చరమ సంధ్యలో సత్యసాయి?
హే భగవాన్!
కోలుకోవాలని భక్త కోటి పూజలు
బాబా పరిస్థితి విషమం: వైద్యులు
సరిగా పనిచేయని కొన్ని అవయవాలు
ఉదయం కోలుకుంటున్నారని ప్రకటన
భక్తుల్లో ఆందోళన, ఆగ్రహం
వాస్తవ పరిస్థితి వివరించాలని డిమాండ్
కలెక్టర్ కారుపై రాళ్ల దాడి
దేశ విదేశాల ప్రముఖుల రాక
విలపించిన మంత్రి గీతారెడ్డి
ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు
పుట్టపర్తిలో ఉత్కంఠ వాతావరణం
సరిగా పనిచేయని కొన్ని అవయవాలు
ఉదయం కోలుకుంటున్నారని ప్రకటన
భక్తుల్లో ఆందోళన, ఆగ్రహం
వాస్తవ పరిస్థితి వివరించాలని డిమాండ్
కలెక్టర్ కారుపై రాళ్ల దాడి
దేశ విదేశాల ప్రముఖుల రాక
విలపించిన మంత్రి గీతారెడ్డి
ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు
పుట్టపర్తిలో ఉత్కంఠ వాతావరణం
ప్రార్థనలు చేయండి
"బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఐసీయూలో చికిత్స చేస్తున్నాం. బయటి వారు ఐసీయూలోకి వెళితే ఇన్‌ఫెక్షన్ ఎక్కువై బాబా ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. బాబాను కాపాడడానికి మేం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. బాబా ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ భక్తులంతా ఇళ్లకు వెళ్లి ప్రార్థనలు చేయండి''
- రాత్రి 11 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా
చికిత్సకు బాబా శరీరం సహకరిస్తోంది
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా.. చికిత్సకు శరీరం సహకరిస్తోందని సిమ్స్ డెరైక్టర్ సఫాయా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి 11 గంటల తర్వాత నాలుగో మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. బాబాకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామన్నారు. ఇన్‌ఫెక్షన్ అధికం కాకూడదనే ముందు జాగ్రత్తతో ఐసీయూలోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు.
భగవాన్ సత్యసాయి బాబాకు ఏమైంది? ఇది కోట్లమంది భక్తులను వేధిస్తున్న ప్రశ్న. ఆందోళనకు గురి చేస్తున్న అంశం! పుట్టపర్తిలో... సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏదో జరుగుతోంది! అదేమిటో భక్త జనానికి తెలియడంలేదు. మీడియాకూ తెలియనివ్వడంలేదు.
సత్యసాయి ఆరోగ్యం నిలకడగా ఉందని ఒకసారి, మెరుగవుతోందని ఒకసారి చెబుతూ వస్తున్న వైద్య బృందం... సోమవారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఒక్కసారిగా ప్రకటించింది. 'బాబా కోలుకుంటున్నారు. కిడ్నీలు కూడా పని చేస్తున్నాయి' అని సోమవారం ఉదయం ప్రకటించిన వైద్యులు... సాయంత్రానికి పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు. కొన్ని అవయవాలు సరిగా పని చేయడంలేదన్నారు.
తర్వాత కొద్దిసేపటికి 'బాబా కళ్లు తెరిచారు. కాళ్లు కదిపారు' అని మరో ప్రకటన చేశారు. అసలే తీవ్ర ఆందోళనలో ఉన్న భక్తులకు ఈ పరస్పర విరుద్ధ వార్తలు మరింత ఆందోళన కలిగించాయి. వైద్యులు, ట్రస్టు సభ్యులు ఏదో దాస్తున్నారనే అనుమానం పెరిగింది. పుట్టపర్తిలో తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగ వాతావరణం నెలకొంది. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఆస్పత్రి వద్ద పోలీసుల హడావుడి పెరిగింది. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించే ప్రక్రియ మొదలైంది.
