ప్చ్. కష్టం!
అంతిమ ఘడియల్లో బాబా!
ఏ క్షణమైనా కీలక ప్రకటన
వైద్యానికి సహకరించని సత్యసాయి దేహం
పాడైన కిడ్నీలు, స్పందించని కాలేయం
నిస్తేజంగా మారిన బాబా కళ్లు
మారిన సఫాయా మాట
విషమమేనని ప్రకటన
ఆస్పత్రికి కలెక్టర్, డీఐజీ
పుట్టపర్తిలో హై అలర్ట్
అర్థరాత్రి దాకా సీఎం సమీక్ష
నిరంతరం కేంద్రానికి నివేదిక
హటాహుటిన రావాలని ట్రస్ట్ సభ్యులకు పిలుపు
నేడు గీతా, రఘువీరా రాక
ప్రముఖులకు 'సంకేతాలు'

"సత్యసాయి బాబా ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆయన తిరిగి ప్రశాంతి నిలయానికి వస్తారు, మాకు దర్శనమిస్తారు'' అంటూ భక్తులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలేనా? బాబా తన భౌతిక కాయాన్ని వదిలేసే ఘడియ ఇంకెంతో దూరంలో లేదా? బుధవారంనాటి పరిణామాలన్నీ ఇదే సంకేతాలను ఇచ్చాయి. 
సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా విడుదల చేసిన బులెటిన్ చాలా 'ఆందోళనకరం'గా ఉంది. ఇప్పటి వరకు ఆందోళనకరంగానే ఉన్నా నిలకడగా ఉందని ప్రకటిస్తూ వచ్చిన ఆయన బుధవారం బాబా ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు.
మరోవైపు ప్రముఖులకు కొన్ని 'సంకేతాలు' అందాయి. పుట్టపర్తిని వేలాది పోలీసులు చుట్టుముట్టారు. హై అలర్ట్ ప్రకటించారు. చుట్టూ 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ బాబా భక్తుల్లో ఆందోళన పెంచుతున్నాయి. "బాబా... సాయిబాబా... నీవూ మావలె మనిషివని... నీకూ....'' అనే పాట వారి మదిలో మెదులుతూ కలతకు, కల్లోలానికి గురిచేస్తోంది.
* మంగళవారం సాయంత్రం నుంచి బాబా శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేస్తున్నాయి. కిడ్నీలు, తర్వాత లివర్, ఆ తర్వాత గుండె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం.
* మెదడు పనిచేసే స్థితిలో ఉన్నంత కాలం అది ఇచ్చే ఆదేశాలకు కళ్లలో కదలిక కనిపిస్తుంది. కానీ, బాబా కళ్లలో కదలిక ఆగిపోయింది. దీన్ని 'క్లినికల్లీ డెడ్'గా పరిగణిస్తామని, ఆయన కోలుకోవడం అసాధ్యమని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. నిర్వాణాన్ని ఎప్పుడు ప్రకటించాలన్నదే ఇక మిగిలి ఉందని ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి.
* బాబా నేత్రాలు నిస్తేజంగా మారాయి. కనుపాపలు 3 నుంచి 8 మిల్లీమీటర్లు పెరిగినట్టు (ప్యూపిల్ డైలేషన్) సమాచారం. ఇది అస్తమయానికి మరో సంకేతమని న్యూరో సర్జన్‌లు చెప్పారు.
* హుటాహుటిన పుట్టపర్తికి రావాల్సిందిగా ట్రస్టు సభ్యులందరికీ పిలుపు. బయల్దేరిన సభ్యులు. నేడు పుట్టపర్తికి రానున్న మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి.
* పుట్టపర్తి చుట్టూ 150 చెక్‌పోస్టుల ఏర్పాటు. గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి వచ్చేవారిని అడ్డుకోవడమే ధ్యేయం.
* పుట్టపర్తికి బలగాల తరలింపు. బలగాలను సిద్ధంగా ఉంచాలంటూ జిల్లాలోని పోలీసు స్టేషన్లకు ఉన్నతాధికారుల ఆదేశం.
* పుట్టపర్తిలోని భవన యజమానులు, అసోసియేషన్ల ముఖ్యులతో పోలీసుల రహస్య సమావేశాలు. ఆందోళనలు చేపట్టవద్దని, వాటికి సహకరించవద్దని, ఆశ్రయం ఇవ్వవద్దని హెచ్చరికలు.
పుట్టపర్తి పోలీసుల మయమైంది. భక్తుల్లో ఆందోళన క్షణక్షణానికీ అధికమవుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోని ప్రముఖులకు 'సంకేతాలు' వెళ్లాయి. గత 20 రోజులుగా ఒక్క పదం కూడా మార్చకుండా ఒకే రకమైన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా బుధవారంనాడు తీవ్ర ఆందోళనకరమైన పదాలతో బులెటిన్ విడుదల చేశారు.
