భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Friday, April 15, 2011

నోళ్లు మూసుకున్న వీరభక్తులు * సాయి సంపదకు రెక్కలు * జబ్బులో బాబా.. డబ్బులో శిష్య ప్రముఖులు

బాబాబందీ * పాపాలు బద్దలు 

loading

జబ్బులో బాబా.. డబ్బులో శిష్య ప్రముఖులు కోట్లతో కొట్టారు  * భక్తుల్లో తీవ్ర ఆందోళన

తొలిసారిగా స్పందించిన ట్రస్టు
15 రోజుల్లో బాబాను ప్రశాంతి నిలయానికి చేరుస్తామని వెల్లడి
బా బా ఆరోగ్యంపై కోర్టులో హక్కుల కమిషన్ ఫిర్యాదులు
ఎట్టకేలకే కదిలిన ప్రభుత్వం
వైద్యులతో సీఎం
సమావేశం

తవ్వేకొద్దీ బయటపడుతున్న రహస్యాలు! చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాములు! జబ్బున పడ్డ సత్యసాయిబాబా ఆరోగ్యంతో ఆడుతున్న డబ్బు నాటకాలు! ఒక్కొక్కటిగా బద్దలవుతున్న 'పుట్టపర్తి'లోని పాపుల పుట్టలు! బాబా నిర్మించుకున్న సొంత భక్తి సామ్రాజ్యంలో ఆయననే బందీగా మార్చిన వైనాన్ని 'ఆంధ్రజ్యోతి' ఆధారాలతో బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. 'బాబా బందీ' శీర్షికన శుక్రవారం ప్రచురించిన కథనం ప్రభుత్వంలో, అధికార వర్గాల్లో, అన్నింటికంటే ముఖ్యంగా బాబా భక్త జనంలో ప్రకంపనలు సృష్టించింది.

దిగ్భ్రాంతికరమైన వివరాలు తెలుసుకుని అంతా విస్తుపోయారు. ఒక్కో గుట్టు రట్టవుతుండటంతో పుట్టపర్తిలోని పాపాల భైరవుల కళ్లు బైర్లుకమ్మాయి. కాళ్లు వణికాయి. ముఖ్యమంత్రి అప్పటికప్పుడు స్పందించి... పుట్టపర్తికి వెళ్లి వచ్చిన వైద్య నిపుణులతో సమావేశమయ్యారు.ఇక... బాబా ఆరోగ్యంపై ఇన్నాళ్లుగా స్పందించని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కూడా మొట్టమొదటిసారి అధికారికంగా 'తెల్ల కాగితం'పై శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. '15 రోజుల్లో బాబాను తిరిగి ప్రశాంతి నిలయానికి తీసుకు వస్తాం' అని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోవైపు బాబా ఆరోగ్య రహస్యాన్ని ఛేదించాలన్న డిమాండ్లు అంతకంతకు ఊపందుకుంటున్నాయి. పెనుకొండ కోర్టులో ఒక న్యాయవాది దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. బాబాను అత్యవసరంగా విమానంలో నిమ్స్‌కు తరలించాలంటూ ముగ్గురు వ్యక్తులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. చికిత్స పేరిట బాబాను బంధించిన ట్రస్టు సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ దళిత జనసభ మరో పిటిషన్ దాఖలు చేసింది.

బాబా చికిత్స పొందుతున్న ఆస్పత్రి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సత్యసాయి ఆరోగ్యంపై ఇంత ఆందోళన నెలకొన్నా, ట్రస్టు వ్యవహార శైలిపై ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నా... బాబాకు వీర భక్తులుగా ఉన్న ప్రముఖులు ఏమయ్యారన్నదే ప్రశ్న! 

 ట్రస్టు ముడుపులు

ఇద్దరు మంత్రులు ,ఓ సీనియర్ ఐపీఎస్‌కు నజరానా!
సర్కారుది ఇంకా ప్రేక్షన పాత్రే

మంత్రుల తీరూ అనుమానాస్పదమే
బాబా విజువల్స్ ఎందుకు బయటపెట్టరు?
మరీ ఇంత రహస్యమా?
ఆస్తులను కాపాడతాం: డీజీపీ
ప్రభుత్వం ఎందుకు స్పందించదు ? :ఆది
సత్యసాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నన్ని రోజులు... భగవాన్ అంటూ ఆయన పాదాలమీద పడిన వీర భక్తులు ఇప్పుడు ఏమయ్యారు? బాబా ఆశీస్సులతో పదవులు, పదోన్నతులు పొందిన పెద్దలు... ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు అరాచకాలకు పాల్పడుతున్నారని, బాబాను బందీగా మార్చారని భక్తులు సమర్పించిన సంపదను దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదు? ఏమీ తెలియక ఊరుకున్నారా? అన్నీ తెలిసీ 'దోపిడీ'లో భాగస్వాములయ్యారా? బాబాపై భక్తిని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారా?

