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రశాంతి నిలయానికి బాబా పార్థివ దేహాన్ని తరలించే సమయంలో పుట్టపర్తి ప్రజలు అడుగడుగునా బాబాకు కన్నీటి నివాళులు అర్పించారు. కొబ్బరికాయలు కొట్టి, హారతి ఇచ్చారు. పుట్టపర్తి వీధుల్లో మహారాజులా నడయాడే బాబా మరణించాక.. ఆయన పార్థివ దేహాన్ని అంబులెన్స్‌లో ప్రశాంతి నిలయానికి తరలించటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సిమ్స్ నుంచి ప్రశాంతి నిలయానికి మధ్య దూరం మూడు కిలోమీటర్లు ఉంటుంది. రహదారికి ఇరువైపులా బారికేడ్లు, భారీ భద్రత మధ్య సిమ్స్ నుంచి అంబులెన్స్ ప్రశాంతి నిలయానికి చేరే సరికి మధ్యాహ్నం 3:45 గంటలు అయ్యింది.

ప్రశాంతి నిలయంలో నేరుగా బాబా నివాస మందిరమైన యజుర్వేద మందిరానికి పార్థివదేహాన్ని తరలించారు. అక్కడ బాబా బంధువులు సత్యసాయి పార్థివదేహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు సత్యసాయి బాబా భక్తకోటికి ఎప్పుడూ దర్శనం ఇచ్చే సాయి కుల్వంత్‌హాల్‌లోకి తెచ్చారు. ఉదయం నుంచే భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. భక్తుల సందర్శనార్థం బాబా పార్థివదేహాన్ని సోమ, మంగళవారం సాయి కుల్వంత్‌హాల్‌లోనే ఉంచుతామని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల మధ్య సాయి కుల్వంత్ హాల్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపాయి.
 

Saturday, April 23, 2011

బాబా ఇక లేరు


తెలియదు!
సర్కారుకు ఇదొక్కటే తెలుసు..!
పుట్టపర్తిలో వేలు పెట్టలేని రాష్ట్ర ప్రభత్వం

ట్రస్టుపై సమాచారమే లేని అధికారులు
ఆంధ్రా 'వాటికన్'లో ఏమవుంతుదో లెలియదు
పుట్టపర్తి ట్రస్టులో ఏం జరుగుతోంది?
ట్రస్టుకు ఎన్ని ఆస్తులున్నాయి?
మార్చి 28 కంటే ముందు సాయి ఆరోగ్యం ఎలా ఉండేది?
- ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్న సమాధానం ఒక్కటే!
'ఏమీ.. తెలియదు'!
సత్యసాయి ట్రస్టుకు సంబంధించి మన ప్రభుత్వానికి
తెలిసింది ఇదొక్కటే!

ఎన్నో సంక్షోభాలు.. ఎన్నెన్నో ఉపద్రవాలు... మరెన్నో కల్లోలాలు... అన్నింటినీ తట్టుకుని ప్రజలను ముందుకు తీసుకెళ్లే సత్తా ప్రభుత్వానికి ఉంటుంది. ఎవరి జీవితం వారిదే కానీ, అందరికీ దిశా నిర్దేశం చేయాల్సింది ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వానికే 'మైండ్ బ్లాంక్' అయింది. లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తులు! కోట్ల మంది భక్తుల ప్రేమానురాగాలను పొందిన వ్యక్తి!! కానీ అక్కడ ఏమవుతోందో... ఏం జరుగుతోందో... ప్రభుత్వానికి ఏమీ తెలీదు.

పుట్టపర్తిలో జరుగుతున్న వ్యవహారాలపై 'ఆంధ్రజ్యోతి' శరపరంపరగా కథనాలు ప్రచురిస్తుండటంతో బాబా పట్ల భక్తి విశ్వాసాలున్న అనేకమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి అసలేం జరుగుతోందో తెలపాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీనిపై అనంతపురం కలెక్టర్ స్పందిస్తూ పుట్టపర్తి సత్యసాయి ట్రస్టుకు సంబంధించి తన వద్ద తక్షణ సమాచారం ఏదీలేదని, మార్చి 28 తర్వాత ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్స గురించి మాత్రమే తెలుసునని సమాధానమిచ్చారు.

దీంతో ప్రభుత్వం మరో ప్రయత్నం మొదలు పెట్టింది. సత్యసాయి ట్రస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంపించాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి రమణాచారి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం ముఖ్య కార్యదర్శి మృత్యుంజయ సాహులకు డీవో లెటర్లు పంపింది. వారినుంచి ఇంకా నివేదికలైతే రాలేదు కానీ... తమ వద్ద సమాచారం ఏది లేదని మాత్రం వారు చెబుతున్నారు.

ఎప్పుడో 30 ఏళ్ల కిందటే సత్యసాయి ట్రస్టుకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఆదాయపు పన్నూ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపులతోపాటు ఏటేటా వార్షిక అకౌంట్ల నివేదికలను దేవాదాయ శాఖకు పంపాలన్న నిబంధనల నుంచి కూడా సడలింపు ఇచ్చింది. అంతే! గత 30 ఏళ్లలో సత్యసాయి ట్రస్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఒక్క కాగితం ముక్క కూడా లేదు. సాధారణంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు, దాతృత్య, ధార్మిక సంస్థలకు ప్రభుత్వం మినహాయింపులు ఇస్తుంది. వాటి దైనందిన కార్యకలాపాల్లో వేలు పెట్టదు.

అలాగని ఎక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వదిలేసి కూర్చోవడంపైనే ఇప్పుడు విమర్శలు తలెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థలే! స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలే. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూనే ఉంది. ప్రపంచంలో వాటికన్ సిటీకే ప్రత్యేక హోదా ఉంది. దాని పరిపాలన మొత్తం పోప్ పర్యవేక్షణలో జరుగుతుంది. పుట్టపర్తిలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. సత్యసాయి వ్యవహారాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని కానీ, జోక్యం చేసుకోవాలని కానీ ఎవరూ కోరడం లేదు.

అయితే పెను సమస్య తలెత్తినప్పుడు కూడా ప్రభుత్వం అక్కడ ద్వితీయశ్రేణి పౌరురాలిగా మారడమే తీవ్ర అభ్యంతరకరమన్న వాదన తలెత్తుతోంది. ట్రస్టులో వేలు పెట్టకూడదన్నది నిజమే కానీ, ప్రశాంతి నిలయంలో ఏం జరుగుతోందో... ఏ మందిరం కింద సెల్లార్లు ఉన్నాయో... ఆ సెల్లార్లలో ఏం జరుగుతోందో... ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి అత్యంత దీనస్థితిలో ఆస్పత్రి పాలైతే అందుకు దారి తీసిన కారణాలేమిటో ప్రభుత్వం పట్టించుకోకపోవడమే విశేషం. మరీ ఏమీ పట్టించుకోలేదంటే జనం దుమ్మెత్తి పోస్తారని భావించి సమన్వయకర్తలుగా మంత్రి గీతారెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంలను పంపింది.

వారిద్దరూ బాబా భక్తులు. దీంతో వారు ట్రస్టును అజమాయిషీ చేస్తున్నారా, ట్రస్టు సభ్యులే వారిని కంట్రోల్‌లో పెట్టుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందంటే ట్రస్టు మీద వస్తున్న విమర్శలకు అటు ట్రస్టు, ఇటు ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో... సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్.భగవతిని ఉపయోగించుకుంటున్నారు. ఇదీ మన ప్రభుత్వం!

సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు

మంథని: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, దేశ విదేశాల్లోని దాని అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపించాలంటూ కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన తోట భాస్కర్ శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియాకు ఫిర్యాదు చేశారు. ట్రస్టు ఆర్థిక అవకతవకలపై 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'లో వరసగా వస్తున్న కథనాల ఆధారంగా ట్రస్టు, దాని అనుబంధ సంస్థల్లో నల్లధనాన్ని గుర్తించి పన్నుల ఎగవేత, చట్టాల ఉల్లంఘనపై దర్యాప్తు చేయించాలని కోరారు. 1972 నుంచి 2011 మధ్య కాలంలో సత్యసాయి సేవాసంస్థల పేరిట జరిగిన ఆర్థిక లావాదేవీలు, ట్రస్టు సభ్యుల సొంత ఖాతాలు, వారి ఆస్తులపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కోరారు.

మరికొన్ని అవయవాలూ..

బాబా శరీరంలోని మరికొన్ని అవయవా లు పనిచేయని స్థితికి చేరుకుంటున్నాయి. పూర్తిగా వెంటిలేటర్‌పైనే ఉన్నందున హృద య స్పందన స్థాయి స్పష్టంగా చెప్పలేం.
- వైద్య విద్యా సంచాలకుడు రవిరాజ్

...మీరూ ప్రార్థించండి

సత్యసాయి బాబా త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నాతోపాటు నా అభిమానులు కూడా దేవుణ్ని ప్రార్థిస్తారని తలుస్తున్నాను.
- ట్విట్టర్‌లో సచిన్ టెండూల్కర్ 

మెదడు స్పందన తగ్గిపోయింది!
వైద్యుల్లో తీవ్ర ఆందోళన
వెంటిలేటర్‌పై వివాదం!

27 రోజులుగా కృత్రిమ శ్వాస
ఎంత కాలం ఇలా?
తొలగింపునకు ట్రస్ట్ నిరాకరణ!
నేడు సభ్యుల వీడియో కాన్షరెన్స్
అనంతరం విలేకరుల సమావేశం
ధర్మవరం, ఏప్రిల్ 23: సత్యసాయిబాబా మెదడు వైద్య చికిత్సకు స్పందించడం క్రమేపీ తగ్గుతోంది. ఇప్పటివరకూ శరీర అవయవాలు సక్రమంగా పనిచేయకపోయినా మెదడు పనిచేస్తుండడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తులు చికిత్సకు స్పందించకపోయినా మెదడు నుంచి సంకేతాలు ఉన్నందున కృత్రిమ శ్వాసతో వైద్య చికిత్స కొనసాగించారు.

వెంటిలేటర్తొలగించాలనే ఆలోచన వచ్చినా, దానిపై డాక్టర్లు వెనక్కి తగ్గడానికి మెదడు పని చేస్తుండడమే కారణంగా చెబుతున్నారు. అలాంటిది శనివారం రాత్రి 9 గంటల సమయంలో బాబాను పరీక్షించిన వైద్యులు మెదడు దాదాపుగా పని చేయడం లేదని నిర్ధారించినట్లు తెలిసింది. మెదడు చికిత్సకు స్పందించకపోవడంతో ఇక తాము చేయగలిగే చికిత్స దాదాపు ఏమీ లేనట్టేనని వారు తేల్చినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో సత్యసాయి ఆరోగ్యంపై పుట్టపర్తిలోను, ఇతర ప్రాంతాల్లోను ఉన్న ట్రస్టు సభ్యులు ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పుట్టపర్తిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్.భగవతి, మరికొందరు సభ్యులు పుట్టపర్తిలో ఉండగా ఇంకొందరు ఆదివారం ఉదయం చేరుకోనున్నారు. బాబా ఆరోగ్యం విషమంగా ఉండడంతో ట్రస్టు లావాదేవీలపైనా చర్చ జరగనుంది.

బాబాకు గత 27 రోజులుగా వెంటిలేటర్ ద్వారానే కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అయితే ప్రస్తుత వివాదమంతా వెంటిలేటర్ విషయంలోనే కొనసాగుతున్నట్లు సమాచారం. వెంటిలేటర్‌ను తొలగించాలని ప్రభుత్వం... అలా వీలుకాదని ట్రస్ట్‌వర్గాలు, బంధువర్గాల అభ్యంతరం..! ఇలా మొత్తం వ్యవహారం వెంటిలేటర్ చుట్టూ నడుస్తోంది. దాన్ని తొలగించాలా? వద్దా?

తొలగిస్తే పరిస్థితి ఏమిటి? లేదంటే ఎంతకాలం ఇలా? అనే అంశాలపై అటు ట్రస్ట్ వర్గాలు, ఇటు ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాబా మెదడు నుంచి ఎంతో కొంత సంకేతాలు ఉన్నందున వెంటిలేటర్‌ను తొలగించడానికి వైద్యులు జంకుతున్నారు. దీంతో 27 రోజులయినా ఇంటెన్సివ్ కేర్‌లో మొత్తం సపోర్టింగ్ సిస్టంపైనే సత్యసాయికి వైద్య చికిత్సలను అందిస్తూ వచ్చారని సమాచారం.

వెంటిలేటర్ తొలగిస్తే...!

సత్యసాయికి కృత్రిమ శ్వాస అందిస్తున్న వెంటిలేటర్‌ను తొలగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ సత్యసాయిబాబా దర్శనమిస్తారన్న బలమైన విశ్వాసంతో కొందరు భక్తులున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వెంటిలేటర్‌ను తొలగించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని ట్రస్ట్ వర్గాలు ప్రభుత్వ పెద్దల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

దేహాన్ని వీడేది, లేనిది సత్యసాయే నిర్ణయించుకుంటారని ట్రస్ట్ వర్గాలు పేర్కొంటున్నట్లు సమాచారం. భక్తులు కష్టాల్లో ఉంటే కొన్నిరోజుల పాటు వారి కష్టాలు తీర్చడానికి తాను వెళ్లానని, తిరిగి వస్తానని బాబా తనకు కలలో కనిపించి చెప్పినట్లు సింగపూర్‌కు చెందిన ఓ భక్తురాలు సత్యసాయి బంధువు శంకర్‌రాజుకు చెప్పారని పుట్టపర్తిలో ప్రచారం జరుగుతోంది.

తాను 96 ఏళ్లు జీవిస్తానని బాబా గతంలో ఒకసారి చెప్పిన విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటిలేటర్‌ను తొలగిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు అవుతుందని ట్రస్ట్‌వర్గాలతోపాటు కుటుంబీకులు కూడా అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం.