బాబా ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు. హృదయ స్పందన నెమ్మదించడం.. లోబీపీ.. కిడ్నీలు పాడవడం.. కాలేయం స్పందించకపోవడంతో వైద్య చికిత్సకు బాబా శరీరం సహకరించడం లేదని తెలిసింది. దీంతో, సత్యసాయికి ఇక చికిత్స కొనసాగించడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వైద్య బృందం కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. కోట్లాది మంది భక్తుల హృదయాల్లో సత్యసాయిగా, పర్తిసాయిగా నిలిచిపోయిన బాబా భౌతిక దేహాన్ని వదిలివేసే ఘడియ ఇంకెంతో దూరంలో లేదన్న ఆవేదన డాక్టర్ల బృందం నివేదికలోనే స్పష్టమౌతోంది.
అసలు బాబాకు ఏం చికిత్స చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అన్న దుమారం చెలరేగినా, వివాదాస్పదుడైన కార్డియాలజిస్టు డాక్టర్ అయ్యర్ అత్యంత సమర్థుడని వెనకేసుకొచ్చిన సఫాయా... తీరా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వైద్య నిపుణుడు యోగి రామన్ నేతృత్వంలో చికిత్స జరుగుతోందని ప్రకటించి రేపటి రోజుల్లో భక్తుల ఆగ్రహం అయ్యర్ బృందంపైకి మళ్లకుండా జాగ్రత్త పడ్డారు.
బుధవారం మధ్యాహ్నం నుంచే బాబా ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. మంగళవారం వరకు వెంటిలేటర్ ద్వారా బాబాకు శ్వాస అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా నిలకడగా ఉందని చెబుతూ వచ్చిన వైద్యులు బుధవారంనాడు హృదయ స్పందన నెమ్మదించిందని ప్రకటించారు. రక్తపోటు పడిపోవడం, కాలేయం పనితీరు పూర్తిగా మందగించడం వంటి సంకేతాలు పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
బాబా కనుగుడ్ల పరిమాణం 3 నుంచి 8 మిల్లీమీటర్లకు పెరిగినట్లు సమాచారం. వైద్య పరిభాషలో దీనిని ప్యూపిల్ డైల్యూషన్‌గా పిలుస్తారు. దీనిపై వైద్య విద్య డైరెక్టర్ రవిరాజ్ ఒక న్యూరో సర్జన్‌తో మాట్లాడగా, అది 'క్లినికల్లీ డెడ్'కు సంకేతమని ఆయన చెప్పినట్లు సమాచారం. బాబా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పెదవి విరుస్తున్నారన్న సమాచారం తెలియగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. బాబాకు చికిత్స చేస్తున్న వైద్య బృందంతో సంప్రదింపులు ప్రారంభించింది.
బాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి వరకు నిరంతర సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు సత్యసాయి ఆరోగ్య పరిస్థితిని ఆయన కేంద్రానికి నివేదించినట్లు తెలిసింది. తక్షణం రావాలంటూ సమాచారం అందడంతో ట్రస్టు సభ్యులు పుట్టపర్తికి చేరుకుంటున్నారు. బుధవారం అర్థరాత్రి వరకూ జిల్లా కలెక్టర్, డీఐజీలు ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షించారు. వీటన్నిటి నేపథ్యంలో ట్రస్ట్ నిర్ణయం కోసం వైద్యులు నిరీక్షిస్తున్నారని, బాబా ఆరోగ్య పరిస్థితిపై ఏ క్షణమైనా ట్రస్ట్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, ఆ ప్రకటనను రాష్ట్ర గవర్నర్ లేదా హోం మంత్రి చేత ప్రకటింపజేయాలన్న ఆలోచనను కూడా చేస్తున్నట్లు తెలిసింది. బాబాకు అత్యంత భక్తురాలైన మంత్రి గీతారెడ్డి బుధవారం సాయంత్రం హడావుడిగా అధికారుల్ని పిలిపించి పరిస్థితిని సమీక్షించారు. ఆమె గురువారం పుట్టపర్తికి వెళ్లనున్నారు. బాబా ఆరోగ్యం క్షీణిస్తోందన్న విషయాన్ని తెలుసుకుని బుధవారం మధ్యాహ్నం నుంచే ఆమె విషాదంలో మునిగిపోయారు.
రాత్రికి రాత్రే పుట్టపర్తి వెళ్లాలని అనుకున్నా.. రైలు టికెట్ లభించకపోవడంతో గురువారం ఉదయాన్నే 6.30 గంటలకు విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమెతోపాటు మంత్రి రఘువీరారెడ్డి కూడా పుట్టపర్తికి వెళ్లనున్నారు. ఇక, వెంటనే పుట్టపర్తి చేరుకోవాలని ట్రస్టు సభ్యులందరికీ పిలుపు అందింది. వారు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా పుట్టపర్తిలో మోహరించింది.
ఇంకా వేచి చూసేదేమీ లేదు అన్నమాట ఉన్నతస్థాయి వర్గాల నుంచి వినిపిస్తోంది. మృత్యు ఘడియలు ముంచుకొస్తున్నాయన్న సంకేతాలు వెలువడడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న డీజీపీ అరవిందరావు పరిసర జిల్లాల ఎస్పీలతో పరిస్థితిని సమీక్షించారు. అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలీసు బలగాలను పుట్టపర్తికి తరలించారు. ప్రశాంతినిలయాన్ని, యజుర్మందిరాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.
క్లినికల్లీ డెడ్ అంటే..