పుట్టపర్తిలో ఇప్పుడు పంపకాల పర్వం నడుస్తోంది సంపదను తరలించే కార్యక్రమం జోరందుకుంది. ట్రస్టు సభ్యుల్లో కొందరు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. ఈ దోపిడీకి ఆటంకం కలగకుండా... కొందరు ప్రముఖులను 'డబ్బుతో కొడుతున్నారు'.

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, మాజీ మంత్రుల వంటి ఎందరో ప్రముఖులు సత్యసాయి భక్త బృందంలో సభ్యులు. వీరిలో చాలా మందికి బాబా వద్దకు నేరుగా వెళ్లేంత చనువు ఉంది. వీరిలో కొందరితో ఇంతకుముందే సత్యసాయి బాబా తన పరిస్థితిని వివరించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈ భక్త ప్రముఖులెవ్వరూ ప్రశాంతి నిలయంవైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం నోరు విప్పడం లేదు.

దోపిడీ పర్వానికి తెరలేపిన ట్రస్టులోని స్వార్థ శక్తులే ఈ పవర్‌ఫుల్ భక్తుల నోళ్లను నోట్ల కట్టలతో మూయించినట్టు తెలుస్తోంది. కోట్లతో డబ్బులు చెల్లించి, తమ దోపిడీకి వారు అడ్డురాకుండా, వాస్తవాలు బయటపెట్టకుండా చూసుకుంటున్నట్టు సమాచారం. ఇలా ఇద్దరు మంత్రులకు, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి ట్రస్టు వారి నుంచి కళ్లు చెదిరే స్థాయిలో కోట్ల కొద్దీ నగదు అందినట్టు తెలిసింది. అప్పటిదాకా రహస్య సంభాషణల్లో బాబా ఆరోగ్య స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన ఆ ప్రముఖులు, డబ్బు ముట్టగానే సైలెంటై పోయారు.

ఒకప్పుడు బాబా ఆశీస్సులతో పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి తన వాటా సొమ్మును అప్పటికప్పుడే విదేశీ బ్యాంకులకు కూడా తరలించినట్టు తెలిసింది. దోపిడీ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్న ట్రస్టు సభ్యుల్లో ఒకరు ఏకంగా రూ.200 కోట్లను హవాలా మార్గంలో విదేశాల్లో ఉన్న తన కుమారుడికి చేరవేసినట్లు తెలిసింది. ఇలా ఈ పంపకాల పన్నాగం పూర్తయ్యేదాకా బాబాను ఆస్పత్రిలోనే ఉంచాలని వీరు భావిస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు...

'ప్రశాంతి నిలయం పట్టణ వాటిక' వాటికన్ సిటీలాగా ప్రత్యేక దేశం కాదు. అది మన దేశంలో, మన రాష్ట్రంలో భాగం! అక్కడ కూడా మన చట్టాలు అమలవుతాయి. అమలు కావాలి! కానీ...పుట్టపర్తిలో జరిగే కార్యకలాపాలపై ఆరా తీసేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. భక్తులు సమర్పించిన కానుకల్లో కొన్ని అనామతు ఖాతాల్లోకి వెళ్తున్నాయని సత్యసాయి కుటుంబ సభ్యులే ద్రువీకరిస్తున్నారు. కానీ..ప్రభుత్వం ఎప్పుడూ ఈ అంశం జోలికి వెళ్లలేదు.