డీఐజీ చారుసిన్హా స్వయంగా అక్కడ శాంతి భద్రతల పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా కలెక్టర్ జనార్దన రెడ్డి పుట్టపర్తి వచ్చారు. ఈనెల 2 నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే మకాం వేసి, బాబా పరిస్థితిని సమీక్షిస్తున్న ఆయన భక్తురాలు, రాష్ట్ర మంత్రి గీతారెడ్డి కన్నీరు పెట్టారు. 'బాబా ఆరోగ్యం మెరుగుపడదా!' అంటూ విలపించారు.
పుట్టపర్తిలో కనిపించని ఉగాది సందడి
సత్యసాయిబాబా అస్వస్థతకు గురికావటంతో సాయి భక్తుల్లో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందడి కనిపించలేదు. పుట్టపర్తిలో సత్యసాయి ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది కుటుంబాలు బాబా నీడన జీవిస్తూ వస్తున్నాయి. సత్యసాయి తమతో లేని (దర్శనం ఇవ్వలేదని) పర్వదినం ఎందుకంటూ స్థానికులు, భక్తులు ఉగాది జరుపుకోలేదు. వ్యాపార వర్గాలు, దినసరి కూలీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ట్రావెల్స్ నిర్వాహకులు, అన్ని వర్గాల కుటుంబాలు గడుస్తున్నాయంటే సాయిబాబా చలవే. బాబా అనారోగ్యంతో ఉండటంతో భక్తులు ఉగాది పర్వదినాన్ని జరుపుకోకుండా ఆందోళనతో ఉన్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుండే ప్రశాంతి నిలయం పూర్తిగా బోసిపోయింది.
పరిస్థితి విషమం! సత్యసాయి ఆరోగ్యంపై భక్తుల్లో ఆందోళన
సీఆర్‌ఆర్‌టీ చికిత్స చేస్తున్నామన్న సిమ్స్ డెరైక్టర్
సోమవారం మధ్యాహ్నం వరకూ నిలకడగానే ఉన్న బాబా ఆరోగ్యం
సాయంత్రానికి అకస్మాత్తుగా పరిస్థితి విషమించిందంటూ బులెటిన్
తక్షణం బాబాను తమకు చూపాలంటూ ఆస్పత్రి ఎదుట భక్తుల ధర్నా
కలెక్టర్ వాహనంపై దాడి, జాయింట్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న భక్తులు
మనవడు కాళ్లమీద పడినపుడు కాళ్లు కదిలించిన సత్యసాయి!
సాయిరాం అన్నప్పుడు బాబా కళ్లుతెరిచి చూశారన్న అధికారులు
వైద్యానికి బాబా శరీరం సహకరిస్తోందని అర్ధరాత్రి సిమ్స్ ప్రకటన
నేడు పుట్టపర్తికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అనారోగ్యం కారణంగా మార్చి 28వ తేదీ నుంచి పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నిపుణులైన వైద్య బృందం అందిస్తున్న చికిత్సతో సోమవారం మధ్యాహ్నం వరకూ నిలకడగా ఉన్న సత్యసాయి ఆరోగ్యం.. సాయంత్రానికి విషమించినట్లు సిమ్స్ డెరైక్టర్ జె.ఎన్.సఫాయా ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు, ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు విడుదల చేసిన రెండు ప్రకటనల్లోనూ సత్యసాయి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటారని సఫాయా తెలిపారు. అయితే అకస్మాత్తుగా రాత్రి 6.30 గంటలకు బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. సీఆర్‌ఆర్‌టీ (కంటిన్యువస్ రీనల్ రిప్లేస్‌మెంట్ థెరపీ) ద్వారా కిడ్నీ సమస్యలకు చికిత్స చేస్తున్నామని తెలిపారు. అయితే వైద్యానికి బాబా శరీరం సరిగా స్పందించటంలేదని.. ప్రస్తుతం బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. దీంతో పుట్టపర్తిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
బాబా ఆరోగ్యం పట్ల ట్రస్టు నిర్లక్ష్యం చేస్తోందంటూ భక్తులు మండిపడ్డారు. తక్షణమే తమకు బాబాను చూపించాలని డిమాండ్ చేశారు. బాబాకు చికిత్స అందిస్తున్న సిమ్స్ ఎదుట వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు. సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయటానికి వచ్చిన జిల్లా కలెక్టర్ బి.జనార్దనరెడ్డి వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో కలెక్టర్ వాహనం అద్దాలు పగిలిపోయాయి. వెంటనే డ్రైవర్ వాహనాన్ని పక్కకు తీసుకెళ్లారు. బాబా ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారం తెలుసుకున్న వేలాది మంది భక్తులు ఆస్పత్రి వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించారు.