ఇది రక్త ప్రసరణకు, శ్వాసకు సంబంధించిన పదం. గుండె క్రమబద్ధంగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు 'కార్డియాక్ అరెస్ట్' అనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో నాడి అందదు, శ్వాస క్రియ ఉండదు, కళ్లలో కార్నియా ప్రతిబింబించదు.
బ్రెయిన్ డెడ్ అంటే..
మెదడు పనిచేయడం పూర్తిగా ఆగిపోతుంది. ఊపిరి పీల్చుకోవడంతో సహా అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. కండరాలు పనిచేయవు. ఈఈజీ (ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రామ్) కొద్ది సేపటి పాటు సరళరేఖలా ఉంటుంది.

* బుధవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చినట్లు సమాచారం... లోబీపీతో పడిపోయిన పల్స్‌రేటు* బాబా ఆరోగ్యం క్షీణించిందని, దైవమే కాపాడాలని ప్రభుత్వానికి వైద్యుల నివేదిక!* సాయంత్రానికి కాస్త కుదురుకున్న బాబా ఆరోగ్యం* బాబా కుటుంబ సభ్యులకు ఐసీయూలోకి అనుమతి* ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ట్రస్టు సభ్యుల సమావేశం.. పరిస్థితిపై సమీక్ష* అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ ఎలక్ట్రో ఫిజియాలజీ నిపుణులు డాక్టర్ యోగ్యరామన్* పుట్టపర్తిలో పటిష్ట బందోబస్తు.. 144 సెక్షన్
సత్యసాయిబాబా ఆరోగ్యంపై మరోసారి తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున సత్యసాయికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఆయనకు అమర్చిన పేస్‌మేకర్ కూడా పనిచేయలేదని, మరోదానిని అమర్చడానికి వైద్యులు ప్రయత్నించగా, బాబా శరీరం సహకరించలేదని తెలిసింది. బుధవారం సాయంత్రానికి బాబా ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు సమాచారం. బాబా ఆరోగ్యం క్షీణించిందని, బాబాకు వైద్యం చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ ఏఎన్ సఫాయా సాయంత్రం 5 గంటల బులెటిన్‌లో వెల్లడించారు. బాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, డాక్టర్లు ఇక ఏమీ చేయలేరని, దైవమే బాబాను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యులు సమాచారం పంపినట్లు తెలిసింది.
అయితే, రాత్రి 8.30 గంటలకు బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాబాకు పేస్‌మేకర్‌ను అమర్చారని, శరీరం కూడా సహకరిస్తోందని తెలిసింది. కాలేయం పని తీరు కూడా కాస్త మెరుగుపడిందని సమాచారం. బాబాకు శ్వాస అందించేందుకు రెండు ఓజోన్ సహిత సిలిండర్లు, అత్యాధునిక వెంటిలేటర్‌ను అమెరికా నుండి తెప్పిస్తున్నారు. గురువారం ఇవి పుట్టపర్తికి చేరుకోనున్నట్లు తెలిసింది. వీటిని సత్యసాయి అంతర్జాతీయ సేవా సమితి అధ్యక్షుడు గోల్డ్ స్టీన్ పంపుతున్నారని సమాచారం.
సత్యసాయి ఆరోగ్యంపై బుధవారం తెల్లవారుజాము నుంచీ తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ రవిరాజు తెల్లవారుజామున హడావుడిగా పుట్టపర్తి వచ్చి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం, కుటుంబ సభ్యులను ఐసీయూలోకి అనుమతించడం, కలెక్టర్, ఎస్పీ తదితరులూ ఆస్పత్రికి రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. బాబాకు బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో పాటు లోబీపీ వచ్చి పల్స్ రేటు పూర్తిగా పడిపోయినట్లు సమాచారం. ఇప్పటికే బాబా పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. సీరం బిలురూబిన్ శాతం కూడా స్థాయిని మించి పెరగడంతో కాలేయం సాధారణ స్థితికి రావడంలేదు. అమ్మోనియా శాతం కూడా పెరగడంతో కిడ్నీలు మరింత క్షీణించాయి.
డయాలసిస్ చేస్తున్నప్పటికీ, అనుకున్నంతగా ఫలితం రాలేదని ఆస్పత్రి వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బాబాను చూసేందుకు కుటుంబ సభ్యులను ఐసీయూలోకి అనుమతించినట్లు తెలిసింది. బాబా సోదరుడు జానకిరామయ్య సతీమణి మీనాక్షి, కుమారుడు రత్నాకర్, మనుమడు శ్రావణ్‌తో పాటు దాదాపు 10 మంది ఉదయం 11 గంటలకు ఆస్పత్రిలోకి వెళ్లారు. సాయంకాలం వరకు వారు ఆస్పత్రిలోనే గడిపారు. ఐసీయూలో బాబాను చూసి కుటుంబ సభ్యులంతా విలపించినట్లు తెలిసింది. మామూలుగా 53 కిలోల బరువున్న బాబా ప్రస్తుతం 42.72 కిలోలకు తగ్గినట్లు సమాచారం. అయితే, బాబాకు గుండె పోటు వచ్చిందన్న విషయాన్ని వైద్యులు ధ్రువీకరించలేదు.
