పుట్టపర్తి బోసిపోతున్నది. ఆసుపత్రిలో బాబా అపస్మారక స్థితిలో ఆఖరు ఘడియల్లో ఉన్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రి బెడ్ మీద బాబా దేహానికి, ఆత్మకు మధ్య ఆఖరి చూపు నడుస్తోంది.

ఆత్మ బాబా దేహాన్ని వీడి పరమాత్మ వద్దకు చేరే ఘడియలకు ఘడియ తొలగింది.భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా అంతిమ ఘడియకు చేరుకున్నారన్న ఒక్క విషయాన్ని ఎట్టకేలకు డాక్టర్లు ఆలస్యంగానయినా వెల్లడించారు. ఆయనకు కొద్దిరోజుల నుంచి చికిత్స చేస్తున్న డాక్టర్లతో పాటు ఆరోగ్య స్థితిని సమీక్షిస్తోన్న ప్రభుత్వం గురువారం చేసిన ప్రకటనతో.. ఇప్పటికీ అంతో ఇంతో బాబా ఆరోగ్యంపై నమ్మకంతో ఉన్న భక్తుల్లో ‘బాబా భౌతికంగా లేరేమో’నన్న అనుమానం తొలిసారిగా నిజమయ్యే పరిస్థితి వచ్చింది. బాబా అత్యంత విషమ పరి స్థితిలో ఉన్నారని, డాక్టర్లు చేయవలసిందంతా చేశారని, ఆయన ఆరోగ్యం బాగుండా లని భక్తులు దేవుడిని ప్రార్థించాలంటూ మంత్రి రఘువీరారెడ్డి పిలుపునివ్వడంతో ఇక బాబా అంతిమ ఘడియకు చేరువయ్యారన్న విషయాన్ని చెప్పలేక చెప్పినట్టయిందని భక్తులు అంటున్నారు.
బాబా మెదడు బాగానే ఉంది.
కృత్రిమ ఏర్పాట్లవల్ల అవయవాలు పనిచేస్తున్నాయి,
పుట్టపర్తిలో హెలిప్యాడ్ల ఏర్పాటు
పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితినిబట్టి చూస్తుంటే ప్రస్తుత పరిస్థితులలో భవిష్యత్తుగురించి ఏమీ చెప్పే పరిస్థితి లేదని డాక్టర్ రవిరాజ్ వెల్లడించారు. బాబా శరీర అవయవాలు అన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లవల్ల పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. బాబాకు సి.ఆర్.ఆర్.టి. చికిత్స కొనసాగుతున్నదని డాక్టర్ సఫాయా వెల్లడించారు.
బాబా ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం వెలువడిన బులెటిన్‌లో డాక్టర్లు ప్రత్యేక విశేషాలేమీ పేర్కొనలేదు. బాబా రక్త పోటు, హార్ట్ బీట్ నిలకడగా ఉన్నాయని, ఉదయానికి, సాయంత్రానికీ ఆరోగ్య పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే బాబా మెదడు మాత్రం బాగానే ఉందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
బాబా తిరిగి పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని కోరుతూ భక్తులు పెక్కుమంది పుట్టపర్తిలో ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతో మంది భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. అయితే ఎటువంటి వార్త వెలువడినా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు, ఉద్విగ్న పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినప్పుడు వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏ క్షణాన ఎటువంటి వార్త వెలువడినా దేశం నలుమూలలనుంచీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే పుట్టపర్తిలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఏ క్షణమైనా సత్యసాయికి వెంటిలేటర్ తొలగింపు
సత్యసాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్న పేపథ్యంలో శుక్రవారం సాయంత్రంలోపల ఏ క్షణమైనా సత్యసాయికి వెంటిలేటర్‌ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే మంచి ఘడియలకోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ట్రస్ట్ సభ్యులు బాబా సన్నిహితులకు వర్తమానం పంపించారు. పుట్టపర్తి అంతా ఖాకీమయమైంది. పుట్టపర్తికి ప్రముఖులు వస్తుండడంతో అక్కడ సుమారు ఆరువేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో 144 సెక్షన్ విధిస్తూ, విమానాశ్రం వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. సత్యసాయి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఆయన భక్తులు భారీ సంఖ్యలో పుట్టపర్తికి తరలివస్తున్నారు.