ఎంతకాలం ఇలా...?

సత్యసాయిని ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పై ఎంతకాలం ఉంచాలనే సంశయం ప్రభుత్వంలోను, వైద్యుల్లోను వ్యక్తమవుతోంది. బాబా శరీరంలోని అవయవాలు వైద్యానికి కూడా సహకరించని పరిస్థితి ఉంది. కాలేయం పూర్తిగా దెబ్బతిందని, హృదయ స్పందన కూడా తగ్గిందని వైద్యులు పేర్కొంటున్నారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నప్పటికీ శరీరంలోని అవయవాలు వైద్యానికి సహకరించి పరిస్థితి మెరుగు పడే సూచనలు ఉన్నట్లయితే వైద్యులు కూడా వెంటిలేటర్‌ను తొలగించే పరిస్థితి ఉండదు.

బాబా ఆరోగ్యం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ పరిస్థితిలో సాధారణ వ్యక్తులకైతే ఇక లాభం లేదని బంధువులకు చెప్పి వైద్యులు వాటిని తొలగించే వారని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సత్యసాయిబాబా విషయంలో ఆ సాహసం చేయలేని పరిస్థితి వైద్యుల్లో ఉంది. ఇదే పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని డాక్టర్ రవిరాజ్ కూడా పేర్కొన్నారు.

ప్రభుత్వం కలవరం

సత్యసాయి అనారోగ్యానికి గురైనప్పటినుంచి జిల్లా అధికార యంత్రాంగంతోపాటు, రాష్ట్రస్థాయి అధికారులు కూడా పుట్టపర్తిలో మకాం వేశారు. ఒక వైపు కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అక్కడ కూడా పోలీసు బలగాలు మోహరించారు.

అయినా భారీ ఎత్తున కర్నూలు, చిత్తూరు, జిల్లాల నుంచే కాకుండా గుంటూరు జిల్లా నుంచి కూడా పోలీసు బలగాలు పుట్టపర్తి బందోబస్తుకు తరలివచ్చాయి. అనంతపురం జిల్లాలోని పలు స్టేషన్లు దాదాపు ఖాళీ అయ్యాయి. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని అన్ని డివిజన్ ప్రాంతాల హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు స్టేషన్లలో ఇద్దరు లేదా ముగ్గురు కూడా పోలీసు సిబ్బంది లేరు. దీంతో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే పరిస్థితి ఏమిటన్న కలవరంలో ప్రభుత్వముంది.
హే... బాబా..!
Baba-panpu 
సత్య సాయిబాబా...పేదల కోసం తాను నిర్మించిన అత్యంత ఆధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో.. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో.. భక్తులకు కొండంత ధైర్యాన్నిచ్చే తానే కోమాలో.. ఒళ్లు తెలీని స్ధితిలో..నిర్లిప్తంగా..నిస్తేజంగా..26 రోజులుగా.. క్షణ మొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు. మందీ మార్బలానికి తక్కువ లేకపోయినా..ఆసుపత్రిలో ఆయన ఒంటరి. డాక్టర్లు రోజుకి మూడు హెల్త్‌ బులిటిన్లు విడుదల చేస్తున్నా..అసలు విష యం అంతగా అంతుబట్టని స్థితి. ఏవేవో పడికట్టు పదాలు. వైద్య పరిభాషలో..వైద్యులకే అర్ధమయ్యే సమాచారం తప్ప..బాబా శారీరక కదలికల గురించి గాని, ఆయన ఆంతరంగిక సమాచారం గురించి గాని వీసమెత్తు బయటకు రావడం లేదు. అసలింతకీ బాబా.

పడక మీద ఏ స్థితిలో ఎలా ఉండి ఉంటారన్నది భక్తులకు, సామాన్య ప్రజానీకానికి ఆసక్తి ఆందోళన కలిగిస్తున్న అంశం. అందుకే ‘సూర్య’ ఆ విషయం మీద దృష్టి సారించింది. బాబా భక్తులుగా ఉన్న వైద్య నిపుణులని, బాబాతో సంబంధం లేని డాక్టర్లతోను సంభాషించింది. బాబా ప్రస్తుతం ఆసు పత్రిలో ఎలా ఉండి ఉంటారన్నదానిపై విషయ సేకరణ జరిపింది. డాక్టర్ల అభిప్రాయాలు సేకరించింది. వారి అభిప్రాయం ప్రకారం.. నిజానికి బాబా ఎముకల గూడు మాదిరి బక్క చిక్కి శల్యమై ఓపిక లేని స్థితిలో నీరస నిస్సత్తువలతో ఉన్నారు.

baba-cartoon-color 

ఏడాది క్రితం బాబా ఆకృతిని గుండె ల్లో దాచుకున్న భక్తకోటి నేటి బాబా ఆకృతిని చూసి తట్టుకోలేకపోవచ్చు. ఏడాది క్రితం ఎంతో ఆరోగ్యంగా..హుషారుగా కనిపించిన బాబాకు ఇప్పటి బాబాకు పోలికే లేదు. అప్పట్లో బాబా ముఖంలో తెలీని వర్చస్సు. ఏదో మాట్లాడాలని చెంతకు చేరిన భక్తులు ఆ ముఖ వ ర్చస్సుకు దాసోహమై మాటలు రాక అలానే ఆయన వైపు చూస్తూ ఉండిపోయేవారు. ఆ ముఖంలో దివ్య కాంతి కనిపిస్తుం దని భక్తులు చెప్పేవారు. అదే ముఖం ప్రస్తుతం కళావిహీనమై..కనులు లోపల కు పీక్కుపోయి..ఓపిక లేని దశలో..నిస్తేజంగా ఉంది. అప్పట్లో భక్తుల మధ్యకు వస్తే చాలు రెండు చేతులూ పైకెత్తి అరచేతులు చూపుతూ అభయ హస్తమిచ్చే వారు. ఆ చేతులు ప్రస్తుతం పైకి లేవలేక మంచంపై నిర్లిప్తంగా పడి ఉన్నాయి. కాంతులు వెదజల్లే ఆ కళ్లు తెరుచుకోవడం లేదు. కోమాలో మగతగా మూసు కుపోయి ఉన్నాయి.

బంగారు సింహాసనం మీద కూర్చున్న బాబా..బంగారు రథాల మీద ఊరేగిన బాబా..ప్రస్తుతం తన శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి ఒక సపోర్టుతో మాత్రమే క్షణాలు వెళ్లదీస్తున్నారు. బాబా కిందటి నవంబరు మూడో వారంలో తన పుట్టిన రోజు వేడుకల్లోనే అనారోగ్యంగా కనిపించారు. అప్పటికే ఆయనకు పక్షవాతం సోకింది. తల ఒక పక్కకి ఒరిగిపోతున్నది. చేతులు లేవ లేని దుస్థితి. అప్పటికే ఆయన బాగా బరువు తగ్గిపోయారు. మాట చాలా తక్కు వ స్వరంలో వచ్చింది. ప్రధాని సమక్షంలో ఆయన అతి కష్టం మీద ప్రసంగి స్తుంటే ఆయన ప్రసంగ పాఠాన్ని విని తర్జుమా చేసేందుకు సంబంధీకుడు ఆయ నకు అతి దగ్గరగా ఉండి అత్యంత జాగరూకతతో విని తర్జుమా చేయాల్సి వచ్చింది. ఆ అనారోగ్యం నానాటికీ తీవ్రమవుతూ మార్చి నెలాఖరు నాటికి ఆసు పత్రికి వెళ్లక తప్పని స్థితి వచ్చింది. బాబాకు వైద్యులు అందిస్తున్న చికిత్స పూర్తి వివరాలు బయటకు రావడం లేదు. కేవలం డయాలసిస్‌, వెంటిలేటర్లు.. సీఆర్‌ ఆర్‌టీ..ఇలా పొడిపొడిగా మాత్రమే చెబుతూ..లోతైన విషయాలు బయటకు చెప్పకపోవడం పట్ల రాష్ట్రంలోని పలువురు వైద్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వైద్య పరిభాషలో చెప్పాలంటే బాబా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కు వని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చికిత్సలకు వయ స్సు ప్రధాన పాత్ర పోషిస్తుందని, బాబాకు ఇప్పుడు అదే పెద్ద అవరోధమైందని వారంటున్నారు. ఇంత పెద్ద వయస్సులో ఏ చికిత్స చేయాలన్నా వయస్సు సహ కరించదని, అవయవాలు సరిగా స్పందించవని, ఎంతటి చికిత్స అయినా ఇక్క డే విఫలమవుతుందని వారు చెబుతున్నారు. ఇన్ని వారాలుగా ఆసుపత్రి మం చం మీదున్న వ్యక్తి..బాగా బరువు కోల్పోవడం సహజమేనని కూడా వారు చెబు తున్నారు. బాబా..ప్రస్తుతం అయిదు నుంచి పది కిలోలకు పైగా బరువు కోల్పో యి ఉండొచ్చని వారి అభిప్రాయం.

బాబాకు ఎదురైన సమస్యల పరంగా చూస్తే..ఇలాంటి కేసుల్లో 50-50 అవకాశాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో కొన్ని నెలల తర్వాత కూడా పురోగతి కనిపించొచ్చని వారంటున్నారు. నిజానికి బాబాకు గతంలో ఎలాంటి అస్వస్ధతలు లేవు. ఎన్నడూ ఇతరత్రా ఆరోగ్య సమ స్యలు రాలేదు. ఆయన ఆహార నియమాలు కచ్చితంగా పాటించేవారు. నూటికి నూరు శాతం శాకాహారమే భుజించేవారు. అది కూడా అత్యంత మితాహారం. కాఫీ, టీలు తాగేవారు కాదు. బిస్కెట్లు, చాక్లెట్లు అంటే ఆయనకు అమితమైన ఇష్టం. రాగి సంకటి, వేరుశెనగ చెట్నీ అంటే మరింత ఇష్టంగా తింటారు.

నారాయణ హృదయాలయ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ ముల్పూర్‌ ఈ విష యాలను ‘సూర్య’తో పంచుకున్నారు. ఘనాహారం లేకపోవడం, డయాలసిస్‌ చేస్తుండటం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారని ఆయన చెప్పారు. ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స పొందుతున్నంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.గ్లోబల్‌ ఆసుపత్రి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ కంచర్ల రవీంద్రనాధ్‌ ఇదే అంశంపై మాట్లాడుతూ..శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ ఇతర అవయవాలకు సోకడం వల్ల బాబా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. వయస్సు పెద్దది కావడంతో చికిత్సకు అవయవాలు సహకరించడం లేదన్నారు.

దానికి తోడు రోజురోజుకి ఇతర అవయవాలు కూడా పని చేయకపోతుండటంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర వుతున్నాయన్నారు. కాలేయం చెడిపోయిన తర్వాత తిరిగి పని చేయడమన్నది అసలు జరగదని, ఈ విషయంలో వైద్యులు ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేద న్నారు. వైద్యపరంగా చూస్తే బాబా క్షేమంగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువని కేర్‌ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ అన్నారు. చికిత్సకు శరీరం కొంతవరకైనా సహకరించాలని, 25 రోజులుగా అంతా కృత్రిమంగానే నడుస్తోందని ఆయన అన్నారు. హీమో డయాలసిస్‌ తర్వాత బాబాకు సీఆర్‌ ఆర్‌టీ చేస్తున్నారని, కిడ్నీలు పని చేయనపుడు సపోర్టివ్‌ మేనేజ్‌ మెంట్‌ అవసర మవుతుందని ఆయన గుర్తు చేశారు. ఇన్‌ఫెక్షన్‌ తగ్గితే ఇమ్యూ నిటీ పెరుగు తుందని, అయితే ప్రస్తుతం ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు.

* మనుషులు చేసిన దేవుళ్లు - ఆదిత్య


 
దేవుడిని నమ్ముకోవాలా? అమ్ముకోవాలా? ఎవరైనా నమ్ముకోవాలనే చెబుతారు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. బాబాలే కాదు.. దేవుళ్లు కూడా ప్రచారాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితులు! 'గాడ్' వేరు. 'గాడ్ మ్యాన్' వేరు. ఒక నమ్మకం.. ఒక బలహీనత.. ఒక నిస్సహాయత.. వెరసి గాడ్‌ను మించిన గాడ్ మ్యాన్లు పుట్టుకు వస్తున్నారు.

గాడ్ మ్యాన్‌ని 'చిత్రపు స్వామి' అని కూడా పిలుచుకోవచ్చు. "సర్వం ఖల్విదం బ్రహ్మ'' అంటారు. కానీ, కొందరు చిత్రపు స్వాములు మాత్రం దేవుళ్లుగానే చలామణి అవుతున్నారు. వాస్తవానికి, ఈ చిత్రపు స్వాములకు తాము దైవం కంటే అధికమన్న భావన ఉండదు. కానీ, వారి చుట్టూ చేరే కొంతమంది భక్త (భజన) బృందం మాత్రం వారిని దైవంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. దీనితో ఆయా వ్యక్తులు గాడ్‌గా చలామణి అవుతూ ఉంటారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఇందులో ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఒక వ్యక్తి కొన్ని మహిమలు లేదా తాంత్రిక విద్యలు నేర్చుకున్నారనుకుందాం. తనను గురించి తానే ప్రచారం చేసుకుంటే ప్రయోజనం ఉండదు కనుక, కొంత మంది శిష్య బృందాన్ని పోగేసుకుంటారు. ఈ శిష్య బృందం సదరు వ్యక్తిని గాడ్ మ్యాన్‌గా ప్రచారం చేయడం ప్రారంభిస్తుంది. దీనితో ఒక గాడ్ మ్యాన్ అవతరిస్తాడు. ఈ దశ వరకు గాడ్ మ్యాన్‌కు శిష్యులు ఉపయోగపడతారు.