బాబా ఆరోగ్యం విషమించిందని బుధవారం ఉదయమే వార్తలు గుప్పుమన్నాయి. రాష్ట్ర వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ రవిరాజు తెల్లవారుజామున హడావుడిగా పుట్టపర్తికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే ఉండి బాబా ఆరోగ్యాన్ని సమీక్షించారు. బాబా ఆరోగ్యంపై మీడియాకు వివరించే ఆయన, బుధవారం పత్రికా ప్రతినిధులతో మాట్లాడకుండానే హడావుడిగా బెంగళూరుకు వెళ్లిపోయారు. మధ్యా హ్నం బాబా కుటుంబీకులను ఐసీయూలోకి అనుమతించడం, జిల్లా కలెక్టరు జనార్దన్‌రెడ్డి, ఎస్పీ షహనావాజ్ ఖాసీంలు కూడా ఆస్పత్రికి రావడంతో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
కలెక్టరు జనార్దన్‌రెడ్డి మధ్యాహ్నం 3.30 గంటలకు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. ఎస్పీ షహనావాజ్ ఖాసీం, స్థానిక తహసీల్దార్ నాగభూషణంతో రెండు గంటల పాటు ఆస్పత్రిలో సమావేశమయ్యారు. ట్రస్టు సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. బాబా ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ ప్రభుత్వానికి ఓ నివేదికను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు సమాచారం. మరోపక్క పుట్టపర్తిలో బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చే స్తున్నారు. అన్ని రహదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుండి పోలీసు బలగాలను రప్పించారు. గురువారం మరికొన్ని బలగాలు రానున్నాయి.
బాబా ఆరోగ్యం కోసం వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు: సఫాయా
సత్యసాయి ఆరోగ్యం నిలకడగా ఉందని సిమ్స్ డెరైక్టర్ ఏఎన్ సఫాయా బుధవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించారు. అయితే, సత్యసాయి ఆరోగ్యం క్షీణిస్తోందని సాయంత్రం బులెటిన్‌లో ప్రకటించారు. బాబా ఆరోగ్యం కోసం వైద్యులు 24 గంటలూ తీవ్రంగా శ్రమిస్తున్నారని, కాలేయం ఇంకా సాధారణ స్థితికి రాలేదని, బీపీ లెవల్స్ పడిపోయి లోబీపీ వచ్చిందని చెప్పారు. బీపీ సాధారణ స్థితికి తేవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులతో కలిసి సిమ్స్ వైద్యులు ముమ్మరంగా చికిత్స చేస్తున్నారని తెలిపారు. బుధవారం ప్రముఖ నెఫ్రాలజిస్ట్, వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ రవిరాజు, అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ ఎలక్ట్రో ఫిజియాలజీ నిపుణులు డాక్టర్ యోగ్యరామన్‌లు బాబాను పరీక్షించారని చెప్పారు. వీరి సూచనలను కూడా పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారానే బాబాకు శ్వాస అందిస్తున్నామని తెలిపారు. కిడ్నీలకు తెల్లవారుజామున డయాలసిస్ నిర్వహించినట్లు చెప్పారు.
పటిష్ట బందోబస్తు: డీజీపీ
కర్నూలు: సత్యసాయి బాబా ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ అరవిందరావు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం ఆయన కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో, మంత్రాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తిలో గతంలో అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, బాబా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు ప్రకటించడంతో బలగాలను తగ్గించామని చెప్పారు. అదే రీతిలో అక్కడ భద్రతను పునరుద్ధరిస్తామన్నారు. ప్రశాంతి నిలయం, సాయిబాబా భవనంతో పాటు పుట్టపర్తి గ్రామంలో వ్యాపార సముదాయాలు లూటీకి గురికాకుండా రక్షిస్తామన్నారు. సత్యసాయి ట్రస్టు వర్గాలు బాబా ఆరోగ్యంపై వాస్తవాలను దాచకుండా భక్తులకు తెలియజేయాలన్నారు. సత్యసాయి ట్రస్ట్‌పై పత్రికల్లో వస్తున్న ఆరోపణలపై కేసులు నమోదు చేస్తామన్నారు. విచారణ సమయంలో పత్రికా ప్రతినిధులు వారి వద్దనున్న ఆధారాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు.
సత్యసాయి ఆరోగ్యంపై హైకోర్టులో పిల్
హైదరాబాద్, న్యూస్‌లైన్: సత్యసాయి ఆరోగ్యం విషయంలో వాస్తవాలను వెల్లడించడంతో పాటు, ఏడాది పాటు సత్యసాయి ట్రస్ట్‌ను నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది ఎస్.హెచ్. సౌభాగ్యలక్ష్మి ఈ పిల్ దాఖలు చేశారు. బాబా గత 20 రోజులుగా ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సరైన సమాచారం ఇవ్వడంలేదని, దీంతో భక్తుల్లో ఆందోళన పెరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్ట్‌కు రూ. 1.50 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, బాబా అనారోగ్యంపాలు కావడంతో ఇవి దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తెలిపారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
నా అవయవాలు ఇస్తా
బాబా మేనల్లుడు గణపతిరాజు
సత్యసాయి బాబాకు అవసరమైతే తన అవయవాలను ఇస్తానని బాబా మేనల్లుడు గణపతిరాజు తెలిపారు. బాబా అవయవాలు సాధారణ స్థితికి రాలేవని భావిస్తే, తన అవయవాలను అమర్చాలని బుధవారం ఒక ప్రకటనలో వైద్యులను అభ్యర్థించారు. సత్యసాయి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని, దీనిని తాను అదృష్టంగా భావిస్తాన ని తెలిపారు. బాబా, తాను రక్తసంబంధీకులమైనందున అవయవాల మార్పిడి ఆశాజనక ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

'చక్ర'బంధంలో ట్రస్ట్ ఆస్తులు
సభ్యుల నియంత్రణలోనే ప్రశాంతి నిలయం
పేరుకే భారీ పహారా
ఫిర్యాదులకూ స్పందించని సర్కారు
నిఘా వర్గాలకు ఉన్నతాధికారుల మోకాలడ్డు!