బాబా ఆరోగ్యంపై సత్యసాయి ట్రస్టు నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆందోళనకు దిగారు. బాబా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటానికి 7.10 గంటలకు వచ్చిన జాయింట్ కలెక్టర్ అనితారామచంద్రన్ వాహనాన్ని అడ్డుకున్నారు. ‘బాబా ఆరోగ్యం మెరుగుపడింది. ఆందోళన చెందవద్దు. ప్రశాంతంగా ఉండండి’ అని జేసీ భక్తులకు సర్దిచెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఆస్పత్రి వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకుని.. ఆందోళన చేస్తున్న భక్తులను చెదరగొట్టాయి. ‘బాబా ఆరోగ్యం మెరుగుపడింది. ప్రశాంతంగా ఉండండి. బాబా ఆరోగ్యం మరింత మెరుగుపడాలని పూజలు చేయండి’ అని భక్తులను పోలీసులు సముదాయించారు. దాంతో.. భక్తులు కొంత శాంతించారు. కానీ.. ఆ తర్వాత మరికొంత మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. గంటగంటలకు పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోతుండటంతో.. ‘బాబా ఆరోగ్యంగా ఉన్నారు. సత్యసాయి మనవడు శ్రావణ్‌కుమార్ బాబా కాళ్లపై పడితే ఆయన కాళ్లు కదిలించారు.. సాయిరాం అన్నప్పుడు బాబా కళ్లు తెరిచి చూశారు. ఆందోళన చెందకండి. బాబా ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ పూజలు చేయండి’ అంటూ పుట్టపర్తి డీఎస్పీ సర్దిచెప్పారు. ఇదిలావుంటే సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై దేశ, విదేశాల్లోని ఆయన భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాబా ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయనను సందర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మంగళవారం పుట్టపర్తి వెళ్లనున్నారు.
ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ...
ఆధ్యాత్మికతను బోధిస్తూ, విశ్వశాంతి స్థాపనకు నడుం బిగించి ప్రపంచ దేశాల్లో తనకంటూ ప్రత్యేక భక్త బృందాన్ని ఏర్పాటు చేసుకున్న సత్యసాయిబాబా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని మార్చి 28న సాయంత్రం 3.30 గంటల సమయంలో పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్) డెరైక్టర్ సఫాయా ఆధ్వర్యంలో వైద్యుల బృందం చికిత్స ప్రారంభించింది. గుండె సాధార ణం కంటే అతి తక్కువ స్థాయిలో కొట్టుకుంటోందని వైద్యులు నిర్ధారించి ఆ దిశగా చికిత్స అందజేశారు. గుండెలో పేస్‌మేకర్ అమర్చి గుండె కొట్టుకోవటాన్ని సాధారణ స్థితికి తెచ్చారు.

"బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఐసీయూలో చికిత్స చేస్తున్నాం. బయటి వారు ఐసీయూలోకి వెళితే ఇన్‌ఫెక్షన్ ఎక్కువై బాబా ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. బాబాను కాపాడడానికి మేం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. బాబా ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ భక్తులంతా ఇళ్లకు వెళ్లి ప్రార్థనలు చేయండి''
- రాత్రి 11 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా
చికిత్సకు బాబా శరీరం సహకరిస్తోంది
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా.. చికిత్సకు శరీరం సహకరిస్తోందని సిమ్స్ డెరైక్టర్ సఫాయా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి 11 గంటల తర్వాత నాలుగో మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. బాబాకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామన్నారు. ఇన్‌ఫెక్షన్ అధికం కాకూడదనే ముందు జాగ్రత్తతో ఐసీయూలోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు.