ట్రస్టు సభ్యులు ప్రభుత్వాలను, అందులోని పెద్దలను శాసించేంత శక్తిమంతులు ఎలా అయ్యారన్నది అంతపట్టని విషయం. బాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత, సంపదను దోచుకునే కార్యక్రమం మరిం త జోరందుకుందన్నది దాదాపు బహిరంగ రహస్యమే. కానీ...ప్రభుత్వం ఇప్పటిదాకా దీనిని పట్టించుకోలేదు. శుక్రవారం 'ఆంధ్రజ్యోతి'లో ప్రత్యేక కథనం ప్రచురితమయ్యాకే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పుట్టపర్తికి వెళ్లి వచ్చిన వైద్య నిపుణులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

సత్యసాయి ట్రస్టు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామని డీజీపీ అరవిందరావు ప్రకటించారు. అయితే..సత్యసాయి ఆస్పత్రిలో చేరి ఇప్పటికి 20 రోజులు దాటింది. ఇన్ని రోజుల్లో 'దోపిడీదారులు' ఎన్ని వేల కోట్లను తరలించారో ఎవరికీ తెలియదు. నిజానికి..పుట్టపర్తికి వెళ్లిన మంత్రుల వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే మారిం ది.

ట్రస్టు వ్యవహారాలను గుంభనంగా నడిపించాలని, రచ్చకు ఈడ్చొద్దని ప్రభుత్వంపై పైస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. "అది శత్రుదుర్భేద్యమైన కోట. మేం అక్కడ చేసిందేమీ లేదు. చూసిందీ ఏమీ లేదు'' అని పుట్టపర్తికి వెళ్లి వచ్చిన ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందా? లేక..ప్రభుత్వం చేతులు పూర్తిగా కాలే దాకా ఆగుతుందా?

బాబాను ఎందుకు చూపించరు?

సత్య సాయిబాబా ఆరోగ్యం విషయంలో సెంట్రల్ ట్రస్టు గోప్యతను పాటించే కొద్దీ అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ 20 రోజుల్లో బాబా ఆరోగ్యంపై ట్రస్టు పెదవి విప్పిందే లేదు. మొట్టమొదటిసారిగా శుక్రవారం ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. 'బాగా పరిస్థితి మెరుగుపడుతోంది. 15 రోజుల్లో ప్రశాంతి నిలయానికి తరలిస్తాం' అని ప్రకటించింది. 'ఆంధ్రజ్యోతి'లో శుక్రవారం 'బాబా బందీ' కథనం ప్రచురితమైన తర్వాతే ఈ స్పందన రావడం గమనార్హం. అయితే..సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, ఐసీయూలో బాబా ఎలా ఉన్నారో చూపాలన్నది భక్తుల ప్రధాన డిమాండ్. దీనిపై శుక్రవారం ఆస్పత్రి ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.

మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్లు దాఖలయ్యాయి. బాబా ఆరోగ్య రహస్యం తేల్చాలంటూ పెనుకొండలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ...ట్రస్టు నుంచి స్పందన లేదు. ఐసీయూలో ఉన్న బాబాను అద్దాలకు ఇటువైపు నుంచి చిత్రీకరించి, ఆ దృశ్యాలను ఎందుకు విడుదల చేయడం లేదు? అలా చేయడం ద్వారా భక్తుల ఆందోళనను తొలగించవచ్చు కదా? ఈ ప్రశ్నలకు ట్రస్టు సమాధానాలు చెప్పడం లేదు. ట్రస్టు, ప్రభుత్వం కూడబలుక్కుని వాస్తవాలు దాచినంత కాలం..భక్తుల్లో అనుమానాలు బలపడుతూనే ఉంటాయి.

అంతులేని రహస్యలు

బాబా అనారోగ్యం పేరిట కొందరు ట్రస్టు సభ్యులు దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బలమైన అనుమానాలున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తేగానీ ఆ సందేహాలు తీరిపోవు.

- 'సత్య సాయిబాబా కళ్లు తెరిచారు. హారతి ఇమ్మంటారా అని అడిగితే..సరేనంటూ స్పందించారు' అని మంత్రి గీతారెడ్డి కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. 'స్పందించడం' అంటే మెదడు పని చేస్తున్నట్లుగానే పరిగణించాలి. మరి... బాబా ఇన్నాళ్లయినా కోలుకోకపోవడానికి కారణం ఏమిటి?

-'బయటి వారిని ఐసీయూలోకి అనుమతిస్తే..ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదముంది. దీనివల్ల బాబా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది' అని వైద్యులు పదే పదే ప్రకటించారు. ఇదే సాకుతో...ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పుట్టపర్తి పర్యటనను కూడా రద్దు చేయించారు. మంత్రి గీతారెడ్డి బాబా వద్దకు వెళితే రాని ఇన్‌ఫెక్షన్ సమస్య ముఖ్యమంత్రి వెళితే ఎందుకు వస్తుంది?