పంపకాల్లో తలమునకలైన ట్రస్ట్
ప్రశాంతి నిలయంలో వారు చెప్పిందే వేదం!
వారి మాటలే.. అధికారుల ప్రకటనలు?
బాబా బంధుల్లో విభేదాలు!
ఫిర్యాదులకూ స్పందించని సర్కారు
నిఘా వర్గాలకు ఉన్నతాధికారుల మోకాలడ్డు!
పంపకాల్లో తలమునకలైన ట్రస్ట్
ప్రశాంతి నిలయంలో వారు చెప్పిందే వేదం!
వారి మాటలే.. అధికారుల ప్రకటనలు?
బాబా బంధుల్లో విభేదాలు!
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆస్తులకు భద్రత కరువైంది. దొంగల చేతిలోనే నేటికీ తాళాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. ట్రస్ట్‌లోని పలువురిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ట్రస్ట్ ఆస్తులకు భద్రత కల్పించాలని ఆందోళనలు కొనసాగుతున్నా.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
సత్యసాయి ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తులను, కోట్లాది రూపాయల విలువ చేసే బంగారం, వజ్రాల్లాంటి కానుకలను కాపాడాలని కొందరు భక్తులు పోలీసులను కోరారు. కొందరిపై ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. ట్రస్ట్ ఆస్తులను కాపాడుతున్నామని, పూచికపుల్ల కూడా తరలిపోకుండా చూస్తున్నామని సాక్షాత్తూ డీజీపీ అరవిందరావు ప్రకటించినా.. ప్రశాంతి నిలయంలో తరలింపులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సత్యసాయిబాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి దేశవ్యాప్తంగా భక్తులు ఆయన ఆరోగ్యం కోసం పూజలు, హోమాలు చేస్తుంటే.. ట్రస్ట్ వర్గాలు మాత్రం చడీ చప్పుడు కాకుండా ఆస్తుల పంపకాల్లో తలమునకలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ ప్రశాంతి నిలయం మొత్తం ట్రస్ట్‌కు సంబంధించిన సేవాదళ్ కార్యకర్తల కనుసన్నల్లోనే ఉంది. దీంతో వారికి అడ్డు చెప్పేవారే లేరు.
ప్రభుత్వాధికారులు సైతం ఇక్కడ 'సాయిరాం' అంటూ వారికి తలలూపాల్సిన పరిస్థితి ఉంది. వైద్యులు (ట్రస్ట్ నేతృత్వంలోని వారే), ట్రస్ట్‌కు సంబంధించిన వారు మినహా ఆస్పత్రిలో ఇతరులెవరూ కనిపించలేదు. రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ట్రస్ట్ వర్గాల సలహాల మేరకే ప్రకటనలు చేస్తున్నారని స్పష్టమవుతోంది.
ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు
ట్రస్ట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో తాము ఎటువంటి జోక్యం చేసుకునేది లేదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను కేవలం జిల్లా మేజిస్ట్రేట్‌గా శాం తి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపడుతున్నానని ప్రకటించారు. ట్రస్ట్ విషయాల్లో జోక్యం చేసుకోడానికి తనకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని ఆయన పేర్కొన్నారు.
పుట్టపర్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నిఘా వర్గాలు కూడా అక్కడి వ్యవహారాలపై ఆయా ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యాయనే విమర్శలు ఉ న్నాయి. అక్కడ ఏం జరుగుతోందో సమాచారం అందించాలని ఆయా ప్రభుత్వాలు వాటికి ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఏం జరుగుతున్నా పట్టించుకునే అధికారం మాత్రం ఎవరికీ లేదన్నది స్పష్టం. వీరిపైనా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మాజీ మంత్రి, మాజీ పోలీసు బాస్ కీలకం
ట్రస్ట్ వ్యవహారాల్లో ఒక కేంద్ర మాజీ మంత్రితో పాటు.. రాష్ట్ర స్థాయిలోని ఓ మాజీ పోలీసు బాస్ కూడా ప్రభుత్వాలవైపు నుంచి ఇబ్బందులు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిసింది. మాజీ పోలీస్‌బాస్‌కు సంబంధించి దాదాపు రూ.20కోట్ల వరకు ట్రస్ట్‌లో ఇరుక్కు పోయినట్లు చెబుతున్నారు.