సత్యసాయి ఆరోగ్యం నిలకడగా ఉందని ఒకసారి, మెరుగవుతోందని ఒకసారి చెబుతూ వస్తున్న వైద్య బృందం... సోమవారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఒక్కసారిగా ప్రకటించింది. 'బాబా కోలుకుంటున్నారు. కిడ్నీలు కూడా పని చేస్తున్నాయి' అని సోమవారం ఉదయం ప్రకటించిన వైద్యులు... సాయంత్రానికి పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు. కొన్ని అవయవాలు సరిగా పని చేయడంలేదన్నారు.
తర్వాత కొద్దిసేపటికి 'బాబా కళ్లు తెరిచారు. కాళ్లు కదిపారు' అని మరో ప్రకటన చేశారు. అసలే తీవ్ర ఆందోళనలో ఉన్న భక్తులకు ఈ పరస్పర విరుద్ధ వార్తలు మరింత ఆందోళన కలిగించాయి. వైద్యులు, ట్రస్టు సభ్యులు ఏదో దాస్తున్నారనే అనుమానం పెరిగింది. పుట్టపర్తిలో తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగ వాతావరణం నెలకొంది. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఆస్పత్రి వద్ద పోలీసుల హడావుడి పెరిగింది. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించే ప్రక్రియ మొదలైంది.
డీఐజీ చారుసిన్హా స్వయంగా అక్కడ శాంతి భద్రతల పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా కలెక్టర్ జనార్దన రెడ్డి పుట్టపర్తి వచ్చారు. ఈనెల 2 నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే మకాం వేసి, బాబా పరిస్థితిని సమీక్షిస్తున్న ఆయన భక్తురాలు, రాష్ట్ర మంత్రి గీతారెడ్డి కన్నీరు పెట్టారు. 'బాబా ఆరోగ్యం మెరుగుపడదా!' అంటూ విలపించారు.
పుట్టపర్తిలో కనిపించని ఉగాది సందడి
సత్యసాయిబాబా అస్వస్థతకు గురికావటంతో సాయి భక్తుల్లో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందడి కనిపించలేదు. పుట్టపర్తిలో సత్యసాయి ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది కుటుంబాలు బాబా నీడన జీవిస్తూ వస్తున్నాయి. సత్యసాయి తమతో లేని (దర్శనం ఇవ్వలేదని) పర్వదినం ఎందుకంటూ స్థానికులు, భక్తులు ఉగాది జరుపుకోలేదు. వ్యాపార వర్గాలు, దినసరి కూలీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ట్రావెల్స్ నిర్వాహకులు, అన్ని వర్గాల కుటుంబాలు గడుస్తున్నాయంటే సాయిబాబా చలవే. బాబా అనారోగ్యంతో ఉండటంతో భక్తులు ఉగాది పర్వదినాన్ని జరుపుకోకుండా ఆందోళనతో ఉన్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుండే ప్రశాంతి నిలయం పూర్తిగా బోసిపోయింది.
పరిస్థితి విషమం! సత్యసాయి ఆరోగ్యంపై భక్తుల్లో ఆందోళన

సోమవారం మధ్యాహ్నం వరకూ నిలకడగానే ఉన్న బాబా ఆరోగ్యం
సాయంత్రానికి అకస్మాత్తుగా పరిస్థితి విషమించిందంటూ బులెటిన్
తక్షణం బాబాను తమకు చూపాలంటూ ఆస్పత్రి ఎదుట భక్తుల ధర్నా
కలెక్టర్ వాహనంపై దాడి, జాయింట్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న భక్తులు
మనవడు కాళ్లమీద పడినపుడు కాళ్లు కదిలించిన సత్యసాయి!
సాయిరాం అన్నప్పుడు బాబా కళ్లుతెరిచి చూశారన్న అధికారులు
వైద్యానికి బాబా శరీరం సహకరిస్తోందని అర్ధరాత్రి సిమ్స్ ప్రకటన
నేడు పుట్టపర్తికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ...

బాబాకు 29వ తేదీన పేస్‌మేకర్‌ను అలానే ఉంచి వైద్యం అందించారు. తిరిగి రక్తపోటు (బీపీ) సమస్య ఉత్పన్నమైంది. ఐఏబీపీ (ఆర్టీరియల్ ఇంటర్వెన్షన్ బ్లడ్ ప్రెషర్) అమర్చి రక్తపోటును నియంత్రించారు. 30వ తేదీన యూరిన్ సమస్య ఉత్పన్నమై బాబా శరీరంలోకి నీరు చేరింది. కిడ్నీ సమస్య తలెత్తినట్లు వైద్యులు గమనించారు. న్యుమోనియా వ్యాధి సోకి ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించారు. చికిత్స చేసి ఊపిరితిత్తులలోని నీరును తొలగించారు. ఎయిమ్స్ మాజీ డైరక్టర్ డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ చికిత్సను మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగించారు.