-సత్యసాయికి మెరుగైన వైద్యం అందించేందుకు, అక్కడ అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుంచి ప్రభుత్వం పంపిన డాక్టర్ రవిరాజ్ బృందం అర్ధాంతరంగా ఎందుకు వెనక్కి వచ్చింది?

-ప్రభుత్వం స్వయంగా పంపిన వైద్య నిపుణుల బృందంతో తిరిగి వచ్చినప్పటికీ...ముఖ్యమంత్రి వారితో చర్చించలేదు. 'బాబా బందీ' శీర్షికన 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం ప్రచురించిన తర్వాతే ఆ వైద్యులతో సీఎం సమావేశమయ్యారు. దీనికి కారణమేమిటి?

- బాబా ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే అయితే.. డాక్టర్లు మాత్రమే సీఎంకు వివరించాలి. కానీ, ఇది వరకే ట్రస్టు సభ్యులు కొందరు సీఎంను రహస్యంగా ఎందుకు కలవాల్సి వచ్చింది?

- వైద్య నిపుణులతోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యాన్ని కూడా పుట్టపర్తికి ఎందుకు పంపాల్సి వచ్చింది? ఆర్థికంతో ఏం సంబంధం?

- బాబా పరిస్థితిపై ఇంత సంచలనాత్మక విషయాలు బయటపడినా...దీనిపై అధికారికంగా స్పందించాల్సిన ట్రస్టు ఎందుకు మౌనంగా ఉంటోంది? ప్రభుత్వానికి, మీడియాకు ఏమీ చెప్పకపోయినా...భక్త జనానికైనా వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం లేదా? ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి ఎక్కడ? 

అయ్యో... బాబా చుట్టూ.. దొంగల ముఠా..!
sathya-sai-baba
ఆ కాషాయాంబరధారి.. ప్రపంచంలో కోట్లాది మందికి మానవరూపంలో ఉన్న దైవస్వరూపం. ఆయన నోటి వెంట వచ్చే ‘బంగారూ’ పలుకుకోసం కొన్ని కోట్లమంది భక్తజనం పరితపిస్తుంది. ఆ ప్రశాంతి నిలయంలో కాలుబెడితే అశాంతి మటుమాయవుతుందన్న విశ్వాసం. ఆయన చల్లని చూపు తమపై పడితే చాలు జన్మధన్యమయిపోయినట్టేనన్న నమ్మకం. ఆయన సన్నిధిలో భజన చేస్తే ఈతిబాధలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుందన్న భరోసా. ఆయన ఆశీస్సులతో అన్ని బంధనాలు తొలగిపోయి సుఖశాంతులు వరిస్తాయన్నది భక్తకోటి ముక్తిభావన.

మరి.. అలాంటి కలియుగ దేవుడికే కష్టం వచ్చిపడింది. ఆ ప్రశాంతి నిలయమే అశాంతి నిలయమయింది. ఇప్పుడు ఆయనే మరొకరి చేతిలో బందీగా మారారు. తనను రక్షించే వారి కోసం మూగగా రోదిస్తున్నారు. నోట మాట రాక, కళ్లు తెరచి తనకేం జరుగుతోందో తెలియక నిస్సహాయుడిగా, నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఇదీ పుట్టపర్తి సాయిబాబా ప్రస్తుత పరిస్థితి. అదలా ఉంచితే.. బాబాపై కొన్ని ఏళ్ల నుంచి నిర్నిరోధంగా మత్తుమందుల ప్రయోగం జరిగిందా? దాని ఫలితమే ప్రస్తుత అనారోగ్యమా?.. తాజాగా భక్తకోటి మనసును ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్నలివి.

బాబాకు అసలు ఏమయింది? ఇన్ని రోజులు ఆయనను వెంటిలేటర్ల మధ్య ఉంచటంలో మర్మం ఏమిటి? డాక్టర్లు విడుదల చేస్తున్న బులిటెన్లలో గందరగోళం ఎందుకు? డాక్టర్‌ సఫాయాకు అన్నీ తెలిసే నిజాలు దాస్తున్నారా? ఆఖరి ప్రయత్నంగానే కదా వెంటిలేటర్లు వాడేది? మరి ఇన్ని రోజులు వెంటిలేటర్లపై ఉంటే దాని సంకేతాలేమిటి? విదేశీ వైద్యులు రాకుండా అడ్డుపడుతున్న ఆ కనిపించని భూతం ఎవరు? ట్రస్టులో ఉన్న దొంగలముఠా బాబాను ఏం చేయబోతోంది? అదే ట్రస్టుకు చెందిన ముఠా బాబా ను కొన్నేళ్ల నుంచి మత్తుమందులకు అలవాటు చేసిందా వంటి ప్రశ్నలు భక్తజనంలో కలవరం కలిగిస్తున్నాయి.