దీంతో ఆయన వాటిని రాబట్టుకోవడంతో పాటు మరికొంత లాభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యా రాకుండా తనకున్న సంబంధాల నేపథ్యంలో ట్రస్ట్‌పై ఈగ కూడా వాలకుండా మోకాలడ్డుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అలాగే కేంద్ర మాజీ మంత్రి కూడా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు సాగించినట్లు సమాచారం. అనేక రకాలుగా వీరికి ట్రస్ట్‌తో వీడదీయరాని ఆర్థిక సంబంధాలున్నట్లు ప్రచారముంది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ట్రస్ట్ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించటంలేదన్న వాదన వినిపిస్తోంది.
ఐఏఎస్, ఐపీఎస్‌లకూ విలువలేదు
ప్రశాంతి నిలయంలో నేటికీ ట్రస్ట్ చెప్పిందే వేదం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా ఇక్కడ ఏ మాత్రం విలువ లేదు. బాబా అస్వస్థత కారణంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని పుట్టపర్తిలో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. కానీ ట్రస్ట్‌కు సంబంధించిన వారు మాత్రం ఇవేవీ తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అధికారులు చెబుతున్నారు. పుట్టపర్తిలో దాదాపు 3వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. భారీ ఎత్తున బారికేడ్లు నిర్మించారు.
ఇవన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే చేపడుతున్నారు. కానీ.. ఈ ఏర్పాట్లన్నీ ట్రస్ట్‌లో ఆస్తులు కొల్లగొడుతున్న కొందరి రక్షణ కోసమేనా? అన్నట్లు కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం భద్రతపై సమీక్ష జరిగిందని సమాచారం. అది కూడా కేవలం ట్రస్ట్‌లోని సభ్యుల మధ్యే జరిగినట్టు తెలిసింది. ఈ సమీక్షకు జిల్లా స్థాయి, రాయలసీమ స్థాయి పోలీసు అధికారులను కూడా అనుమతించలేదని సమాచారం.
ట్రస్ట్ సభ్యులు అన్ని వ్యవహారాలకు సంబంధించిన ప్రణాళికలు రచించి తమకు అనుకూలమైన ప్రభుత్వ పెద్దలకు అందిస్తున్నారు. వారు కింది స్థాయి ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తున్నారు. దీంతో ఉరుకులు పరుగుల మీద రాష్ట్ర, జిల్లా స్థాయి ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు వారి వారి విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రాజ్యాంగేతర శక్తిగా ట్రస్ట్ నేటికీ తన హవా కొనసాగిస్తోంది. ట్రస్ట్ ఆస్తుల వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున గూడుపుఠాణీ సాగుతోంది.
భారీగానే బంగారు వస్తువులు, సత్యసాయికి కానుకల రూపంలో వచ్చిన ఇతర విలువైన వస్తువులు తరలివెళ్లాయి. వాటిని కాపాడడానికి వీలుగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఇప్పటికే పుట్టపర్తి పోలీసు స్టేషన్‌లో బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. ట్రస్ట్‌పై ఎవరికీ అధికారాలు లేవన్నట్లు ఇక్కడి అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఆస్తులకు రక్షణ ఇచ్చేదెవరన్నది ప్రశ్న.
బంధువర్గాల్లోనూ అగాధం
సత్యసాయి బంధు వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విభేదాలు పొడసూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాబాకు రెండు, మూడు కుటుంబాలు అతి సమీపంగా ఉంటున్నాయి. బాబాను అడ్డుపెట్టుకుని దండుకున్న వారంతా స్వామి సేవలో కాకుండా సొంత సేవలో మునిగిపోయారని ఇతర బంధు వర్గాలు ఆరోపిస్తున్నాయి. అస్వస్థతకు గురైన బాబా బాగోగులు పట్టించుకోకుండా మొత్తం సొంత లాభాలపైనే మక్కువ ప్రదర్శిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
అసలు గుట్టు బయట పెట్టడానికి కూడా బాబాకు దూరంగా ఉంటున్న సంబంధీకులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే వారిని కూడా కట్టడి చేసే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి బాబాను అడ్డుపెట్టుకుని భారీగానే దండుకున్న వ్యవహారాలు అనేకం వెలుగు చూడనున్నాయని చెబుతున్నారు.

బాబా... ఇక లేవా ?

డయాలసిస్ కొనసాగిస్తూనే ఉన్నామని, ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో బాబా ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని డాక్టర్లు కూడా బాబా ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని అందులో వె ల్లడించారు. 11 గంటల సమయంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన డాక్టర్ రవిరాజు ఆసుపత్రిలోకి వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఆసుపత్రిలోనే గడిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం వరకూ బాబా బంధువు లను ఒక్కొక్కరినే ఆసుపత్రిలోనికి అనుమతించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరో మెడికల్ బులెటిన్ విడుదల చేశారు.