పుట్టపర్తిలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు జిఏడి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బాబాను చూడటానికి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు రానున్నట్లుగా తెలుస్తోంది. బాబా అంతిమయాత్రకు పుట్టపర్తిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాబాను భక్తులందరూ చూసే విధంగా పుట్టపర్తి స్టేడియంలో బిగ్ స్క్రీన్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ధర్మవరంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి మూడు హైపవర్ జెనరేటర్లు తరలించారు. ఎపిఎస్పీ రెండో బెటాలియన్ బ్యాండ్ పార్టీని కూడా తరలించారు. కడప, వరంగల్ జిల్లాకు చెందిన ఎపిఎస్పీ బెటాలియన్ పోలీసులు కర్నూలులో సిద్ధంగా ఉన్నారు. కర్నూలు ఎపిఎస్పీ బెటాలియన్ ఇప్పటికే పుట్టపర్తికి తరలి వెళ్లింది.
సత్యసాయికి అమర్చిన వెంటిలేటర్ తొలగింపుపై తర్జనభర్జలు జరుగుతున్నాయి. ఆ బాధ్యత తమదికాదంటూ, ట్రస్ట్ సభ్యులదే బాధ్యత అని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు బాబా తర్వాత ట్రస్ట్ బాధ్యత ఎవరు నిర్వహిస్తారన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మంత్రి గీతారెడ్డి ఈరోజు ఉదయం బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇప్పటికే రెండు వర్గాలుగా ట్రస్ట్ సభ్యులు విడిపోయి ఆధిపత్యంకోసం వెంపర్లాడుతున్నారు.
కాగా పుట్టపర్తి అనాధ కాకూడదని భక్తులు కోరుతున్నారు. ఆశ్రమ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. సత్యసాయిబాబా ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉందని డాక్టర్ సఫాయా తెలిపారు. సాయి ఆరోగ్యంపై బులెటిన్‌ను శుక్రవారం ఉదయం సిమ్స్ డాక్టర్లు విడుదల చేసిన సందర్భంగా సఫాయా మాట్లాడుతూ బాబాకు సిఆర్ఆర్టీ ద్వారా ఇంకా డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు.
బాబా ముఖ్య అవయవాల స్పందన అంతంత మాత్రంగానే ఉందని, గురువారానికి ఈ రోజుకు బాబా ఆరోగ్య స్థితిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. బాబా ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకు రావడానికి అందరు డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాబా యొక్క గుండె స్పందన, రక్తపోటు తగ్గుతోందని, బాబా పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ సఫాయా తెలిపారు.

చాలాకాలం నుంచి బాబాకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు చివరకు బాబా ఆరోగ్యాన్ని పరిరక్షించడం తమ వల్ల కాదని తేల్చేశారు. బాబా శరీరంలోని ఏ ఒక్క అవయవాలు పూర్తిగా పనిచేయడం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అంటే బాబా కేవలం దేహంతోనే ఉన్నారని, భౌతికంగా లేరన్న ఒక్క విషయం మాత్రం ప్రకటించలేక డాక్టర్లు దాటవేస్తున్నట్లు వరస వెంట వస్తున్న బులిటిన్లు చాటు తున్నాయి. అటు డీజీపీ కరణం అరవిందరావు సైతం పుట్టపర్తికి ఇంకా అవసరమైతే అదనపు బలగాలను పంపిస్తామని వెల్లడించారు.