సామాన్య భక్తులు పెద్దసంఖ్యలో పుట్టపర్తికి చేరుకుంటున్నారు. అంతేకాదు... దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు పుట్టపర్తికి బయలుదేరారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర, ఎల్అండ్‌టీ మాజీ డైరెక్టర్ రామకృష్ణ తదితరులు కూడా పుట్టపర్తికి వెళ్తున్నారు.
బాబా కోసం విదేశీ మహిళ నిరీక్షణ

భక్తజన ఆగ్రహం
సత్యసాయిని ట్రస్టు సభ్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని బంధువులే ఆరోపించడం... ఆయన ఆరోగ్య పరిస్థితిపై అంతులేని గోప్యత పాటిస్తుండటంతో భక్తులు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. ఆందోళనకు కూడా దిగారు. 'మా బాబాను మాకు చూపండి. వాస్తవ పరిస్థితి వివరించండి' అని డిమాండ్ చేశారు.
కానీ... ప్రస్తుతం ట్రస్టు అనుమతితో ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా ఇచ్చే సమాచారమే బయటికి వస్తోంది. చివరికి... ట్రస్టు సభ్యుల్లో ఒకరైన బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌ను సైతం ఆస్పత్రిలోపలికి అనుమతించకపోవడం గమనార్హం. నిజానికి... బాబా ఆరోగ్యం ఆరునెలల క్రితమే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ప్రతి ఏటా తన జన్మదినం సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చి, సందేశమిచ్చే బాబా గత ఏడాది నవంబర్ 23న దర్శనం మాత్రమే ఇచ్చారు. ప్రసంగించలేకపోయారు. అంతకుముందు రెండు మూడు రోజులకొకసారైనా భక్తుల ముందుకు వచ్చేవారు. కానీ... గత నవంబర్ 23న తర్వాత ఒక్కసారి కూడా దర్శనమివ్వలేదు. బాబా తిరిగి కోలుకోవాలని, ఆయన దివ్యదర్శనం తమకు లభించాలని ఇప్పుడు అశేష భక్త జనం ప్రార్థిస్తున్నారు.
బాబా ఆరోగ్యంపై ఎలాంటి గోప్యత లేదు : రఘువీర
పుట్టపర్తి : సత్యసాయిబాబా ఆరోగ్యంపై ఎలాంటి గోప్యత లేదని మంత్రి రఘువీరా స్ఫస్టం చేశారు. ఆయన ఆరోగ్యంపై రోజుకు రెండు మెడికల్ బులిటెన్లను వైద్యులు విడుదుల చేస్తున్నారని తెలిపారు. బాబా ఆరోగ్యం నిన్నటికన్నా నిన్నటికన్నా ఇవాళ కాస్త మెరుగ్తా ఉందని, కిడ్నీలు తప్ప మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయని మరో మంత్రి గీతారెడ్డి తెలిపారు. ఆడియో సంగీతం, ప్రార్థనలకు బాబా స్పందిస్తున్నారని, హారతి ఇవ్వండని సైగలు కూడా చేస్తున్నారని మంత్రి వివరించారు. బాబా ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దుని, ఆయన ఆరోగ్య క్రమంగా కుదుట పడుతోందని గీతారెడ్డి వెల్లడించారు.బాబా ఆరోగ్యం విషమం !

ఆసుపత్రి ఆశ్రమం వద్ద భారీ సంఖ్యలో భక్తులు గుమికూడారు. బాబా క్షేమంగా ఉండాలంటూ వారు పెద్ద పెట్టున విలపిస్తున్నారు. బాబాను తమకు చూపాలని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పుట్టపర్తిలో 144 సెక్షన్‌ను విధించారు. డీఐజీ చారుసిన్హా అక్కడే మకాం చేశారు. గత మూడు రోజులుగా అక్కడే ఉంటున్న మంత్రి గీతారెడ్డి ఒకానొక దశలో భోరున విలపించినట్లు వార్తలు రావడంతో బాబా ఆరోగ్యంపై భక్తుల్లో మరింత ఆందోళన చోటుచేసుకుంది.