ఇందులో బాబా ఇప్పటికీ వెంటిలేషన్ సపోర్టు పైనే ఉన్నారని, గురువారం డయాలసిస్ చేయాల్సి ఉంటుందని, ప్యానల్‌లో ఉన్న డాక్టర్లు బాబా ఆరోగ్య పరిస్థితిని 24 గంటలూ పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు గంటల నుంచి ఆసుపత్రి వద్ద పోలీసుల హడావుడి మొదలయ్యింది. అనంతపురంలో ఉన్న మొత్తం పోలీసు బలగాలు ఉన్నఫళంగా పుట్టపర్తికి చేరుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రతి పోలీసుస్టేషనులోను సెంట్రీ, సపోర్టింగ్ సెంట్రీ మినహాయించి అందరూ పుట్టపర్తికి వెళ్లాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక్క అనంతపురం జిల్లా నుంచే కాకుండా చిత్తూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఈ బలగాలన్నీ తెల్లవారుజాము లోపల పుట్టపర్తికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పుట్టపర్తిలో అదనంగా కొన్ని చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
అటు వైపు నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అవసరమైతే మిలటరీ సహాయం కూడా తీసుకుంటామనివారు పుట్టపర్తికి వచ్చినా ఆశ్చర్యపోవా ల్సిన పనిలేదని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. పుట్టపర్తికి మొత్తం పోలీసు బలగాలు చేరుకున్న తరువాత హడావుడి లేని సమయం చూసి బాబాను ప్రశాంతి నిలయానికి తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బాబా ను అక్కడే ఉంచి చికిత్స కొనసాగించవచ్చ న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఏ తెల్లవారు జామునే జరుగుతుందని తెలుస్తోంది. ఏదేమైనా బాబా ఆరోగ్యంపై గురువారం తెరపడే అవకాశాలున్నాయి.
బాబా ఇక లేనట్టేనా?
సత్యసాయి బాబా ఆరోగ్యం బుధవారం సాయంత్రా నికి మరింత క్షీణించింది. శరీరంలోని ఏ ఒక్క అవయవమూ బాబా స్వాధీనంలో లేదు. కనీసం డాక్టర్ల స్వాధీనంలో కూడా లేదు. రక్తపోటులో ఆటుపోట్లు కలవరం కలిగిస్తున్నాయి. కాలేయం పని తీరు సంక్లిష్టంగా మారింది. పచ్చ కామెర్లు ఇంకా తగ్గకపోగా కాలేయం కనీస స్ధాయిలో కూడా పని చేయడం లేదు. శ్వాస సైతం ఇబ్బందికరం గానే ఉంది. మూత్రపిండాల విషయం గురించి డాక్టర్లు పెదవి విప్పడం లేదు. బాబా స్పృహలో ఉన్నారా? కోమాలో ఉన్నారా? అంటే అదీ చెప్పడం లేదు. బాబా ఆరోగ్యం దారుణంగా క్షీణిం చిందని, ఆయన సజీవంగా ఉండే అవకాశాలు ఇకెంత మాత్రం లేవని పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు.
అందుకే అనంత పురం ఎస్పీ హైదరా బాదులోని డీజీపీతో మాట్లాడి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు నుంచి డాక్టర్ రవిరాజ్ పుట్టపర్తి చేరుకున్నారు. అలాగే అమెరికా నుంచి డాక్టర్ యోగ్యరామన్ వచ్చారు. బాబా శరీరంలో వస్తున్న మార్పులు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతుండటం డాక్టర్లును మరింత కలవరపరుస్తున్నది. పుట్టపర్తిలో కనిపిస్తున్న పోలీసుల హడావుడి ద్వారానే బాబా ఆరోగ్యం ఎంత విషమించిం దో అర్థమవుతోందని పుట్టవర్తిలోని స్థానికులు వ్యాఖ్యా నిస్తున్నారు.
ఇదిలా ఉండగా ట్రస్ట్ సభ్యులు, డాక్టర్లు ప్రస్తుత బాబా స్థితిగతులపై దీర్ఘంగా చర్చించినట్లు చెబుతున్నా రు. బాబా ఇక కోలుకునే స్థితి లేదని, వెంటిలేటర్లు తీసిన మరుక్షణం బాబా నిర్జీవులవుతారని డాక్టర్లు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే బాబా తుది ఆరోగ్య ప్రకటనను విడుదల చేసే అధికారం ఆసుపత్రి వర్గాల చేతుల్లో లేదని చెబుతున్నారు. ట్రస్ట్ ఏక మొత్తంగా సమావేశమై ఏకగ్రీవ నిర్ణయం చేశాకే ఆ తుది ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. కాని ట్రస్ట్ సభ్యులంతా ఇప్పుడు ఒకచోట కూర్చుని చర్చించగలిగే పాటి సామరస్యం ఇప్పుడు వారి మధ్య ఉందా అన్నది సందేహంగా మారింది. బాబా ఆసు పత్రిలో చేరిన దగ్గర్నుంచీ ఇప్పటి దాకా ట్రస్ట్ సభ్యు లంతా ఒక చోట చేరి కూర్చుని చర్చించుకున్న దాఖ లాలు లేవు.