వైద్యులు, బాబాకు అత్యంత సన్నిహితులుగా పేరున్న ప్రముఖులు చెబుతున్న ప్రకారం.. సత్యసాయి బాబాపై గత కొన్నేళ్లుగా మత్తుమందుల ప్రయోగం జరుగు తోందన్న అనుమానం ధృడపడుతోంది. సాధారణంగా నిద్రమత్తు మాత్రలు వాడితే బాబాకు ఈ విషమ పరిస్థితి రాదని వైద్యు లు కూడా చెబుతున్నారు. అందులో 80వ వడి దాటిన బాబాకు అసలు నిద్రమాత్రలు కూడా ఏ డాక్టరూ సిఫార్సు చేయరని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నిద్రమాత్రలని ప్రచారం చేస్తున్నప్పటికీ.. వాస్తవానికి మత్తుమందులు ప్రయోగిస్తే తప్ప బాబా అంత మగతగా కనిపించరని చెబు తున్నారు.

venu-srinivasan-house‘‘నిత్యం ఒత్తిళ్లకు నలిగిపోయే రాజకీయ నాయ కులు, అప్పులతో అవస్ధలు పడేవారు, సుదీర్ఘ ప్రయా ణాలతో అలసిపోయేవారు, మానసిక బలహీనతతో సమ స్యలు ఎదుర్కొనేవారు నిత్యం ఒకటి, ఒకటిన్నర నిద్రమా త్రలు సంవత్సరాల నుంచి వేసుకనే అలవాటున్నప్పటికీ వారికి ఎలాంటి వ్యాధులు రావని’’ ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ నర్సయ్య స్పష్టం చేశారు. ప్రస్తుతం వస్తున్న వార్తా కథనాలు చూస్తుంటే అంతకుమించిన మందులే వాడుతు న్నట్లు అనుమానంగా ఉందన్నారు.

బాబా వయసు, అంతకుముందున్న వ్యాధుల రీత్యా అసలు ఆయనకు నిద్రమాత్రలు కూడా వాడకూ డదన్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. బాబాను గత కొద్ది ఏళ్లుగా గమనిస్తున్న వారు మాత్రం ఆయన ఏదో జగత్తులో ఉండేలా కనిపించేవారని, మామూలు నిద్రమాత్రలు వాడేవారిలా కనిపించలేదని ఆయన భక్తులు కొందరు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తలవాలిపోయి, ఎక్కువ సేపు నిద్రకే పరిమితమ య్యేవారని, సన్నిహిత భక్తులతో సైతం మాట్లాడకుండా చేతులతోనే సైగలు చేసేవా రంటున్నారు. ఒక దశలో తమతో కళ్లతోనే మాట్లాడేవారని చెబుతున్నారు.

బాబాకు నిద్రమాత్రలు ఇచ్చినా దానివల్ల పెద్దగా నష్టమే మీ ఉండదని ప్రముఖ అనస్తీషియన్‌ డాక్టర్‌ జి.ఆర్‌. లింగమూర్తి చెప్పారు. ‘ నిద్రమాత్రలు దాదాపు 40 శాతం మంది వాడుతున్నారు. దానికి ఓ మోతుదు ఉంటుంది. అది దాటితేనే ప్రమాదం. బాబా పరిస్థితి చూస్తుంటే ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. అన్ని రోజులు వెంటిలేటర్లపై ఉంచడమే ప్రమాదసంకేతం. ప్రపంచంలో ఏ వైద్యుడు వచ్చినా ఆయనను రక్షించడం కష్టం. డాక్టర్‌ సఫాయాకు అన్నీ తెలుసనన్న విషయం ఆయన విడుదల చేస్తున్న బులిటెన్లే చెబుతున్నాయి. హార్ట్‌ ఆగినా కొద్దిసెకన్ల తర్వాత దానిని మళ్లీ పనిచేయిం చవచ్చు. కానీ మెదడుకు రక్తప్రసరణ ఆగిపోతే మనిషి జీవించటం కష్టం. బాబా వయసును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. వెంటిలేటర్లపై ఉన్నంతకాలమే బాబా కొనఊపిరితోనయి నా ఉంటారు. బీపీ నార్మల్‌గా ఉందని చెబుతున్నారు. అదీ విచిత్రంగానే ఉంది’ అని వివరించారు.