ఆ తరువాత దశలో సదరు గాడ్ మ్యాన్‌ను శిష్యులు ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. అంటే, ఉభయ కుశలోపరి సిద్ధాంతాన్ని ఆచరిస్తారన్న మాట! అయితే, గాడ్ మ్యాన్ పాపులర్ అయిన తర్వాత అసలు చిక్కు మొదలవుతుంది. గాడ్ మ్యాన్ క్రమంగా తన స్వతంత్రాన్ని కోల్పోతాడు. కోటరీగా ఏర్పడే భక్త బృందం చేతిలో బందీగా మారతాడు. గాడ్ మ్యాన్‌కు ఎన్ని మహిమలు ఉన్నా, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి.

ఈ బలహీనతలనే కోటరీ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకుని గాడ్ మ్యాన్‌ను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు. అక్కడ నుంచి గాడ్ మ్యాన్‌ను అమ్ముకోవడం ప్రారంభిస్తారు. ఈ లోపు ఏ ప్రయోజనాలనూ ఆశించని అమాయక భక్తులు కూడా తయారవుతారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రయోజనం పొందేది మాత్రం, గాడ్ మ్యాన్‌తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రమే.

పుట్టపర్తిలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వెలుగొందిన సత్యనారాయణ రాజు అలియాస్ సత్యసాయి బాబాను గాడ్ మ్యాన్ అంటే భక్తులు ఒప్పుకోకపోవచ్చు. కానీ, గాడ్‌కి, గాడ్ మ్యాన్‌కి కచ్చితంగా తేడా ఉంటుంది. సాయిబాబా విషయమైనా అంతే! ఎందుకంటే, సాయిబాబానే స్వయంగా కలియుగ దైవంగా కీర్తించబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తారు. అంటే, తాను దేవుడిని కానని బాబాకు తెలుసు.

తాను సామాన్యుడినని బాబానే స్వయం గా ఒక సందర్భంలో ప్రకటించుకున్నారు. అయినా, తెలియనట్టు నటిస్తున్నది ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కోటరీ సభ్యులే! అందుకే, అనారోగ్యంతో చివరి క్షణాలు గడుపుతున్న బాబాకు ఏమీ కాదని, ఆయన మరింత కాలం జీవిస్తారని భక్తులు విశ్వసించేటట్లు చేస్తున్నారు. బాబా దేవుడే అయితే ఈ అవతారాన్ని ఫలానా రోజు చాలిస్తున్నట్లు ముందుగానే ప్రకటించి ఉండవచ్చు. కానీ, అలా జరగలేదు కనుక ఆయన్ని గాడ్ మ్యాన్‌గానే పరిగణించవలసి ఉంటుంది.

బాబా కోరుకుంటే తనంతట తాను స్వస్థత చేకూర్చుకోగలరని రిటైర్డు ఐ.పి.ఎస్. అధికారి వి.అప్పారావు వంటి వాళ్లు వ్యాఖ్యానించ డం లేదా విశ్వసించడం విడ్డూరంగా ఉంది. పోలీసు శాఖలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన అప్పారావు వంటి వాళ్లు హేతుబద్ధత లేని వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు.

వాళ్లంతా తమకు బాబా వల్ల మేలు జరిగిందని చెబుతూ ఉంటారు. మేలు జరగకపోతే బహు శా వాళ్లు కూడా బాబాను భగవాన్‌గా సంబోధించే వారు కాదేమో! తన వేళ్లకు ఉన్న బంగారు ఉంగరాలన్నీ, చేతికి ఉన్న వాచీతో సహా బాబా ఇచ్చినవేనని అప్పారావు చెప్పుకొన్నారు. వాస్తవానికి సత్య సాయిబాబా జీవితంతోపాటు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఎన్నో వివాదాలమయం.

తన ట్రస్టుకు సమకూరుతున్న విరాళాల నుంచి కొంత మొత్తాన్ని వెచ్చించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం మొదలైన తర్వాతే బాబాకు విమర్శకులు తగ్గి, అన్ని వర్గా ల ప్రజలలో గౌరవం పెరిగింది. అయితే, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, అధికారులు, రాజకీయ ప్రముఖులు మాత్రమే బాబాకు సన్నిహితంగా మెలగగలిగారు. ఇలా బాబాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఏదో ఒక ప్రయోజనం చేకూరిన సందర్భాలు ఎన్నో ఉన్నా యి. అలా అని ఆయనను నిజంగా నమ్మిన నిస్వార్థ భక్తులు ఎవరూ లేరని చెప్పడం లేదు.

బాబా కూడా తనకు సన్నిహితమైన ప్రముఖ భక్తులకు ఏదో ఒక మేలు చేయడానికి ఎన్నడూ వెనుకాడలేదు. ఉదాహరణ కు బాబాకు పరమ భక్తుడైన రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి హెచ్.జె.దొర డి.జి.పి.గా నియమితులు కావడం వెనుక బాబా పాత్ర ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సం ఘటన జరిగింది. దొర జూనియర్ అయినందున సీనియర్ అధికారిని డి.జి.పి.గా నియమించాలని నిర్ణయించడం జరిగింది.

కానీ, తెల్లారేలోపు చంద్రబాబు నిర్ణయం మారిపోయిం ది. బాబా నుంచి వచ్చిన ఫోన్‌కాల్ వల్ల జూనియర్ అయినప్పటికీ దొరను డి.జి.పి.గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలాగే, బాబా సామాన్య భక్తుల విషయంలో ఒకలా, ప్రముఖుల విషయంలో మరోలా వ్యవహరించేవారు.

సామాన్య భక్తులు దర్శనానికి వస్తే విభూతి ఇచ్చి సరిపెట్టేవారు. అదే మంత్రులు లేదా ఉన్నతాధికారులు లేదా పౌర ప్రముఖులు వెళితే బంగారపు ఉంగరాలు, గొలుసులు లేదా రిస్ట్ వాచీలు బహూకరించేవారు. అంతేకాదు, ప్రశాంతి నిలయంలో పకడ్బందీ నెట్‌వర్క్ పనిచేస్తూ ఉంటుంది. బాబా దర్శనం కోసం వచ్చేవారి వివరాలు, వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని ఈ నెట్‌వర్క్ బాబాకు చేరవేస్తుంది.

ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. 1994కు ముందు మిత్రుడు ఒకరికి పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనను పరామర్శించడానికి నాటి మంత్రి హరిరామ జోగయ్యతో పాటు నేనూ వెళ్లాను. మంత్రి ఆస్పత్రికి వచ్చిన విషయం ఎలా తెలిసిందో గానీ, మేం ఆస్పత్రికి వెళ్లే లోపే మంత్రికి గౌరవ మర్యాదలు చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మా మిత్రుడిని పరామర్శించిన తర్వాత సాయంత్రం అందరితో పాటు మేం కూడా బాబా దర్శనం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చున్నాం.

బాబా వచ్చారు.. వెళ్లారు. కొంతసేపటికి హరిరామ జోగయ్యకు పిలుపు వచ్చింది. ఆయనను మాత్రమే బాబా సందర్శనకు అనుమతించారు. అప్పట్లో నేను విలేకరిని మాత్రమే కనుక నాకు ఆహ్వానం లేదు. బాబా యధావిధిగా జోగయ్యకు నవరత్నాల ఉంగరాన్ని బహూకరించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదనీ, 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాలంటూ నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డికి సూచించవలసిందిగా కోరారు. బాబా రాజకీయాలు మాట్లాడడంతో ఆశ్చర్యపోవడం జోగయ్య వంతు అయింది. అయి తే, బాబాను చిత్తశుద్ధితో నమ్మేవాళ్లు కూడా అందుకు బలమైన కారణాలనే చెబుతూ ఉంటారు.

నాకు తెలిసిన ఒక మిత్రుడు తన అనుభవాన్ని ఈ సందర్భంగా వివరించారు. తన కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో సదరు మిత్రు డు హైదరాబాద్‌లోనే చేర్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ సమయంలోనే తాను బాబా దర్శనానికి వెళ్లాననీ, 'నీ కుమారుడికి మద్రాసులోనే సీటు వస్తుందిలే' అని బాబా అన్నారనీ, అలాగే పదిరోజుల తర్వాత సదరు కళాశాల నుంచి సీటు ఇస్తున్నట్లు కబురు వచ్చిందని ఆ మిత్రుడు వివరించారు. ఇది బాబా మహిమగా ఆయన నమ్ముతున్నారు.

నా మిత్రుడి కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కావాలన్న విషయం ముందుగానే తెలుసుకుని తన పలుకుబడితో ఆ సీటు ఇప్పించి ఉండవచ్చు కూడా! ఏది ఏమైనా ఆ మిత్రుడికి మంచే జరిగింది కనుక, దాని లోతుపాతుల్లోకి ఇప్పుడు వెళ్లడం అనవసరం. సత్య సాయిబాబాను వేలెత్తి చూపడానికో, తప్పు పట్టడానికో ఇవన్నీ చెప్పడం లేదు. ఎవరి నమ్మకం వారిది.

కాదనే హక్కు ఎవరికీ లేదు. అయితే గాడ్‌కి, గాడ్ మ్యాన్‌కి తేడా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. తెలుగుగంగ ప్రాజెక్టు విషయమై నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాద్ వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పుట్టపర్తి వెళ్లి సత్యసాయి బాబాను దర్శనం చేసుకుందామని చంద్రబాబు అనగా, "నేను గాడ్‌ను నమ్ముతానుగానీ, గాడ్‌మెన్‌ను నమ్మను'' అని జయలలిత స్పష్టంగా చెప్పారు.

బాబాకు బంగారం పట్ల ఆసక్తి లేదనీ, బంగారం, నగలు ప్రశాంతి నిలయంలో స్వీకరించరనీ, చెక్కుల రూపంలోనే విరాళాలు స్వీకరిస్తారనీ అప్పారావులాంటి భక్తులు చెబుతున్నారు. కానీ, వాస్తవం అందుకు విరుద్ధం. బాబా నివసించే యజుర్మందిరంలోనే పలు గోడలకు బంగారు రేకులతో తాపడం చేయించారు. అంతెందుకు, 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర రెడ్డి బాబా దర్శనానికై పుట్టపర్తి వెళ్లారు.

అప్పుడు బాబా గదిలో బంగారం బిస్కెట్లు, నగలతో కూడిన పలు మూటలు ఉన్న విషయాన్ని గమనించిన ఒక అధికారి, ముఖ్యమంత్రితో బయటకు వచ్చిన తర్వాత అదే మాట చెప్పారు. "నేనూ చూశాను. అయినా, ఆ విషయాలన్నీ మనకు ఎందుకు?''అని విజయ భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. కాలక్రమంలో బాబా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆయనకు శాశ్వత కీర్తిని మిగల్చనున్నాయి. ప్రస్తుతం బాబా అనారోగ్యంతో పడుతున్న బాధను చూస్తూ ఉంటే ఆయన సుఖపడింది ఏమీ లేదని స్పష్టం అవుతోంది. బాబాను గ్లోరిఫై చేయడం కోసమే ఆయన చుట్టూ ఉన్న ట్రస్టు సభ్యులుగానీ, కోటరీ సభ్యులుగానీ బంగారు రథాల వంటివి తయారు చేయించి ఆర్భాటానికి పాల్పడి ఉండవచ్చు.

ఒక్క సత్యసాయి బాబా విషయంలోనే కాదు, పలు ఇతర స్వాముల విషయంలో కూడా ఇలాంటి ఆర్భాటాలను మనం చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక గురువులుగా చలామణి అవుతున్న వారుగానీ, మత గురువులు గానీ ఇలాంటి ఆర్భాటాలను స్వయంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్భాటం లేకపోతే తమకు గొప్పవాళ్ళుగా గుర్తింపు రాదని వారు భావిస్తూ ఉండవచ్చు. గణపతి సచ్చిదానంద స్వామినే తీసుకుందాం. ఎవరైనా భక్తుడి ఇంటికి వెళ్ళాలన్నా, కాళ్లు కడిగించుకోవాలన్నా ఆయన డబ్బు తీసుకుంటారు.

ఇక, కల్కి భగవాన్‌గా చలామణి అవుతున్న కల్కి దంపతుల ఆడంబర జీవితం గురించి తెలిసిందే! ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయవలసిన స్వాములకు, బాబాలకు డబ్బుతో అవసరం ఏమిటో తెలియదు. స్వార్థాన్ని విడనాడాలనీ, కోర్కెలను త్యజించాలనీ ప్రవచించే స్వాములెందరో విలాసవంతమైన జీవితాలనే గడుపుతూ ఉండటం విశేషం. ఈ క్రమంలో తమను తాము దైవం కంటే అధికమని భావించేవాళ్లు పుట్టుకు వస్తారు లేదా తీర్చిదిద్దబడతారు. అయితే, ఈ స్వాములందరికీ కొంతకాలమే మహర్దశ ఉంటుంది.

సత్యసాయిబాబానే తీసుకుందాం. యువతరం ఎవరూ ఆయనకు భక్తులుగా మారడం లేదు. పాత తరానికి చెందిన వాళ్లే ఆయనకు భక్తులుగా కొనసాగుతున్నారు. అభిరుచులను మార్చుకుంటున్నట్లుగానే దేవుళ్లు, స్వాముల విషయంలో కూడా భక్తుల అభిప్రాయాలు మారుతున్నాయి. ఇప్పటి తరం వాళ్లు షిరిడీ సాయిబాబాను ఆరాధించడం మొదలుపెట్టారు. కొంతకాలం క్రితం షిరిడీ సాయిబాబాకు అంతగా ఆదరణ ఉండేది కాదు.