ట్రస్ట్ సభ్యుల మధ్య ముఠాల కుమ్ము లాటలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ పరిస్థి తుల్లో బాబా విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ప్రశాంతి నిలయం వ్యవహారాల్లో ట్రస్ట్‌దే తుది నిర్ణయాధికారం కావడం..ఆ ట్రస్ట్ చైర్మన్ సత్య సాయిబాబాయే కావడం..ఆ మూల విరాట్టే ఇప్పుడు మంచంలో ఉండటంతో సంక్షోభం నెలకొంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ సపాయా ఈ విషయంలో నిమిత్తమాత్రుడే అని చెబుతున్నారు. బాబా ఆరోగ్యం గురించిన కీలక సమాచారాన్ని బయటకు పొక్కనివ్వొద్దని ఆయన మీద ట్రస్ట్‌లోని కొందరి వత్తిడి పని చేస్తున్నట్లు తెలుస్తోంది. బాబాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఉన్న కారణంగా ఎలాంటి సున్నిత సమాచారమైనా వారంద రినీ క్షోభ పెడుతుందన్న సాకుతో డాక్టర్ సఫాయా నోరు నొక్కే శారని తెలుస్తోంది.
అందుకే ఆయన ఏ రోజుకో రోజు వెంటిలేటర్ల మీదే బాబా ఉన్నారని..కిడ్నీలకు డయాలసిస్ కొనసాగు తోందని మొక్కుబడి బులెటిన్లతో కాలక్షేపం చేస్తున్నా రు. అయితే బాబా ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దశలో ఆయన ఇకెంతో కాలం నిజాలు దాచిపెట్టలేని స్థితి నెలకొంది. అందుకే ఆయన బులెటిన్లలో గొంతు మారుతోంది. బాబా హృదయ స్పందనలు మందకొడి గా ఉంటున్నాయని ఆయన బుధవారం సాయంత్రం చెప్పారు. అలాగే లోబీపీతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. కాలేయం పరిస్థితి విషమంగా మారిందన్నారు.
మొత్తం మీద ఆందోళనకరంగా ఉందని ఎట్టకేలకు అంగీకరించారు. గతంలో మాదిరి ఆందోళనకరంగానే ఉన్నా సంతృప్తి కరంగా ఉందన్న వ్యాఖ్యానం మారి పోయింది. ఇది బాబా నిజ స్థితికి అద్దం పడుతోందని భక్తులు అంటున్నారు.
చవితి మంచిరోజు కాదనే...
(సూర్య ప్రధాన ప్రతినిధి): పుట్టపర్తి సత్యసాయిబాబా ‘క్లినికల్లీ డెడ్’వార్తలు నిజం కాదని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ ప్రకటనలో నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలనుంది. బాబా ఆరోగ్యం దాదాపు క్షీణించిపోయిందని, ఆయనకు రక్తప్రసరణలో అంతరాయం కలుగుతోందని, లివర్ వ్యవస్థ ఆందోళనగా ఉందని బుధవారం సాయంత్రం డాక్టర్లు ప్రకటించారు. అంతకు కొద్ది సేపటికి ముందే అనంతపురంలో ఉన్న పోలీసు బలగాలను హుటిహుటిన పుట్టపర్తికి తరలిరావాలని ఆదేశాలు రావడం, ఆ మేరకు జిల్లాలో ఉన్న అదనపు పోలీసు బలగాలన్నీ పుట్టపర్తిలో మోహరించడం, ఈ హడావిడితో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్ద చేరడం చూస్తుంటే.. బాబా ఆరోగ్యం అంతిమదశకు చేరిందని, దానిపై గురువారం 12 గంటల తర్వాత ‘అసలు ప్రకటన’ వెలువడుతుందన్న ఊహాగానాలు, అనుమానాలు భక్తకోటిలో వ్యక్తమవుతున్నాయి. వారి అంచనా ప్రకారం.. బుధవారం రాత్రి 10.50 నిమిషాలకు చవితి వస్తుంది. గురువారం ఉదయం 11 గంటల తర్వాత అందరూ శుభంగా భావించే పంచమి తిథి ప్రవేశించిన అనంతరం.. బాబా జాతకం ప్రకారం నక్షత్రం చూసి ‘అసలు విషయం’ ప్రకటించే అవవకాశాలున్నట్లు చెబుతున్నారు. సెంటిమెంట్ ప్రకారం.. చవితి మంచిరోజు, తిథి కానందునే బాబా ‘ఆరోగ్య రహస్యాన్ని’ బయటపెట్టకుండా, ‘అసలు విషయం’ చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారని పండిత వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.
బాబా ఆస్తులు జాతీయం ?

అటు ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా పుట్టపర్తి బాబా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంతో పాటు, ట్రస్టులో ఏం జరుగుతోందో ప్రధాని ఆరా తీశారు.
ట్రస్టుకు చెందిన సంపద ప్రైవేటు వ్యక్తుల అధీనంలోకి వెళ్లకుండా ఉండా లంటే ట్రస్టును జాతీయం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ముందు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిం చాలని, ఆ తర్వాత ట్రస్టును స్వాధీనం చేసుకోవాలని యోచిస్తో న్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా, న్యాయపరంగా ప్రభుత్వానికి ట్రస్టును స్వాధీనం చేసుకునే అధికారం లేదని, ట్రస్టుపై ఎవరైనా ఆరోపణలు చేస్తే, దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, ఆయన ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత.. టీడీడీ తరహాలో పాలకమండలిని ఏర్పాటుచేయవచ్చని సమాచారం.
No comments:
Post a Comment