అంటే అక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళితే శాంతిభద్రత సమస్య ఉత్పన్నమవుతుందని, అందుకోసం ముందుజాగ్రత్తతోనే బలగాలను సిద్ధం చేస్తున్నారని అర్ధమవుతోంది. దానికితోడు పుట్టపర్తి హోటళ్లలో బయట వారికి రూములు ఇవ్వవద్దంటూ నిషేధాజ్ఞలు విధించడం కూడా ‘బాబా మెడికల్లీ డెడ్’పై వస్తున్న వార్తలను మరింత ఆలోచింపచేస్తున్నాయి. గురువారం బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణ దశకు చేరుకుందన్న డాక్టర్ల ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, డీజీపీ కరణం అరవిందరావు, ఇంటలిజెన్స్ డీజీ మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ పరిణామాలు పరిశీలిస్తే.. బాబా అంతిమ ఘడియలను ప్రకటించడమే తరువాయని తెలుస్తోంది.
ఆఖరి ప్రయత్నం

ఉదయం నుంచి సాయంత్రం వరకూ మంత్రి గీతారెడ్డి, ట్రస్టు సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఐజి పలుమార్లు సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రిలో ఒకసారి, మరోసారి శాంతి భవన్లో, ఇంకొకమారు బంగ్లాలో ఇలా పలుమార్లు వీరం దరూ సమావేశమయ్యారు. జిల్లా కలెక్టరు జనార్ధనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబా ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తున్న మాట వాస్తవమేనన్నారు. వైద్యం చేయాలంటే ప్రధాన అవయవాలు సహకరించడం లేదని కూడా చెప్పా రు. అయినా వైద్యుల తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు.

ట్రస్టు వ్యవహారాలు, వారసుని పాత్రపై ఒక నిర్ధారణకు వస్తే తప్పించి బాబా ఆరోగ్యంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకానొక దశలో శాంతిభవన్‌లో సమావేశమైన వీరితో వాదనకు దిగిన జిల్లా ఎస్పీ వీరి వ్యవహారశైలిపై మండిపడ్డట్టు సమాచారం. గురువారం వీరందరూ పలుమార్లు హడావుడి చేస్తూ సమావేశం కావడంతో పై వాదనలకు బలం చేకూరు తోంది. ఇప్పటికే పోలీసులు పుట్టపర్తిలో ఉన్న పలువురు రియల్టర్లు, బిల్డర్లను పిలిపించి హెచ్చరించినట్లు తెలిసింది. వీరితో పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జీలు, ట్రావెల్ యజమానులను కూడా హెచ్చరించినట్లు సమాచారం.
ఏదయినా అనుకోని సంఘటన జరిగితే మీరు కానీ, మీ వాళ్లు కానీ అతిగా స్పందించకుండా ఉండాలన్న కోణంలో వారిని పోలీసులు పిలిచి హెచ్చరించినట్లు సమాచారం. ఇక గురువారం కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సత్యసాయిబాబా బంధువులు ఒక్కొ క్కరే ఆసుపత్రిలోకి వెళ్లి వస్తున్నారు. అక్కడి విషయాలను బయటకు వెళ్లడించడానికి ముందుకు రాకుండా మీడియాకు మొహం చాటేస్తున్నారు. పుట్టపర్తిలో మాత్రం పోలీసులు హడావుడి చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి. బాబా ఉన్నా లేకున్నా ప్రశాంతి నిలయంలో ప్రతిరోజూ భజనలు, పూజలు, కీర్తనలు జరుగుతూనే ఉంటాయి.రెండు రోజుల నుంచీ పోలీసుల హడావుడి పెరగడంతో ప్రశాంతి నిల యంలోని ప్రార్థనా మందిరానికి రావడానికి కూడా విదేశీ భక్తులు, స్థానిక భక్తులు, ప్రజలు జంకుతున్నారు. బాబా ఆరోగ్యం కోసం ఆఖరి ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకునే క్రమంలోనే వైద్యులు ఇంకా ఇంకా చికిత్స పేరుతో బులిటెన్లు విడుదల చేస్తున్నారన్న ప్రచారం ఉంది.
NICE news covering sir....
ReplyDeleteplease DO NOT post such type of news which all the world already aware of it... try to understand that such type of cutting and pasting of news paper collection is a waste of time and you are hurting the feelings of Baba devotees....
ReplyDelete