సాధారణ మనుషులతోపాటు స్వాములు, బాబాలకే కాదు దేవాలయాలకు కూడా మహర్దశ కొంతకాలం పాటు ఉంటుంది. కొలిచే దేవుడు ఒకరే అయినా ఫలానా దేవాలయానికి వెళితే కోర్కెలు నెరవేరుతాయన్న నమ్మకం వ్యాపించడమే ఇందుకు కారణం. శ్రీ వేంకటేశ్వర స్వామినే తీసుకుందాం. దేవుడన్నాక ఎక్కడైనా దేవుడే కదా! ఇంతకాలం ఆదరణకు నోచుకోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పుడు ఎందుకు పాపులర్ అయిందంటే, దేవాలయాలకు కూడా మహర్దశ అంటూ ఒకటుంటుందని నమ్మాలి.

ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ధోరణులు పెరిగిపోయిన ఈ రోజుల్లో గాడ్ అయినా గాడ్ మ్యాన్ అయినా మార్కెటింగ్ టెక్నిక్‌లకు అతీతులు కాదని నమ్మాల్సిందే! ఇదంతా చూస్తూ ఉంటే దేవుడు మనిషిని సృష్టించాడా? మనుషులే దేవుడిని సృష్టించారా? అన్న అనుమానం కలుగకమానదు. దేవుడిని నమ్ముకోకుండా, అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. మనది కర్మభూమి కనుక, తాంత్రికులు దేవుళ్లు అవుతారు. అవినీతిపరులు మహానేతలు, యువనేతలుగా కీర్తించబడతారు. 

- ఆదిత్య

Friday, April 22, 2011

సర్వం మాయ! పుట్టపర్తిలో మహా మిస్టరీ

ఒక వైపు బాబాకు చికిత్స మరో వైపు పోలీసు బ్యాండ్ రాక

భారీ స్క్రీన్లు ,జనరేర్లూ సిద్ధం
ప్రముఖుల కోసం హెలిప్యాడ్ల ఏర్పాటు
పెద్దఎత్తున బలగాలు మోహరింపు
భక్తుల్ని తికమక పెడుతున్న చర్చలు
అంతర్జాతీయ ఆర్ధిక లావాదేవీలు చక్క బెట్టుకునేందుకేనా?
ఏ మాత్రం మార్పు లేదు
బాబా ఆరోగ్యంపై సఫాయా
 
సత్యసాయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా ప్రకటించారు. బాబా ఆరోగ్యంపై ఆయన శుక్రవారం ఉదయం, సాయంత్రం బులెటిన్లు విడుదల చేశారు. ఉదయం ఉన్న విషమ పరిస్థితే సాయంత్రం కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు. రక్తపోటు, హృదయ స్పందన నిలకడగా ఉన్నాయని, అవి అలాగే కొనసాగేందుకు మందులు అందిస్తున్నామని తెలిపారు. వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తూ మూత్రపిండాల పనితీరు మెరుగుపరచడానికి సీఆర్ఆర్ థెరపీని కొనసాగిస్తున్నామన్నారు.

అసలు పుట్టపర్తిలో ఏం జరుగుతోంది? బాబాకు ఓ వైపు చికిత్స నడుస్తోంది. మరోవైపు పోలీసు బ్యాండ్ పార్టీ పుట్టపర్తిలో వచ్చి వాలింది. ఎక్కడెక్కడి నుంచో భారీ స్క్రీన్లు తెప్పించారు. అదనపు డీజీపీ స్థాయి అధికారిని అక్కడ మోహరించి ఆరేడు వేల మంది పోలీసులను తరలించారు. ప్రముఖుల రాక కోసం హెలిప్యాడ్లు సిద్ధమవుతున్నాయి. ట్రస్టు సభ్యులు హడావుడిగా మంతనాలు జరుపుతున్నారు. బాబాకు ఒకవైపు చికిత్స జరుగుతుండగానే ఈ హడావుడంతా ఏమిటి? సత్యసాయి ట్రస్టుకు అనేక దేశాల్లో డబ్బు లావాదేవీలున్నాయని, ముందుగా వాటిని చక్కబెట్టుకునే ప్రయత్నాల్లోనే ఈ వింతలన్నీ జరుగుతున్నాయన్నది విశ్వసనీయ సమాచారం.

పుట్టపర్తిలో హైడ్రామా నడుస్తోంది. మానవ మాత్రుల ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సత్యసాయి బాబా ఆరోగ్యంలో ఒడి దుడుకులు, ఉద్విగ్న వాతావరణం సహజమే! ఒకసారి ఉన్న పరిస్థితి మరికాసేపటికి మారిపోవచ్చు. కాస్త కుదుట పడినట్లే పడి అంతలోనే ముప్పు ముంచుకురావచ్చు.. మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చు.

అనుభవజ్ఞులైన వైద్యులకు ఇదేమంత విశేషం అనిపించదు కానీ, ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తే మాత్రం అసలేం జరుగుతోందన్న ప్రశ్న అటు భక్త జనంలోనూ, ఇటు సాధారణ ప్రజల్లోనూ కలుగుతోంది. మార్చి 28న బాబాను అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పటికి, ఇప్పటికి ఆరోగ్యంలో మాత్రం మార్పులేదు. ఇన్‌ఫెక్షన్ తగ్గి ఉండవచ్చు కానీ, ఇతరత్రా మెరుగుదల ఏమాత్రం లేదు. ఆరోగ్యస్థితి ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఏ విషయాన్ని తేల్చి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.

అయితే హృదయ స్పందన పూర్తిగా నిలిచిపోయి, ఇక పునరుద్ధరణ సాధ్యం కాదని నిర్ధారణ అయితే వెంటిలేటర్ తొలగించడం చివరి అంకం అవుతుంది. బాబా శ్వాస ఆగిపోలేదని, వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది గత 25 రోజులుగా ఉన్న పరిస్థితి. మీడియా హడావుడి చేస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తోందని కొందరు ట్రస్టు సభ్యులు ఎదురుదాడి చేస్తున్నారు. కానీ, అసలు వారు చేస్తున్నదేమిటి, ప్రభుత్వం చేస్తున్నదేమిటి? అది చూసిన వారికెవరికైనా అనేక అనుమానాలు తలెత్తక మానవు.

బాబా ఆరోగ్యం వైద్యుల చేతుల్లో ఉంది. అయితే ఆయనకు చికిత్స జరుగుతుండగానే ట్రస్టు సభ్యులు హడావుడిగా సమాలోచనలు ఎందుకు జరిపారు? మిగతా సభ్యులతో మంతనాలు ఎందుకు చేశారు? అంతా సవ్యంగానే ఉంటే పుట్టపర్తిని పోలీసుమయం ఎందుకు చేశారు? అదనపు డీజీపీ స్థాయి అధికారిని అక్కడకు పంపి ఆరేడు వేల మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు ఎందుకు? ఎక్కడెక్కడి నుంచో బిగ్ స్క్రీన్లు ఎందుకు తెప్పించారు? పోలీసు బ్యాండ్ పార్టీ ముందుగానే ఎందుకు దిగింది?

ప్రముఖుల రాక కోసం హెలిప్యాడ్లు ఎందుకు సిద్ధం చేస్తున్నారు? పోనీ, ఆరోగ్యం విషమించి ఏ క్షణం ఏమైనా జరగవచ్చన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా ఇవన్నీ తెచ్చారనుకున్నా... అంతటి అత్యున్నత స్థాయి వ్యక్తి విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవచ్చా? ప్రాణాలతో పరాచికాలా? పోనీ బాబా దేహాన్ని వీడిపోతే అప్పటికప్పుడు భారీ భద్రతా ఏర్పాట్లు సాధ్యం కావన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారనే వాదన ప్రకారం చూసినా... అదే జరిగిందని వైద్యులు నిర్ధారించాక, బయటకు ప్రకటించకుండా అన్ని ఏర్పాట్లూ చేసి తర్వాత ప్రకటించవచ్చు.

ఇప్పుడు చేస్తున్నది అదే అనుకుందామంటే.... గత రెండు రోజుల నుంచీ ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మరి రెండు రోజుల వ్యవధి తీసుకొని కూడా అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? వైద్యులు చెబుతున్నట్లు ఆయన హృదయం, మెదడు స్పందిస్తోంటే ఈ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారనుకోవాలి? అని భక్త జనం నుంచి ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అయితే సత్యసాయి ట్రస్టుకు సంబంధించి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న నిధుల వ్యవహారాలను ముందుగా చక్కబెట్టుకోవడం కోసమే ఈ తతంగమంతా నడిపిస్తున్నారన్నది ఓ సమాచారం. ఆ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో కీలక ప్రకటనను నెట్టుకొస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాలూ బందీయేనా?

ట్రస్టు చేతుల్లో బాబాయే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బందీగా మారాయా? ఏది చేయాలన్నా ట్రస్టు సలహాల మేరకే నడుచుకుంటున్నాయా? వారు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనిదే అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాయా? అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇతర చోట్ల చిన్న చిన్న ఆరోపణలపై కూడా ప్రభుత్వం సూమోటో కేసులు కట్టి విచారించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే పుట్టపర్తిలోని పరిణామాలపై కేంద్ర, రాష్ట్రాలు చేతులు కట్టుకుని కూర్చోవడం అనుమానాలకు తావిస్తోంది. సత్యసాయి బాబా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ట్రస్టులో అనేక వ్యవహారాలు నడుస్తున్నట్లు భక్తుల నుంచి, కొందరు ప్రముఖుల నుంచి, కొందరు నాయకుల నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా కొన్ని ఆరోపణల్ని «ద్రువీకరిస్తున్నాయి. కానీ ప్రభుత్వ స్థాయిలో మాత్రం ఎలాంటి కదలికలు లేవు. ఆస్తులు తరలుతున్నా, పంపకాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.

బాబా ఆరోగ్యంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుంచీ ఆయనకు చికిత్స చేసి ఉంటే ఇప్పుడీ స్థితి వచ్చేది కాదని ఎంపీ నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సత్యసాయి ఆరోగ్యం క్షీణిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

మీడియా కట్టడికి యత్నాలు

బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతోపాటు శుక్రవారం ఆసుపత్రి వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. దీంతో బాబా భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున జాతీయ మీడియా ప్రతినిధులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

బాబా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బయటివారెవర్నీ ఆ ఛాయలకు కూడా వెళ్లనివ్వని ట్రస్టు సభ్యులు... సత్యసాయి బాబా ఆరోగ్యం గత రెండురోజులుగా తీవ్ర ఆందోళనకర స్థితికి చేరుకోవడంతో పంథా మార్చారు. అధికారులతోను, ప్రజా ప్రతినిధులతోను సమావేశాలు జరుపుతున్నారు. బాబా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే, ఈ చివరి దశలో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రస్టు వర్గాలు ప్రధానంగా అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి ద్వారా మీడియాను కట్టడి చేసేందుకు పావులు కదిపినట్లు తెలిసింది. పుట్టపర్తిలో జరుగుతున్న వ్యవహారాలను, అక్రమాలను మీడియా ప్రజలకు, భక్త జనానికి తెలియజేస్తుండడంతో అది మింగుడుపడని కొందరు పెద్దలు మీడియాను కట్టడి చేసే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

ఉన్నత స్ధాయి సమీక్ష
బాబా ఆరోగ్యంపై ట్రస్టు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య బృందంతో సమీక్ష జరిగింది. సమీక్షకు మంత్రి గీతారెడ్డి, డాక్టర్ సఫాయా, ప్రభుత్వ వైద్య నిపుణుడు డాక్టర్ రవిరాజా, అదనపు డీఐజీ రతన్, ఐజీ సంతోష్ మెహ్రా, అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్దన్‌రెడ్డి, డీఐజీ చారుసిన్హా, ట్రస్టు సభ్యులు రత్నాకర్, నాగానంద, గిరి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. పుట్టపర్తికి బిగ్‌స్క్రీన్లు, జనరేటర్లు, పోలీసు బ్యాండ్ బృందాలను రప్పిస్తున్న విషయమై నిమ్మల,పల్లె రఘునాథరెడ్డిలను ప్రశ్నించగా... ఆ విషయం తమకు తెలియదని, సమావేశంలో అవేవీ ప్రస్తావనకు రాలేదని చెప్పారు.

ఆఖరి ఘడియల్లో...! ఆఖరి ప్రయత్నం.....

saisai
పుట్టపర్తి బోసిపోతున్నది. ఆసుపత్రిలో బాబా అపస్మారక స్థితిలో ఆఖరు ఘడియల్లో ఉన్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రి బెడ్‌ మీద బాబా దేహానికి, ఆత్మకు మధ్య ఆఖరి చూపు నడుస్తోంది. 

ఆత్మ బాబా దేహాన్ని వీడి పరమాత్మ వద్దకు చేరే ఘడియలకు ఘడియ తొలగింది.భగవాన్‌ పుట్టపర్తి సత్యసాయిబాబా అంతిమ ఘడియకు చేరుకున్నారన్న ఒక్క విషయాన్ని ఎట్టకేలకు డాక్టర్లు ఆలస్యంగానయినా వెల్లడించారు. ఆయనకు కొద్దిరోజుల నుంచి చికిత్స చేస్తున్న డాక్టర్లతో పాటు ఆరోగ్య స్థితిని సమీక్షిస్తోన్న ప్రభుత్వం గురువారం చేసిన ప్రకటనతో.. ఇప్పటికీ అంతో ఇంతో బాబా ఆరోగ్యంపై నమ్మకంతో ఉన్న భక్తుల్లో ‘బాబా భౌతికంగా లేరేమో’నన్న అనుమానం తొలిసారిగా నిజమయ్యే పరిస్థితి వచ్చింది. బాబా అత్యంత విషమ పరి స్థితిలో ఉన్నారని, డాక్టర్లు చేయవలసిందంతా చేశారని, ఆయన ఆరోగ్యం బాగుండా లని భక్తులు దేవుడిని ప్రార్థించాలంటూ మంత్రి రఘువీరారెడ్డి పిలుపునివ్వడంతో ఇక బాబా అంతిమ ఘడియకు చేరువయ్యారన్న విషయాన్ని చెప్పలేక చెప్పినట్టయిందని భక్తులు అంటున్నారు. 
 