ఆ విగ్రహ నిమజ్జనంతోనే బాబాకు కీడు?
పుట్టపర్తి సత్తెమ్మ విగ్రహం కోసం భారీగా గాలింపు
బుక్కపట్నం చెరువు వద్దకు తరలి వచ్చిన భక్తులు

ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి సత్యసాయి కుటుంబంలో అరిష్టం చోటు చేసుకుందన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం సత్యసాయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడానికి ఇది కూడా ఒక కారణమన్న భావన పలువురు భక్తుల్లో వ్యక్తమ వుతోంది. నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు పురాతన విగ్రహాన్ని బుక్కపట్నం చెరువులో పడేశారు.
దీంతో సోమవారం ఒక మహిళకు సత్తెమ్మ దేవత ఆవహించి తన పూర్వపు విగ్రహాన్ని తొలగించినందువల్లనే పుట్టపర్తిలో అరిష్టాలు చోటుచేసు కుంటున్నాయని పేర్కొన్నట్టు భక్తుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 10గంటల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు బుక్కపట్నం చెరువు వద్దకు చేరుకుని జనరేటర్ల ద్వారా లైట్లు అమర్చుకుని చెరువులోకి దిగి పురాతన విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పుట్టపర్తిలో సత్తెమ్మ విగ్రహం పునఃప్రతిష్ట
బుక్కపట్నం చెరువులో ఆరునెలల క్రితం నిమజ్జనం చేసిన సత్తెమ్మ పాలరాతి విగ్రహం మంగళవారం ఉదయం లభ్యమైనది. దీంతో భక్తులు చెరువు గట్టు నుంచి అమ్మవారిని ఊరేగింపుతో ఊళ్లోకి తీసుకువచ్చి విగ్రహానికి అభిషేకం చేసి పునఃప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సత్తెమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత నుంచే బాబా ఆరోగ్యం క్షీణించిందని, చిన్న చిన్న కీడు సంఘటనలు జరుగుతున్నాయని వారన్నారు.
అంతేకాకండా సోమవారం సాయంత్రం ఒక భక్తురాలిపై అమ్మవారు వాలి, తన విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేస్తే సత్యసాయిబాబా ఆరోగ్యంగా కోలుకుని తిరిగి మందిరానికి వస్తారని చెప్పిందని వారన్నారు. దీంతో సోమవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున చెరువ వద్దకు చేరుకుని విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో విదేశీ భక్తులతోపాటు పుట్టపర్తి ప్రజలంతా పాల్గొన్నారు.

నేడు ప్రముఖుల రాక
ఆధ్యాత్మిక వేత్త, ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో... మంగళవారం పుట్టపర్తికి పలువురు ప్రముఖులు రానున్నట్టు సమాచారం.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగ ళవారం ఉదయానికి బెంగుళూరుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి పుట్టపర్తికి చేరుకుంటారు. అశోక్‌సింఘాల్ సోమవారం రాత్రే బయలు దేరి అర్ధరాత్రికి పుట్టపర్తికి చేరుకునే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతోనే వీరు పుట్టపర్తికి రానున్నట్టు తెలిసింది. వీరి రాక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నేతల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే పుట్టపర్తి పోలీసు పహారాలో ఉంది. భక్తుల తాకిడి పెరగనున్న దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ విధించారు.

సత్యసాయి ఆరోగ్యం ఆరు నెలల క్రితమే మందగించిందా?