ఇదిలాఉండగా.. ట్రస్టులో దొంగలముఠా ఉందని, ఆ ముఠానే ట్రస్టుకు చెందిన దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తోందన్న ఆరోపణలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. వారే బాబాను బందీని చేశారంటున్నారు. దీనిలో ప్రభుత్వ పెద్దలు, ఐపీఎస్‌ అధికారులకూ వాటాలున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులకు సైతం ఇందులో వాటాలున్నాయని, దాదాపు 200 కోట్ల రూపాయలు ఇప్పటికే సదరు ప్రముఖులకు హవాలా రూపంలో ముట్టాయన్న వదంతులు వినిపిస్తు న్నాయి. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు చెప్పినట్లు.. వైఎస్‌ హయాం నుంచే ఈ తతంగం నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాను వైఎస్‌కు బాబాపై జరుగుతున్న కుట్ర గురించి చెప్పినా పట్టించుకోలేదని చెప్పిన విషయం ప్రస్తావనార్హం.

కాగా, అందులో ఉన్న మంత్రులు, ఏపీఎస్‌ అధికారుల పేర్లు మరికొద్దిరోజుల్లో బయటకు వస్తాయని పుట్టపర్తి వర్గాలు చెబుతున్నాయి. కాగా, ట్రస్టుకు చెందిన లక్షకోట్ల రూపాయాలను హవాలా రూపంలో బయటకు పంపించిన తర్వాతనే బాబా ఆరోగ్యంపై అసలు రహస్యాన్ని బయటపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివిధ మార్గాల్లో డబ్బును బయటకు పంపించారని, మిగిలిన వాటిని కూడా బయటకు పంపించిన తర్వాతనే బాబాకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వెంటిలేటర్‌ వ్యవహారాన్ని పరిష్కరిస్తారన్న ప్రచారం భక్తులో జరుగుతుండటం ప్రస్తావనార్హం.

కనీసం బాబా బంధువులను కూడా ఐసీయులోకి అనుమతించకపోవడంపై బాబా ఆరోగ్య స్థితిపై ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బాబా ఎముకల గూడుగా మారారని, ఆయన వైద్యపరీక్షల సమయంలో కూడా స్పందించడం లేదం టున్నారు. దీనిపై భక్తుల్లో అసహనం పెరిగి, అది తిరుగు బాటుగా మొదలయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో బాబా భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. మీడియాలో బాబా ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న కథనాలతో ఆందోళన చెందుతున్న భక్తులు ఒకటి, రెండురోజుల్లో పుట్టపర్తికి చేరుకునేందుకు సమాయత్తమవుతున్నారు.

కాగా, బాబాకు సన్నిహితంగా వ్యవహరిస్తూ, ఆయన మంచిచెడ్డలు చోసుకునే సత్యజిత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, లక్ష కోట్ల ఆస్తులను కొల్లగొట్టే కుట్ర వ్యవహారంలో ఆయనొక్కడే ఉంటారంటే నమ్మశక్యం కాదంటున్నారు. ట్రస్టులోనే ఉంటూ పెత్తనం చేస్తున్న ఒకరిద్దరు సభ్యులు, ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి సైతం ఈ కుట్రలో భాగస్వామిగా ఉండవచ్చన్న అను మానం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాబా ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో... ఆయనకు జరుగు తున్న వైద్యంపై విచారణ జరిపించాలని కోరుతూ పలువు రు భక్తులు వివిధ కోర్టుల్లో కేసు దాఖలు చేయడం బాబా ఆరోగ్యంపై నెలకొన్న సస్పెన్స్‌ కొత్త మలుపు తిరిగినట్ట యింది. దీనితో ట్రస్టు తప్పనిసరిగా బాబాకు జరుగుతున్న వైద్య వివరాలను కోర్టుకు అందించవలసి ఉంటుంది.

No comments:

Post a Comment