బాబా మెదడు బాగానే ఉంది.
కృత్రిమ ఏర్పాట్లవల్ల అవయవాలు పనిచేస్తున్నాయి,
పుట్టపర్తిలో హెలిప్యాడ్‌ల ఏర్పాటు

 పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితినిబట్టి చూస్తుంటే ప్రస్తుత పరిస్థితులలో భవిష్యత్తుగురించి ఏమీ చెప్పే పరిస్థితి లేదని డాక్టర్ రవిరాజ్ వెల్లడించారు. బాబా శరీర అవయవాలు అన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లవల్ల పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. బాబాకు సి.ఆర్.ఆర్.టి. చికిత్స కొనసాగుతున్నదని డాక్టర్ సఫాయా వెల్లడించారు.
బాబా ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం వెలువడిన బులెటిన్‌లో డాక్టర్లు ప్రత్యేక విశేషాలేమీ పేర్కొనలేదు. బాబా రక్త పోటు, హార్ట్ బీట్ నిలకడగా ఉన్నాయని, ఉదయానికి, సాయంత్రానికీ ఆరోగ్య పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే బాబా మెదడు మాత్రం బాగానే ఉందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
బాబా తిరిగి పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని కోరుతూ భక్తులు పెక్కుమంది పుట్టపర్తిలో ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతో మంది భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. అయితే ఎటువంటి వార్త వెలువడినా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు, ఉద్విగ్న పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినప్పుడు వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏ క్షణాన ఎటువంటి వార్త వెలువడినా దేశం నలుమూలలనుంచీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే పుట్టపర్తిలో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

ఏ క్షణమైనా సత్యసాయికి వెంటిలేటర్ తొలగింపు

సత్యసాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్న పేపథ్యంలో శుక్రవారం సాయంత్రంలోపల ఏ క్షణమైనా సత్యసాయికి వెంటిలేటర్‌ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే మంచి ఘడియలకోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ట్రస్ట్ సభ్యులు బాబా సన్నిహితులకు వర్తమానం పంపించారు. పుట్టపర్తి అంతా ఖాకీమయమైంది. పుట్టపర్తికి ప్రముఖులు వస్తుండడంతో అక్కడ సుమారు ఆరువేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో 144 సెక్షన్ విధిస్తూ, విమానాశ్రం వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. సత్యసాయి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఆయన భక్తులు భారీ సంఖ్యలో పుట్టపర్తికి తరలివస్తున్నారు.

పుట్టపర్తిలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు జిఏడి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బాబాను చూడటానికి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు రానున్నట్లుగా తెలుస్తోంది. బాబా అంతిమయాత్రకు పుట్టపర్తిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాబాను భక్తులందరూ చూసే విధంగా పుట్టపర్తి స్టేడియంలో బిగ్ స్క్రీన్‌లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ధర్మవరంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి మూడు హైపవర్ జెనరేటర్లు తరలించారు. ఎపిఎస్పీ రెండో బెటాలియన్ బ్యాండ్ పార్టీని కూడా తరలించారు. కడప, వరంగల్ జిల్లాకు చెందిన ఎపిఎస్పీ బెటాలియన్ పోలీసులు కర్నూలులో సిద్ధంగా ఉన్నారు. కర్నూలు ఎపిఎస్పీ బెటాలియన్ ఇప్పటికే పుట్టపర్తికి తరలి వెళ్లింది.

సత్యసాయికి అమర్చిన వెంటిలేటర్ తొలగింపుపై తర్జనభర్జలు జరుగుతున్నాయి. ఆ బాధ్యత తమదికాదంటూ, ట్రస్ట్ సభ్యులదే బాధ్యత అని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు బాబా తర్వాత ట్రస్ట్ బాధ్యత ఎవరు నిర్వహిస్తారన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మంత్రి గీతారెడ్డి ఈరోజు ఉదయం బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇప్పటికే రెండు వర్గాలుగా ట్రస్ట్ సభ్యులు విడిపోయి ఆధిపత్యంకోసం వెంపర్లాడుతున్నారు.

కాగా పుట్టపర్తి అనాధ కాకూడదని భక్తులు కోరుతున్నారు. ఆశ్రమ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. సత్యసాయిబాబా ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉందని డాక్టర్ సఫాయా తెలిపారు. సాయి ఆరోగ్యంపై బులెటిన్‌ను శుక్రవారం ఉదయం సిమ్స్ డాక్టర్లు విడుదల చేసిన సందర్భంగా సఫాయా మాట్లాడుతూ బాబాకు సిఆర్ఆర్టీ ద్వారా ఇంకా డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు.

బాబా ముఖ్య అవయవాల స్పందన అంతంత మాత్రంగానే ఉందని, గురువారానికి ఈ రోజుకు బాబా ఆరోగ్య స్థితిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. బాబా ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకు రావడానికి అందరు డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాబా యొక్క గుండె స్పందన, రక్తపోటు తగ్గుతోందని, బాబా పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ సఫాయా తెలిపారు.

చాలాకాలం నుంచి బాబాకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు చివరకు బాబా ఆరోగ్యాన్ని పరిరక్షించడం తమ వల్ల కాదని తేల్చేశారు. బాబా శరీరంలోని ఏ ఒక్క అవయవాలు పూర్తిగా పనిచేయడం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అంటే బాబా కేవలం దేహంతోనే ఉన్నారని, భౌతికంగా లేరన్న ఒక్క విషయం మాత్రం ప్రకటించలేక డాక్టర్లు దాటవేస్తున్నట్లు వరస వెంట వస్తున్న బులిటిన్లు చాటు తున్నాయి. అటు డీజీపీ కరణం అరవిందరావు సైతం పుట్టపర్తికి ఇంకా అవసరమైతే అదనపు బలగాలను పంపిస్తామని వెల్లడించారు.

అంటే అక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళితే శాంతిభద్రత సమస్య ఉత్పన్నమవుతుందని, అందుకోసం ముందుజాగ్రత్తతోనే బలగాలను సిద్ధం చేస్తున్నారని అర్ధమవుతోంది. దానికితోడు పుట్టపర్తి హోటళ్లలో బయట వారికి రూములు ఇవ్వవద్దంటూ నిషేధాజ్ఞలు విధించడం కూడా ‘బాబా మెడికల్లీ డెడ్‌’పై వస్తున్న వార్తలను మరింత ఆలోచింపచేస్తున్నాయి. గురువారం బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణ దశకు చేరుకుందన్న డాక్టర్ల ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌, డీజీపీ కరణం అరవిందరావు, ఇంటలిజెన్స్‌ డీజీ మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ పరిణామాలు పరిశీలిస్తే.. బాబా అంతిమ ఘడియలను ప్రకటించడమే తరువాయని తెలుస్తోంది.

ఆఖరి ప్రయత్నం

rest-house పుట్టపర్తి సత్య సాయి బాబా పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బాబా ఆరోగ్యంపై అటు ట్రస్టు కానీ, ఇటు వైద్యులు కానీ స్పష్టమైన ప్రకటన చేయకుండా తాత్సారం చేస్తున్నారు. మెడికల్‌ బులెటిన్‌లలో కూడా బాబా ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని చెబుతుననారు. బాబా ఆరోగ్యం నిరవధికంగా విషమ స్థితిలోనే ఉంటోంది. వైద్యం చేయడానికి అవయ వాలు సహకరించడం లేదంటూ వైద్యులు ప్రకటించారు. బాబా ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం రాకపోవడంతో అటు ప్రజలు, ఇటు భక్తులు తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ మంత్రి గీతారెడ్డి, ట్రస్టు సభ్యులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డిఐజి పలుమార్లు సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రిలో ఒకసారి, మరోసారి శాంతి భవన్‌లో, ఇంకొకమారు బంగ్లాలో ఇలా పలుమార్లు వీరం దరూ సమావేశమయ్యారు. జిల్లా కలెక్టరు జనార్ధనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబా ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తున్న మాట వాస్తవమేనన్నారు. వైద్యం చేయాలంటే ప్రధాన అవయవాలు సహకరించడం లేదని కూడా చెప్పా రు. అయినా వైద్యుల తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు.

policesపుట్టపర్తితో పాటు చుట్టపక్కల ప్రాం తాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో పాటు బాబా ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కాంక్షిస్తూ భక్తులు పూజలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే మంత్రి, వైద్యులు, ట్రస్టు సభ్యు లు తరచూ సమావేశం కావడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ట్రస్టు వ్యవహారాలపై వీరందరూ ఇంకా ఒక అవగాహనకు రాకపోవడం మూలంగానే జాపయం జరుగుతోందని, పదే పదే సమావేశమవుతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ట్రస్టు వ్యవహారాలు, వారసుని పాత్రపై ఒక నిర్ధారణకు వస్తే తప్పించి బాబా ఆరోగ్యంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకానొక దశలో శాంతిభవన్‌లో సమావేశమైన వీరితో వాదనకు దిగిన జిల్లా ఎస్పీ వీరి వ్యవహారశైలిపై మండిపడ్డట్టు సమాచారం. గురువారం వీరందరూ పలుమార్లు హడావుడి చేస్తూ సమావేశం కావడంతో పై వాదనలకు బలం చేకూరు తోంది. ఇప్పటికే పోలీసులు పుట్టపర్తిలో ఉన్న పలువురు రియల్టర్లు, బిల్డర్లను పిలిపించి హెచ్చరించినట్లు తెలిసింది. వీరితో పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జీలు, ట్రావెల్‌ యజమానులను కూడా హెచ్చరించినట్లు సమాచారం.

ఏదయినా అనుకోని సంఘటన జరిగితే మీరు కానీ, మీ వాళ్లు కానీ అతిగా స్పందించకుండా ఉండాలన్న కోణంలో వారిని పోలీసులు పిలిచి హెచ్చరించినట్లు సమాచారం. ఇక గురువారం కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సత్యసాయిబాబా బంధువులు ఒక్కొ క్కరే ఆసుపత్రిలోకి వెళ్లి వస్తున్నారు. అక్కడి విషయాలను బయటకు వెళ్లడించడానికి ముందుకు రాకుండా మీడియాకు మొహం చాటేస్తున్నారు. పుట్టపర్తిలో మాత్రం పోలీసులు హడావుడి చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి. బాబా ఉన్నా లేకున్నా ప్రశాంతి నిలయంలో ప్రతిరోజూ భజనలు, పూజలు, కీర్తనలు జరుగుతూనే ఉంటాయి.రెండు రోజుల నుంచీ పోలీసుల హడావుడి పెరగడంతో ప్రశాంతి నిల యంలోని ప్రార్థనా మందిరానికి రావడానికి కూడా విదేశీ భక్తులు, స్థానిక భక్తులు, ప్రజలు జంకుతున్నారు. బాబా ఆరోగ్యం కోసం ఆఖరి ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకునే క్రమంలోనే వైద్యులు ఇంకా ఇంకా చికిత్స పేరుతో బులిటెన్లు విడుదల చేస్తున్నారన్న ప్రచారం ఉంది.

Thursday, April 21, 2011

బాబా... ఇక లేవా ? ప్చ్. కష్టం! అంతిమ ఘడియల్లో బాబా!

ప్చ్. కష్టం!
అంతిమ ఘడియల్లో బాబా!
ఏ క్షణమైనా కీలక ప్రకటన

వైద్యానికి సహకరించని సత్యసాయి దేహం
పాడైన కిడ్నీలు, స్పందించని కాలేయం
నిస్తేజంగా మారిన బాబా కళ్లు
మారిన సఫాయా మాట
విషమమేనని ప్రకటన
ఆస్పత్రికి కలెక్టర్, డీఐజీ
పుట్టపర్తిలో హై అలర్ట్
అర్థరాత్రి దాకా సీఎం సమీక్ష
నిరంతరం కేంద్రానికి నివేదిక
హటాహుటిన రావాలని ట్రస్ట్ సభ్యులకు పిలుపు
నేడు గీతా, రఘువీరా రాక
ప్రముఖులకు 'సంకేతాలు'
"సత్యసాయి బాబా ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆయన తిరిగి ప్రశాంతి నిలయానికి వస్తారు, మాకు దర్శనమిస్తారు'' అంటూ భక్తులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలేనా? బాబా తన భౌతిక కాయాన్ని వదిలేసే ఘడియ ఇంకెంతో దూరంలో లేదా? బుధవారంనాటి పరిణామాలన్నీ ఇదే సంకేతాలను ఇచ్చాయి.
సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా విడుదల చేసిన బులెటిన్ చాలా 'ఆందోళనకరం'గా ఉంది. ఇప్పటి వరకు ఆందోళనకరంగానే ఉన్నా నిలకడగా ఉందని ప్రకటిస్తూ వచ్చిన ఆయన బుధవారం బాబా ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు.

మరోవైపు ప్రముఖులకు కొన్ని 'సంకేతాలు' అందాయి. పుట్టపర్తిని వేలాది పోలీసులు చుట్టుముట్టారు. హై అలర్ట్ ప్రకటించారు. చుట్టూ 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ బాబా భక్తుల్లో ఆందోళన పెంచుతున్నాయి. "బాబా... సాయిబాబా... నీవూ మావలె మనిషివని... నీకూ....'' అనే పాట వారి మదిలో మెదులుతూ కలతకు, కల్లోలానికి గురిచేస్తోంది.