ఆ విషయాన్ని ట్రస్ట్ వర్గాలు దాచాయా?... భక్తుల ఆవేదన
బాబా తరచూ ఆస్పత్రికి వెళ్లే వారని వెల్లడి
జన్మదినం నాడూ సందేశం ఇవ్వకపోవడమే నిదర్శనమని వ్యాఖ్య
ధర్మవరం, ఏప్రిల్ 4 : సత్యసాయి బాబా ఆరోగ్యం ఆరునెలల క్రితం నుంచే మందగించిందన్న అభిప్రాయం పలువర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. బాబాకు తరచూ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేవారని సమాచారం. అయితే ఆ సమాచారాన్ని ట్రస్ట్ వర్గాలు దాస్తూ వచ్చాయని భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఏడాదీ తన జన్మదినం సందర్భంగా భక్తులకు సందేశమిచ్చే సత్యసాయి.. గత ఏడాది నవంబర్ 23న ఎలాంటి సందేశం ఇవ్వలేదు.
జన్మదిన వేడుకలప్పటికే ప్రసంగించే పరిస్థితిలో కూడా లేని విధంగా సత్యసాయి ఆరోగ్యం మందగించడమే ఇందుకు కారణమని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. పైగా ఆరోజు నుంచి ప్రతిరోజూ భక్తులకు బాబా దర్శనమివ్వలేక పోయారని వారు చెబుతున్నారు. అనారోగ్య పరిస్థితుల కారణంగానే భక్తులకు దర్శనమొసగేందుకు సత్యసాయి రాలేదన్న వాదన వినిపిస్తోంది. గత జన్మదినోత్సవం నుంచి రెండుమూడు రోజుల కొకసారి మాత్రమే సత్యసాయి దర్శనమిస్తూ వచ్చారు.
అయితే అప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూన్నా.. ట్రస్ట్ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాయని భక్తులు వాపోతున్నారు. బాబా అనారోగ్య పరిస్థితులను ప్రభుత్వం దృష్టికైనా తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నాయా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులకు ఆరాధ్య ధైవంగా ఉన్న సత్యసాయి ఆరోగ్యం విషయమై ఇలా ఇంతకాలం గోప్యంగా ఉంచడం పట్ల పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. మార్చి28న బాబా అస్వస్థతకు గురయ్యారంటూ ఆస్పత్రిలో గోప్యంగా చేర్పించిన విషయం తెలిసిందే. బాబా ఆరోగ్యం సరిగా లేని విషయం మీడియా ద్వారానే భక్తులకు తెలిసింది. అప్పటికీ గోప్యత ప్రదర్శించిన ట్రస్ట్‌వర్గాలు.. భక్తుల ఆందోళనను గమనించి ఎట్టకేలకు బాబా ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఊహాగానాలను, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దంటూ మార్చి28న విడుదల చేసిన బులెటెన్‌లో ఆస్పత్రివర్గాలు పేర్కొన్నాయి.
అప్పటి నుంచి కూడా పూర్తిగా ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాబాకు వైద్య సేవలు అందజేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాపించడంతో.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆస్పత్రి వర్గాలు బులెటిన్‌లు విడుదల చేస్తూ వస్తున్నాయి.

సత్యసాయి ట్రస్టులో స్వార్థ శక్తులు
భగవంతుడే బందీ?
సేవా యజ్ఞంలో 'కైంకర్యం'
ఆస్పత్రిలో చేరక ముందు బాబా తీవ్ర ఆవేదన!
ఇది... సత్యసాయి భక్త జన బృందం జీర్ణించుకోలేని వార్త! సత్యసాయి తనకు అత్యంత సన్నిహితమైన భక్తులతో పంచుకున్న ఆవేదన! ఆ వర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.... ప్రశాంతి నిలయం కేంద్రంగా పుట్టపర్తి సత్యసాయి బాబా ట్రస్టు దేశ విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేల కోట్ల విలువైన ఆస్తులు ఈ ట్రస్టు సొంతం. సంపద ఉన్న చోట కుట్రలూ, కుయుక్తులూ ఉంటాయి. అదే విధంగా... ఈ ట్రస్టులోనూ కొన్ని చీడ పురుగులు చేరాయి. బాబా స్థాపించిన సేవా సామ్రాజ్యాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూశాయి. ఈ విషయం సత్యసాయి దృష్టికి కూడా వచ్చింది.