* మంగళవారం సాయంత్రం నుంచి బాబా శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేస్తున్నాయి. కిడ్నీలు, తర్వాత లివర్, ఆ తర్వాత గుండె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం.
* మెదడు పనిచేసే స్థితిలో ఉన్నంత కాలం అది ఇచ్చే ఆదేశాలకు కళ్లలో కదలిక కనిపిస్తుంది. కానీ, బాబా కళ్లలో కదలిక ఆగిపోయింది. దీన్ని 'క్లినికల్లీ డెడ్'గా పరిగణిస్తామని, ఆయన కోలుకోవడం అసాధ్యమని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. నిర్వాణాన్ని ఎప్పుడు ప్రకటించాలన్నదే ఇక మిగిలి ఉందని ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి.
* బాబా నేత్రాలు నిస్తేజంగా మారాయి. కనుపాపలు 3 నుంచి 8 మిల్లీమీటర్లు పెరిగినట్టు (ప్యూపిల్ డైలేషన్) సమాచారం. ఇది అస్తమయానికి మరో సంకేతమని న్యూరో సర్జన్‌లు చెప్పారు.
* హుటాహుటిన పుట్టపర్తికి రావాల్సిందిగా ట్రస్టు సభ్యులందరికీ పిలుపు. బయల్దేరిన సభ్యులు. నేడు పుట్టపర్తికి రానున్న మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి.
* పుట్టపర్తి చుట్టూ 150 చెక్‌పోస్టుల ఏర్పాటు. గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి వచ్చేవారిని అడ్డుకోవడమే ధ్యేయం.
* పుట్టపర్తికి బలగాల తరలింపు. బలగాలను సిద్ధంగా ఉంచాలంటూ జిల్లాలోని పోలీసు స్టేషన్లకు ఉన్నతాధికారుల ఆదేశం.
* పుట్టపర్తిలోని భవన యజమానులు, అసోసియేషన్ల ముఖ్యులతో పోలీసుల రహస్య సమావేశాలు. ఆందోళనలు చేపట్టవద్దని, వాటికి సహకరించవద్దని, ఆశ్రయం ఇవ్వవద్దని హెచ్చరికలు.

పుట్టపర్తి పోలీసుల మయమైంది. భక్తుల్లో ఆందోళన క్షణక్షణానికీ అధికమవుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోని ప్రముఖులకు 'సంకేతాలు' వెళ్లాయి. గత 20 రోజులుగా ఒక్క పదం కూడా మార్చకుండా ఒకే రకమైన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా బుధవారంనాడు తీవ్ర ఆందోళనకరమైన పదాలతో బులెటిన్ విడుదల చేశారు.

బాబా ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు. హృదయ స్పందన నెమ్మదించడం.. లోబీపీ.. కిడ్నీలు పాడవడం.. కాలేయం స్పందించకపోవడంతో వైద్య చికిత్సకు బాబా శరీరం సహకరించడం లేదని తెలిసింది. దీంతో, సత్యసాయికి ఇక చికిత్స కొనసాగించడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వైద్య బృందం కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. కోట్లాది మంది భక్తుల హృదయాల్లో సత్యసాయిగా, పర్తిసాయిగా నిలిచిపోయిన బాబా భౌతిక దేహాన్ని వదిలివేసే ఘడియ ఇంకెంతో దూరంలో లేదన్న ఆవేదన డాక్టర్ల బృందం నివేదికలోనే స్పష్టమౌతోంది.

అసలు బాబాకు ఏం చికిత్స చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అన్న దుమారం చెలరేగినా, వివాదాస్పదుడైన కార్డియాలజిస్టు డాక్టర్ అయ్యర్ అత్యంత సమర్థుడని వెనకేసుకొచ్చిన సఫాయా... తీరా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వైద్య నిపుణుడు యోగి రామన్ నేతృత్వంలో చికిత్స జరుగుతోందని ప్రకటించి రేపటి రోజుల్లో భక్తుల ఆగ్రహం అయ్యర్ బృందంపైకి మళ్లకుండా జాగ్రత్త పడ్డారు.

బుధవారం మధ్యాహ్నం నుంచే బాబా ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. మంగళవారం వరకు వెంటిలేటర్ ద్వారా బాబాకు శ్వాస అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా నిలకడగా ఉందని చెబుతూ వచ్చిన వైద్యులు బుధవారంనాడు హృదయ స్పందన నెమ్మదించిందని ప్రకటించారు. రక్తపోటు పడిపోవడం, కాలేయం పనితీరు పూర్తిగా మందగించడం వంటి సంకేతాలు పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

బాబా కనుగుడ్ల పరిమాణం 3 నుంచి 8 మిల్లీమీటర్లకు పెరిగినట్లు సమాచారం. వైద్య పరిభాషలో దీనిని ప్యూపిల్ డైల్యూషన్‌గా పిలుస్తారు. దీనిపై వైద్య విద్య డైరెక్టర్ రవిరాజ్ ఒక న్యూరో సర్జన్‌తో మాట్లాడగా, అది 'క్లినికల్లీ డెడ్'కు సంకేతమని ఆయన చెప్పినట్లు సమాచారం. బాబా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పెదవి విరుస్తున్నారన్న సమాచారం తెలియగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. బాబాకు చికిత్స చేస్తున్న వైద్య బృందంతో సంప్రదింపులు ప్రారంభించింది.

బాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి వరకు నిరంతర సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు సత్యసాయి ఆరోగ్య పరిస్థితిని ఆయన కేంద్రానికి నివేదించినట్లు తెలిసింది. తక్షణం రావాలంటూ సమాచారం అందడంతో ట్రస్టు సభ్యులు పుట్టపర్తికి చేరుకుంటున్నారు. బుధవారం అర్థరాత్రి వరకూ జిల్లా కలెక్టర్, డీఐజీలు ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షించారు. వీటన్నిటి నేపథ్యంలో ట్రస్ట్ నిర్ణయం కోసం వైద్యులు నిరీక్షిస్తున్నారని, బాబా ఆరోగ్య పరిస్థితిపై ఏ క్షణమైనా ట్రస్ట్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, ఆ ప్రకటనను రాష్ట్ర గవర్నర్ లేదా హోం మంత్రి చేత ప్రకటింపజేయాలన్న ఆలోచనను కూడా చేస్తున్నట్లు తెలిసింది. బాబాకు అత్యంత భక్తురాలైన మంత్రి గీతారెడ్డి బుధవారం సాయంత్రం హడావుడిగా అధికారుల్ని పిలిపించి పరిస్థితిని సమీక్షించారు. ఆమె గురువారం పుట్టపర్తికి వెళ్లనున్నారు. బాబా ఆరోగ్యం క్షీణిస్తోందన్న విషయాన్ని తెలుసుకుని బుధవారం మధ్యాహ్నం నుంచే ఆమె విషాదంలో మునిగిపోయారు.

రాత్రికి రాత్రే పుట్టపర్తి వెళ్లాలని అనుకున్నా.. రైలు టికెట్ లభించకపోవడంతో గురువారం ఉదయాన్నే 6.30 గంటలకు విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమెతోపాటు మంత్రి రఘువీరారెడ్డి కూడా పుట్టపర్తికి వెళ్లనున్నారు. ఇక, వెంటనే పుట్టపర్తి చేరుకోవాలని ట్రస్టు సభ్యులందరికీ పిలుపు అందింది. వారు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా పుట్టపర్తిలో మోహరించింది.

ఇంకా వేచి చూసేదేమీ లేదు అన్నమాట ఉన్నతస్థాయి వర్గాల నుంచి వినిపిస్తోంది. మృత్యు ఘడియలు ముంచుకొస్తున్నాయన్న సంకేతాలు వెలువడడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న డీజీపీ అరవిందరావు పరిసర జిల్లాల ఎస్పీలతో పరిస్థితిని సమీక్షించారు. అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలీసు బలగాలను పుట్టపర్తికి తరలించారు. ప్రశాంతినిలయాన్ని, యజుర్మందిరాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.

క్లినికల్లీ డెడ్ అంటే..

ఇది రక్త ప్రసరణకు, శ్వాసకు సంబంధించిన పదం. గుండె క్రమబద్ధంగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు 'కార్డియాక్ అరెస్ట్' అనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో నాడి అందదు, శ్వాస క్రియ ఉండదు, కళ్లలో కార్నియా ప్రతిబింబించదు.

బ్రెయిన్ డెడ్ అంటే..

మెదడు పనిచేయడం పూర్తిగా ఆగిపోతుంది. ఊపిరి పీల్చుకోవడంతో సహా అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. కండరాలు పనిచేయవు. ఈఈజీ (ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రామ్) కొద్ది సేపటి పాటు సరళరేఖలా ఉంటుంది. 

* బుధవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చినట్లు సమాచారం... లోబీపీతో పడిపోయిన పల్స్‌రేటు* బాబా ఆరోగ్యం క్షీణించిందని, దైవమే కాపాడాలని ప్రభుత్వానికి వైద్యుల నివేదిక!* సాయంత్రానికి కాస్త కుదురుకున్న బాబా ఆరోగ్యం* బాబా కుటుంబ సభ్యులకు ఐసీయూలోకి అనుమతి* ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ట్రస్టు సభ్యుల సమావేశం.. పరిస్థితిపై సమీక్ష* అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ ఎలక్ట్రో ఫిజియాలజీ నిపుణులు డాక్టర్ యోగ్యరామన్* పుట్టపర్తిలో పటిష్ట బందోబస్తు.. 144 సెక్షన్

సత్యసాయిబాబా ఆరోగ్యంపై మరోసారి తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున సత్యసాయికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఆయనకు అమర్చిన పేస్‌మేకర్ కూడా పనిచేయలేదని, మరోదానిని అమర్చడానికి వైద్యులు ప్రయత్నించగా, బాబా శరీరం సహకరించలేదని తెలిసింది. బుధవారం సాయంత్రానికి బాబా ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు సమాచారం. బాబా ఆరోగ్యం క్షీణించిందని, బాబాకు వైద్యం చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ ఏఎన్ సఫాయా సాయంత్రం 5 గంటల బులెటిన్‌లో వెల్లడించారు. బాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, డాక్టర్లు ఇక ఏమీ చేయలేరని, దైవమే బాబాను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యులు సమాచారం పంపినట్లు తెలిసింది.

అయితే, రాత్రి 8.30 గంటలకు బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాబాకు పేస్‌మేకర్‌ను అమర్చారని, శరీరం కూడా సహకరిస్తోందని తెలిసింది. కాలేయం పని తీరు కూడా కాస్త మెరుగుపడిందని సమాచారం. బాబాకు శ్వాస అందించేందుకు రెండు ఓజోన్ సహిత సిలిండర్లు, అత్యాధునిక వెంటిలేటర్‌ను అమెరికా నుండి తెప్పిస్తున్నారు. గురువారం ఇవి పుట్టపర్తికి చేరుకోనున్నట్లు తెలిసింది. వీటిని సత్యసాయి అంతర్జాతీయ సేవా సమితి అధ్యక్షుడు గోల్డ్ స్టీన్ పంపుతున్నారని సమాచారం.

సత్యసాయి ఆరోగ్యంపై బుధవారం తెల్లవారుజాము నుంచీ తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ రవిరాజు తెల్లవారుజామున హడావుడిగా పుట్టపర్తి వచ్చి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం, కుటుంబ సభ్యులను ఐసీయూలోకి అనుమతించడం, కలెక్టర్, ఎస్పీ తదితరులూ ఆస్పత్రికి రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. బాబాకు బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో పాటు లోబీపీ వచ్చి పల్స్ రేటు పూర్తిగా పడిపోయినట్లు సమాచారం. ఇప్పటికే బాబా పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. సీరం బిలురూబిన్ శాతం కూడా స్థాయిని మించి పెరగడంతో కాలేయం సాధారణ స్థితికి రావడంలేదు. అమ్మోనియా శాతం కూడా పెరగడంతో కిడ్నీలు మరింత క్షీణించాయి.

డయాలసిస్ చేస్తున్నప్పటికీ, అనుకున్నంతగా ఫలితం రాలేదని ఆస్పత్రి వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బాబాను చూసేందుకు కుటుంబ సభ్యులను ఐసీయూలోకి అనుమతించినట్లు తెలిసింది. బాబా సోదరుడు జానకిరామయ్య సతీమణి మీనాక్షి, కుమారుడు రత్నాకర్, మనుమడు శ్రావణ్‌తో పాటు దాదాపు 10 మంది ఉదయం 11 గంటలకు ఆస్పత్రిలోకి వెళ్లారు. సాయంకాలం వరకు వారు ఆస్పత్రిలోనే గడిపారు. ఐసీయూలో బాబాను చూసి కుటుంబ సభ్యులంతా విలపించినట్లు తెలిసింది. మామూలుగా 53 కిలోల బరువున్న బాబా ప్రస్తుతం 42.72 కిలోలకు తగ్గినట్లు సమాచారం. అయితే, బాబాకు గుండె పోటు వచ్చిందన్న విషయాన్ని వైద్యులు ధ్రువీకరించలేదు.

బాబా ఆరోగ్యం విషమించిందని బుధవారం ఉదయమే వార్తలు గుప్పుమన్నాయి. రాష్ట్ర వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ రవిరాజు తెల్లవారుజామున హడావుడిగా పుట్టపర్తికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే ఉండి బాబా ఆరోగ్యాన్ని సమీక్షించారు. బాబా ఆరోగ్యంపై మీడియాకు వివరించే ఆయన, బుధవారం పత్రికా ప్రతినిధులతో మాట్లాడకుండానే హడావుడిగా బెంగళూరుకు వెళ్లిపోయారు. మధ్యా హ్నం బాబా కుటుంబీకులను ఐసీయూలోకి అనుమతించడం, జిల్లా కలెక్టరు జనార్దన్‌రెడ్డి, ఎస్పీ షహనావాజ్ ఖాసీంలు కూడా ఆస్పత్రికి రావడంతో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.