ఆస్పత్రిలో చేరడానికి కొన్ని రోజుల ముందు... తనను కలిసిన ఒక అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడికి సత్యసాయి తన పరిస్థితి వివరించారు. ట్రస్టులోని కొందరు సభ్యులు తనను బందీగా మార్చారని బాబా చెప్పినట్లు తెలిసింది. తాను తలపెట్టిన సేవాయజ్ఞాన్ని సొంత కైంకర్యానికి ఉపయోగించుకుంటున్నారని కూడా పేర్కొన్నట్లు సమాచారం. తాను స్వతంత్రుడిగా లేనని, బందీగా మారానని ఆ భక్తుడి ముందు బాబా తన క్షోభను బయటపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆధిపత్య పోరు...
పుట్టపర్తి సాయిబాబా భక్తి, సేవా కార్యక్రమాలన్నీ 'సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్' ద్వారా నడుస్తాయి. ఈ ట్రస్టులో ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తున్న సంకేతాలున్నాయి. సత్యసాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ట్రస్టులోని కొందరు సభ్యులే కొన్నాళ్లుగా ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.
బాబా ఆరోగ్యం గురించి ట్రస్టు సభ్యులు సరిగా పట్టించుకోలేదని ఆయన బంధువులే చెబుతున్నారు. బాబాకు సంబంధించిన అన్ని విషయాలనూ గోప్యంగా ఉంచుతున్నారని, ఆయన అనారోగ్యానికి వారే కారణమని కూడా ఆరోపిస్తున్నారు. బాబాకు వైద్య చికిత్స చేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వైద్య బృందం వచ్చినా.. రాహుకాలం పేరిట ఒక సభ్యుడు గంటపాటు వైద్యం అందించకుండా ఆలస్యం చేయించారని వీరు చెబుతున్నారు.
"గత ఏడాది నవంబర్‌లో జన్మదిన వేడుకలు జరిగిన తర్వాతి నుంచే రోజురోజుకూ బాబా ఆరోగ్యం క్షీణిస్తోంది. ఐదు నెలలుగా ఆయన అన్నం మానేసినా... ట్రస్టు సభ్యులు అన్నం పెట్టిన పాపాన పోలేదు'' అని బంధువులు మండిపడ్డారు. చివరికి... ఆస్పత్రిలో ఉన్న సత్య సాయిబాబా వద్దకు సన్నిహిత బంధువులెవరినీ ట్రస్టు సభ్యులు రానివ్వడంలేదు. వారే మొత్తం కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. శనివారం మాత్రం బాబాకు వెంటిలేషన్ పెట్టేందుకు సమ్మతి కావాలంటూ బంధువులను సంప్రదించారు.
ట్రస్టు ఇదీ...
సత్యసాయి సెంట్రల్‌కు భగవాన్ సత్యసాయి బాబా అధ్యక్షుడిగా ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రవర్తి దీనికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త మద్రాస్ శ్రీనివాస్, సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ మాజీ వీసీ ఎస్‌వీ గిరి, సత్యసాయి సోదరుడి కుమారుడు ఆర్‌జే రత్నాకర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భగవతి, ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ హిందూలాల్ షా, ప్రముఖ వ్యాపారవేత్త బెంగళూరు శ్రీనివాస్‌లు సభ్యులుగా ఉన్నారు.
ట్రస్టు సభ్యులను తరచూ మారుస్తుంటారు. అయితే, చెక్ పవర్‌తోపాటు ట్రస్టు వ్యవహారాలన్నీ బాబాతోపాటు కార్యదర్శి పేరుమీద జాయింట్ అకౌంట్‌లో నడుస్తాయని తెలుస్తోంది. గతంలో ట్రస్టు సభ్యుడిగా ఉన్న జానకి రామ య్య మరణానంతరం ఆయన కుమారుడు రత్నాకర్‌కు అవకాశం ఇచ్చారు.
ఇటీవలికాలంలో చెక్ పవర్‌ను కూడా రత్నాకర్ పేరిట బదలాయించేందుకు ప్రయత్నా లు జరిగినా.. మిగిలిన సభ్యులు బాబా వద్ద మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇక, ట్రస్టులో తమిళనాడుకు చెందిన సభ్యుల డామినేషన్ ఉండడంతో వారి హవాయే కొనసాగుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే... సత్యసాయి ట్రస్టు లో లుకలుకలేవో జరుగుతున్నట్లు ఇట్టే అర్థమవుతుంది.

No comments:
Post a Comment