కలెక్టరు జనార్దన్‌రెడ్డి మధ్యాహ్నం 3.30 గంటలకు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. ఎస్పీ షహనావాజ్ ఖాసీం, స్థానిక తహసీల్దార్ నాగభూషణంతో రెండు గంటల పాటు ఆస్పత్రిలో సమావేశమయ్యారు. ట్రస్టు సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. బాబా ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ ప్రభుత్వానికి ఓ నివేదికను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు సమాచారం. మరోపక్క పుట్టపర్తిలో బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చే స్తున్నారు. అన్ని రహదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుండి పోలీసు బలగాలను రప్పించారు. గురువారం మరికొన్ని బలగాలు రానున్నాయి.

బాబా ఆరోగ్యం కోసం వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు: సఫాయా

సత్యసాయి ఆరోగ్యం నిలకడగా ఉందని సిమ్స్ డెరైక్టర్ ఏఎన్ సఫాయా బుధవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించారు. అయితే, సత్యసాయి ఆరోగ్యం క్షీణిస్తోందని సాయంత్రం బులెటిన్‌లో ప్రకటించారు. బాబా ఆరోగ్యం కోసం వైద్యులు 24 గంటలూ తీవ్రంగా శ్రమిస్తున్నారని, కాలేయం ఇంకా సాధారణ స్థితికి రాలేదని, బీపీ లెవల్స్ పడిపోయి లోబీపీ వచ్చిందని చెప్పారు. బీపీ సాధారణ స్థితికి తేవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులతో కలిసి సిమ్స్ వైద్యులు ముమ్మరంగా చికిత్స చేస్తున్నారని తెలిపారు. బుధవారం ప్రముఖ నెఫ్రాలజిస్ట్, వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ రవిరాజు, అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ ఎలక్ట్రో ఫిజియాలజీ నిపుణులు డాక్టర్ యోగ్యరామన్‌లు బాబాను పరీక్షించారని చెప్పారు. వీరి సూచనలను కూడా పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారానే బాబాకు శ్వాస అందిస్తున్నామని తెలిపారు. కిడ్నీలకు తెల్లవారుజామున డయాలసిస్ నిర్వహించినట్లు చెప్పారు.

పటిష్ట బందోబస్తు: డీజీపీ
కర్నూలు: సత్యసాయి బాబా ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ అరవిందరావు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం ఆయన కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో, మంత్రాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తిలో గతంలో అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, బాబా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు ప్రకటించడంతో బలగాలను తగ్గించామని చెప్పారు. అదే రీతిలో అక్కడ భద్రతను పునరుద్ధరిస్తామన్నారు. ప్రశాంతి నిలయం, సాయిబాబా భవనంతో పాటు పుట్టపర్తి గ్రామంలో వ్యాపార సముదాయాలు లూటీకి గురికాకుండా రక్షిస్తామన్నారు. సత్యసాయి ట్రస్టు వర్గాలు బాబా ఆరోగ్యంపై వాస్తవాలను దాచకుండా భక్తులకు తెలియజేయాలన్నారు. సత్యసాయి ట్రస్ట్‌పై పత్రికల్లో వస్తున్న ఆరోపణలపై కేసులు నమోదు చేస్తామన్నారు. విచారణ సమయంలో పత్రికా ప్రతినిధులు వారి వద్దనున్న ఆధారాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు.

సత్యసాయి ఆరోగ్యంపై హైకోర్టులో పిల్

హైదరాబాద్, న్యూస్‌లైన్: సత్యసాయి ఆరోగ్యం విషయంలో వాస్తవాలను వెల్లడించడంతో పాటు, ఏడాది పాటు సత్యసాయి ట్రస్ట్‌ను నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది ఎస్.హెచ్. సౌభాగ్యలక్ష్మి ఈ పిల్ దాఖలు చేశారు. బాబా గత 20 రోజులుగా ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సరైన సమాచారం ఇవ్వడంలేదని, దీంతో భక్తుల్లో ఆందోళన పెరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్ట్‌కు రూ. 1.50 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, బాబా అనారోగ్యంపాలు కావడంతో ఇవి దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తెలిపారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

నా అవయవాలు ఇస్తా
బాబా మేనల్లుడు గణపతిరాజు

సత్యసాయి బాబాకు అవసరమైతే తన అవయవాలను ఇస్తానని బాబా మేనల్లుడు గణపతిరాజు తెలిపారు. బాబా అవయవాలు సాధారణ స్థితికి రాలేవని భావిస్తే, తన అవయవాలను అమర్చాలని బుధవారం ఒక ప్రకటనలో వైద్యులను అభ్యర్థించారు. సత్యసాయి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని, దీనిని తాను అదృష్టంగా భావిస్తాన ని తెలిపారు. బాబా, తాను రక్తసంబంధీకులమైనందున అవయవాల మార్పిడి ఆశాజనక ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

'చక్ర'బంధంలో ట్రస్ట్ ఆస్తులు
సభ్యుల నియంత్రణలోనే ప్రశాంతి నిలయం

పేరుకే భారీ పహారా
ఫిర్యాదులకూ స్పందించని సర్కారు
నిఘా వర్గాలకు ఉన్నతాధికారుల మోకాలడ్డు!
పంపకాల్లో తలమునకలైన ట్రస్ట్
ప్రశాంతి నిలయంలో వారు చెప్పిందే వేదం!
వారి మాటలే.. అధికారుల ప్రకటనలు?
బాబా బంధుల్లో విభేదాలు!
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆస్తులకు భద్రత కరువైంది. దొంగల చేతిలోనే నేటికీ తాళాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. ట్రస్ట్‌లోని పలువురిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ట్రస్ట్ ఆస్తులకు భద్రత కల్పించాలని ఆందోళనలు కొనసాగుతున్నా.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

సత్యసాయి ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తులను, కోట్లాది రూపాయల విలువ చేసే బంగారం, వజ్రాల్లాంటి కానుకలను కాపాడాలని కొందరు భక్తులు పోలీసులను కోరారు. కొందరిపై ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. ట్రస్ట్ ఆస్తులను కాపాడుతున్నామని, పూచికపుల్ల కూడా తరలిపోకుండా చూస్తున్నామని సాక్షాత్తూ డీజీపీ అరవిందరావు ప్రకటించినా.. ప్రశాంతి నిలయంలో తరలింపులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సత్యసాయిబాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి దేశవ్యాప్తంగా భక్తులు ఆయన ఆరోగ్యం కోసం పూజలు, హోమాలు చేస్తుంటే.. ట్రస్ట్ వర్గాలు మాత్రం చడీ చప్పుడు కాకుండా ఆస్తుల పంపకాల్లో తలమునకలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ ప్రశాంతి నిలయం మొత్తం ట్రస్ట్‌కు సంబంధించిన సేవాదళ్ కార్యకర్తల కనుసన్నల్లోనే ఉంది. దీంతో వారికి అడ్డు చెప్పేవారే లేరు.

ప్రభుత్వాధికారులు సైతం ఇక్కడ 'సాయిరాం' అంటూ వారికి తలలూపాల్సిన పరిస్థితి ఉంది. వైద్యులు (ట్రస్ట్ నేతృత్వంలోని వారే), ట్రస్ట్‌కు సంబంధించిన వారు మినహా ఆస్పత్రిలో ఇతరులెవరూ కనిపించలేదు. రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ట్రస్ట్ వర్గాల సలహాల మేరకే ప్రకటనలు చేస్తున్నారని స్పష్టమవుతోంది.

ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు

ట్రస్ట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో తాము ఎటువంటి జోక్యం చేసుకునేది లేదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను కేవలం జిల్లా మేజిస్ట్రేట్‌గా శాం తి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపడుతున్నానని ప్రకటించారు. ట్రస్ట్ విషయాల్లో జోక్యం చేసుకోడానికి తనకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని ఆయన పేర్కొన్నారు.

పుట్టపర్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నిఘా వర్గాలు కూడా అక్కడి వ్యవహారాలపై ఆయా ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యాయనే విమర్శలు ఉ న్నాయి. అక్కడ ఏం జరుగుతోందో సమాచారం అందించాలని ఆయా ప్రభుత్వాలు వాటికి ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఏం జరుగుతున్నా పట్టించుకునే అధికారం మాత్రం ఎవరికీ లేదన్నది స్పష్టం. వీరిపైనా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.

కేంద్ర మాజీ మంత్రి, మాజీ పోలీసు బాస్ కీలకం

ట్రస్ట్ వ్యవహారాల్లో ఒక కేంద్ర మాజీ మంత్రితో పాటు.. రాష్ట్ర స్థాయిలోని ఓ మాజీ పోలీసు బాస్ కూడా ప్రభుత్వాలవైపు నుంచి ఇబ్బందులు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిసింది. మాజీ పోలీస్‌బాస్‌కు సంబంధించి దాదాపు రూ.20కోట్ల వరకు ట్రస్ట్‌లో ఇరుక్కు పోయినట్లు చెబుతున్నారు.

దీంతో ఆయన వాటిని రాబట్టుకోవడంతో పాటు మరికొంత లాభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యా రాకుండా తనకున్న సంబంధాల నేపథ్యంలో ట్రస్ట్‌పై ఈగ కూడా వాలకుండా మోకాలడ్డుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అలాగే కేంద్ర మాజీ మంత్రి కూడా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు సాగించినట్లు సమాచారం. అనేక రకాలుగా వీరికి ట్రస్ట్‌తో వీడదీయరాని ఆర్థిక సంబంధాలున్నట్లు ప్రచారముంది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ట్రస్ట్ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించటంలేదన్న వాదన వినిపిస్తోంది.

ఐఏఎస్, ఐపీఎస్‌లకూ విలువలేదు

ప్రశాంతి నిలయంలో నేటికీ ట్రస్ట్ చెప్పిందే వేదం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా ఇక్కడ ఏ మాత్రం విలువ లేదు. బాబా అస్వస్థత కారణంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని పుట్టపర్తిలో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. కానీ ట్రస్ట్‌కు సంబంధించిన వారు మాత్రం ఇవేవీ తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అధికారులు చెబుతున్నారు. పుట్టపర్తిలో దాదాపు 3వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. భారీ ఎత్తున బారికేడ్లు నిర్మించారు.

ఇవన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే చేపడుతున్నారు. కానీ.. ఈ ఏర్పాట్లన్నీ ట్రస్ట్‌లో ఆస్తులు కొల్లగొడుతున్న కొందరి రక్షణ కోసమేనా? అన్నట్లు కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం భద్రతపై సమీక్ష జరిగిందని సమాచారం. అది కూడా కేవలం ట్రస్ట్‌లోని సభ్యుల మధ్యే జరిగినట్టు తెలిసింది. ఈ సమీక్షకు జిల్లా స్థాయి, రాయలసీమ స్థాయి పోలీసు అధికారులను కూడా అనుమతించలేదని సమాచారం.

ట్రస్ట్ సభ్యులు అన్ని వ్యవహారాలకు సంబంధించిన ప్రణాళికలు రచించి తమకు అనుకూలమైన ప్రభుత్వ పెద్దలకు అందిస్తున్నారు. వారు కింది స్థాయి ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తున్నారు. దీంతో ఉరుకులు పరుగుల మీద రాష్ట్ర, జిల్లా స్థాయి ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు వారి వారి విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రాజ్యాంగేతర శక్తిగా ట్రస్ట్ నేటికీ తన హవా కొనసాగిస్తోంది. ట్రస్ట్ ఆస్తుల వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున గూడుపుఠాణీ సాగుతోంది.

భారీగానే బంగారు వస్తువులు, సత్యసాయికి కానుకల రూపంలో వచ్చిన ఇతర విలువైన వస్తువులు తరలివెళ్లాయి. వాటిని కాపాడడానికి వీలుగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఇప్పటికే పుట్టపర్తి పోలీసు స్టేషన్‌లో బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. ట్రస్ట్‌పై ఎవరికీ అధికారాలు లేవన్నట్లు ఇక్కడి అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఆస్తులకు రక్షణ ఇచ్చేదెవరన్నది ప్రశ్న.

బంధువర్గాల్లోనూ అగాధం

సత్యసాయి బంధు వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విభేదాలు పొడసూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాబాకు రెండు, మూడు కుటుంబాలు అతి సమీపంగా ఉంటున్నాయి. బాబాను అడ్డుపెట్టుకుని దండుకున్న వారంతా స్వామి సేవలో కాకుండా సొంత సేవలో మునిగిపోయారని ఇతర బంధు వర్గాలు ఆరోపిస్తున్నాయి. అస్వస్థతకు గురైన బాబా బాగోగులు పట్టించుకోకుండా మొత్తం సొంత లాభాలపైనే మక్కువ ప్రదర్శిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.

అసలు గుట్టు బయట పెట్టడానికి కూడా బాబాకు దూరంగా ఉంటున్న సంబంధీకులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే వారిని కూడా కట్టడి చేసే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి బాబాను అడ్డుపెట్టుకుని భారీగానే దండుకున్న వ్యవహారాలు అనేకం వెలుగు చూడనున్నాయని చెబుతున్నారు. 

బాబా... ఇక లేవా ?
Baba సత్యసాయిబాబా ఆరోగ్యం విషమించింది. పుట్టపర్తిలో పోలీసులు, వైద్య సిబ్బంది హడావుడి చూస్తుంటే ఇది స్పష్టమవుతోంది. గురువారం పుట్టపర్తిలో బాబా చికిత్స పొందుతున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. హడావుడి పెరిగిపోయింది. వైద్య సిబ్బంది ఆందోళనకరంగా కనిపిస్తున్నారు. తామిక చేయలేమంటూ ఆసుపత్రి డాక్టర్లు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి వద్ద పోలీసుల హడావుడి ఒక్కసారిగా పెరిగింది. చాలా రోజుల తర్వాత బంధువులను ఆసుపత్రిలోకి అనుమతించారు. సాయంత్రం నుంచి కలెక్టరు, ఎస్పీ ఆసుపత్రిలోనే గడుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇవన్నీ బాబా విషమస్థితికి సంకేతాలుగా చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన సంఘటనలన్నీ ఓ విషాద సన్నివేశానికి నాందీ ప్రస్థావనలా కనిపించాయి. ఒకసారి పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. గురువారం యథావిధిగానే బాబా ఆరోగ్యంపై ఉదయం ఎనిమిది గంటలకు ఒక మెడికల్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. అందులో బాబా ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని వెంటిలేటర్‌ సహాయం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

డయాలసిస్‌ కొనసాగిస్తూనే ఉన్నామని, ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో బాబా ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని డాక్టర్లు కూడా బాబా ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని అందులో వె ల్లడించారు. 11 గంటల సమయంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన డాక్టర్‌ రవిరాజు ఆసుపత్రిలోకి వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఆసుపత్రిలోనే గడిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం వరకూ బాబా బంధువు లను ఒక్కొక్కరినే ఆసుపత్రిలోనికి అనుమతించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరో మెడికల్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

ఇందులో బాబా ఇప్పటికీ వెంటిలేషన్‌ సపోర్టు పైనే ఉన్నారని, గురువారం డయాలసిస్‌ చేయాల్సి ఉంటుందని, ప్యానల్‌లో ఉన్న డాక్టర్లు బాబా ఆరోగ్య పరిస్థితిని 24 గంటలూ పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు గంటల నుంచి ఆసుపత్రి వద్ద పోలీసుల హడావుడి మొదలయ్యింది. అనంతపురంలో ఉన్న మొత్తం పోలీసు బలగాలు ఉన్నఫళంగా పుట్టపర్తికి చేరుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రతి పోలీసుస్టేషనులోను సెంట్రీ, సపోర్టింగ్‌ సెంట్రీ మినహాయించి అందరూ పుట్టపర్తికి వెళ్లాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక్క అనంతపురం జిల్లా నుంచే కాకుండా చిత్తూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఈ బలగాలన్నీ తెల్లవారుజాము లోపల పుట్టపర్తికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పుట్టపర్తిలో అదనంగా కొన్ని చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

అటు వైపు నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అవసరమైతే మిలటరీ సహాయం కూడా తీసుకుంటామనివారు పుట్టపర్తికి వచ్చినా ఆశ్చర్యపోవా ల్సిన పనిలేదని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. పుట్టపర్తికి మొత్తం పోలీసు బలగాలు చేరుకున్న తరువాత హడావుడి లేని సమయం చూసి బాబాను ప్రశాంతి నిలయానికి తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బాబా ను అక్కడే ఉంచి చికిత్స కొనసాగించవచ్చ న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఏ తెల్లవారు జామునే జరుగుతుందని తెలుస్తోంది. ఏదేమైనా బాబా ఆరోగ్యంపై గురువారం తెరపడే అవకాశాలున్నాయి.

బాబా ఇక లేనట్టేనా?
సత్యసాయి బాబా ఆరోగ్యం బుధవారం సాయంత్రా నికి మరింత క్షీణించింది. శరీరంలోని ఏ ఒక్క అవయవమూ బాబా స్వాధీనంలో లేదు. కనీసం డాక్టర్ల స్వాధీనంలో కూడా లేదు. రక్తపోటులో ఆటుపోట్లు కలవరం కలిగిస్తున్నాయి. కాలేయం పని తీరు సంక్లిష్టంగా మారింది. పచ్చ కామెర్లు ఇంకా తగ్గకపోగా కాలేయం కనీస స్ధాయిలో కూడా పని చేయడం లేదు. శ్వాస సైతం ఇబ్బందికరం గానే ఉంది. మూత్రపిండాల విషయం గురించి డాక్టర్లు పెదవి విప్పడం లేదు. బాబా స్పృహలో ఉన్నారా? కోమాలో ఉన్నారా? అంటే అదీ చెప్పడం లేదు. బాబా ఆరోగ్యం దారుణంగా క్షీణిం చిందని, ఆయన సజీవంగా ఉండే అవకాశాలు ఇకెంత మాత్రం లేవని పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు.

అందుకే అనంత పురం ఎస్పీ హైదరా బాదులోని డీజీపీతో మాట్లాడి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు నుంచి డాక్టర్‌ రవిరాజ్‌ పుట్టపర్తి చేరుకున్నారు. అలాగే అమెరికా నుంచి డాక్టర్‌ యోగ్యరామన్‌ వచ్చారు. బాబా శరీరంలో వస్తున్న మార్పులు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతుండటం డాక్టర్లును మరింత కలవరపరుస్తున్నది. పుట్టపర్తిలో కనిపిస్తున్న పోలీసుల హడావుడి ద్వారానే బాబా ఆరోగ్యం ఎంత విషమించిం దో అర్థమవుతోందని పుట్టవర్తిలోని స్థానికులు వ్యాఖ్యా నిస్తున్నారు.

ఇదిలా ఉండగా ట్రస్ట్‌ సభ్యులు, డాక్టర్లు ప్రస్తుత బాబా స్థితిగతులపై దీర్ఘంగా చర్చించినట్లు చెబుతున్నా రు. బాబా ఇక కోలుకునే స్థితి లేదని, వెంటిలేటర్లు తీసిన మరుక్షణం బాబా నిర్జీవులవుతారని డాక్టర్లు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే బాబా తుది ఆరోగ్య ప్రకటనను విడుదల చేసే అధికారం ఆసుపత్రి వర్గాల చేతుల్లో లేదని చెబుతున్నారు. ట్రస్ట్‌ ఏక మొత్తంగా సమావేశమై ఏకగ్రీవ నిర్ణయం చేశాకే ఆ తుది ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. కాని ట్రస్ట్‌ సభ్యులంతా ఇప్పుడు ఒకచోట కూర్చుని చర్చించగలిగే పాటి సామరస్యం ఇప్పుడు వారి మధ్య ఉందా అన్నది సందేహంగా మారింది. బాబా ఆసు పత్రిలో చేరిన దగ్గర్నుంచీ ఇప్పటి దాకా ట్రస్ట్‌ సభ్యు లంతా ఒక చోట చేరి కూర్చుని చర్చించుకున్న దాఖ లాలు లేవు.

ట్రస్ట్‌ సభ్యుల మధ్య ముఠాల కుమ్ము లాటలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ పరిస్థి తుల్లో బాబా విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ప్రశాంతి నిలయం వ్యవహారాల్లో ట్రస్ట్‌దే తుది నిర్ణయాధికారం కావడం..ఆ ట్రస్ట్‌ చైర్మన్‌ సత్య సాయిబాబాయే కావడం..ఆ మూల విరాట్టే ఇప్పుడు మంచంలో ఉండటంతో సంక్షోభం నెలకొంది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ సపాయా ఈ విషయంలో నిమిత్తమాత్రుడే అని చెబుతున్నారు. బాబా ఆరోగ్యం గురించిన కీలక సమాచారాన్ని బయటకు పొక్కనివ్వొద్దని ఆయన మీద ట్రస్ట్‌లోని కొందరి వత్తిడి పని చేస్తున్నట్లు తెలుస్తోంది. బాబాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఉన్న కారణంగా ఎలాంటి సున్నిత సమాచారమైనా వారంద రినీ క్షోభ పెడుతుందన్న సాకుతో డాక్టర్‌ సఫాయా నోరు నొక్కే శారని తెలుస్తోంది.

అందుకే ఆయన ఏ రోజుకో రోజు వెంటిలేటర్ల మీదే బాబా ఉన్నారని..కిడ్నీలకు డయాలసిస్‌ కొనసాగు తోందని మొక్కుబడి బులెటిన్లతో కాలక్షేపం చేస్తున్నా రు. అయితే బాబా ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దశలో ఆయన ఇకెంతో కాలం నిజాలు దాచిపెట్టలేని స్థితి నెలకొంది. అందుకే ఆయన బులెటిన్లలో గొంతు మారుతోంది. బాబా హృదయ స్పందనలు మందకొడి గా ఉంటున్నాయని ఆయన బుధవారం సాయంత్రం చెప్పారు. అలాగే లోబీపీతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. కాలేయం పరిస్థితి విషమంగా మారిందన్నారు.

మొత్తం మీద ఆందోళనకరంగా ఉందని ఎట్టకేలకు అంగీకరించారు. గతంలో మాదిరి ఆందోళనకరంగానే ఉన్నా సంతృప్తి కరంగా ఉందన్న వ్యాఖ్యానం మారి పోయింది. ఇది బాబా నిజ స్థితికి అద్దం పడుతోందని భక్తులు అంటున్నారు.

చవితి మంచిరోజు కాదనే...
(సూర్య ప్రధాన ప్రతినిధి): పుట్టపర్తి సత్యసాయిబాబా ‘క్లినికల్లీ డెడ్‌’వార్తలు నిజం కాదని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్‌ ప్రకటనలో నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలనుంది. బాబా ఆరోగ్యం దాదాపు క్షీణించిపోయిందని, ఆయనకు రక్తప్రసరణలో అంతరాయం కలుగుతోందని, లివర్‌ వ్యవస్థ ఆందోళనగా ఉందని బుధవారం సాయంత్రం డాక్టర్లు ప్రకటించారు. అంతకు కొద్ది సేపటికి ముందే అనంతపురంలో ఉన్న పోలీసు బలగాలను హుటిహుటిన పుట్టపర్తికి తరలిరావాలని ఆదేశాలు రావడం, ఆ మేరకు జిల్లాలో ఉన్న అదనపు పోలీసు బలగాలన్నీ పుట్టపర్తిలో మోహరించడం, ఈ హడావిడితో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్ద చేరడం చూస్తుంటే.. బాబా ఆరోగ్యం అంతిమదశకు చేరిందని, దానిపై గురువారం 12 గంటల తర్వాత ‘అసలు ప్రకటన’ వెలువడుతుందన్న ఊహాగానాలు, అనుమానాలు భక్తకోటిలో వ్యక్తమవుతున్నాయి. వారి అంచనా ప్రకారం.. బుధవారం రాత్రి 10.50 నిమిషాలకు చవితి వస్తుంది. గురువారం ఉదయం 11 గంటల తర్వాత అందరూ శుభంగా భావించే పంచమి తిథి ప్రవేశించిన అనంతరం.. బాబా జాతకం ప్రకారం నక్షత్రం చూసి ‘అసలు విషయం’ ప్రకటించే అవవకాశాలున్నట్లు చెబుతున్నారు. సెంటిమెంట్‌ ప్రకారం.. చవితి మంచిరోజు, తిథి కానందునే బాబా ‘ఆరోగ్య రహస్యాన్ని’ బయటపెట్టకుండా, ‘అసలు విషయం’ చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారని పండిత వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

బాబా ఆస్తులు జాతీయం ?
bab (సూర్య ప్రధాన ప్రతినిధి): పుట్టపర్తి సత్యసాయిబాబా అవతారం చాలించిన అనంతరం ట్రస్టును కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు ఉన్న బాబా నిర్వహిస్తున్న వివిధ సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా.. విదేశాల నుంచి భారీ మొత్తంలో విరాళాలు తరలివస్తున్నాయి. ఇప్పటివరకూ లక్ష కోట్ల రూపాయల ఆస్తి బాబా ట్రస్టు పేరిట ఉన్నట్లు ఒక అంచనా. అయితే.. బాబా హటాత్తుగాతీవ్ర అనారోగ్యానికి గురయి, గత కొద్ది గంటల నుంచి బాబా పరిస్థితి ‘అత్యంత విషమంగా’ ఉందని ధృవపడుతోంది. అయితే.. బాబా అనారోగ్యానికి గురయిన తొలి నాళ్ల నుంచే ట్రస్టుకు చెందిన నిధులు దొంగలపాలవుతున్నాయని, ట్రస్టుకు చెందిన కొందరు, ఇద్దరు మంత్రులకూ ఇందులో వాటాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే బాబా గత నెల 28 నుంచి ఆసుపత్రిలో చేరిన తర్వాత ట్రస్టు నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం బహిరంగంగానే చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం అసలు పుట్టపర్తిలో ఏం జరుగుతోందో తెలుసుకొని, నివేదిక సమర్పించాలని హోంమంత్రిత్వ శాఖ నిఘా వర్గాలను ఆదేశించింది. దానితో రంగంలోకి దిగిన వేగులు పుట్టపర్తిలోని బాబా ట్రస్టు అధీనంలో ఉన్న నగదు, నగలకు రక్షణ లేదని స్పష్టం చేసింది. అదే నివేదికను కేంద్రానికి సమర్పించింది.
అటు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా పుట్టపర్తి బాబా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంతో పాటు, ట్రస్టులో ఏం జరుగుతోందో ప్రధాని ఆరా తీశారు.

ట్రస్టుకు చెందిన సంపద ప్రైవేటు వ్యక్తుల అధీనంలోకి వెళ్లకుండా ఉండా లంటే ట్రస్టును జాతీయం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ముందు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిం చాలని, ఆ తర్వాత ట్రస్టును స్వాధీనం చేసుకోవాలని యోచిస్తో న్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా, న్యాయపరంగా ప్రభుత్వానికి ట్రస్టును స్వాధీనం చేసుకునే అధికారం లేదని, ట్రస్టుపై ఎవరైనా ఆరోపణలు చేస్తే, దానిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపి, ఆయన ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత.. టీడీడీ తరహాలో పాలకమండలిని ఏర్పాటుచేయవచ్చని సమాచారం.