నాటి కుగ్రామం.. నేడు మినీ ప్రపంచం
ఒకప్పుడు కనీసం దారి కూడా లేదు
ఇప్పుడు విమానాశ్రయంతో సహా సకల సౌకర్యాలు
30 ఏళ్లలో ఎన్నో మార్పులు
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి
Narayana Seva: Feeding The Poor At Puttaparti, 1948

అనంతపురం జిల్లాలో గొల్లపల్లి ఓ కుగ్రామం. 30 ఏళ్ల కిందట అక్కడ వందలోపే ఇళ్లు. బస్సు కాదు కదా.. కనీసం దారి కూడా లేదు. రాకపోకలకు కాలి నడక లేదా జట్కాబండే దిక్కు! మరి ఇప్పుడు.. పేరు మాత్రమే కాదు.. ఆ గ్రామం రూపు రేఖలే మారిపోయాయి. పుట్టపర్తిగా మారిన గొల్లపల్లి ఇప్పుడో మినీ ప్రపంచం. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం. దాదాపు 180 దేశాలకు నుంచి భక్తులు తరచూ అక్కడికి వస్తుంటారు.
Prashanti Nilayam Mandir, Puttaparty, 1950

ఇందుకు కారణం.. సత్యసాయిబాబా జన్మస్థలం పుట్టపర్తి కావడమే! తాను బాబా అవతారమని బాల్యంలోనే సత్యసాయి చెప్పినా ఎవరూ నమ్మలేదు. అయినా, అంతుబట్టని రీతిలో ఆయన ఆధ్యాత్మిక బోధనలు, ప్రేమతత్వం గురించి బోధనలు చేసేవారు. వాటిని విన్న కొంతమంది హేళన చేసినా.. బాబా సామాన్య మానవుడు కాదని కరణం సుబ్బమ్మ గుర్తించారు. 1945లో బాబా కోసం చిన్నపాటి భజన మందిరం నిర్మించి ఇచ్చారు. అప్పట్లోనే భజన చేయడం, చిన్న పిల్లలకు భక్తిపాటలు నేర్పించడం.. వారు కోరినట్లు పళ్లు, లడ్డూలను బాబా సృష్టించి ఇచ్చేవారు.
Foundation Stone Laid For General Hospital, Prashanti, 1954

దీంతో, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆయన దర్శనార్థం వచ్చేవారు. అప్పట్లో పుట్టపర్తికి బస్సులు లేవు. పెనుకొండ నుంచి బుక్కపట్నంకు ఒకే బస్సు ఉండేది. అక్కడి నుంచి భక్తులు కాలి నడకన వచ్చేవారు. 1950లో కర్ణాటకకు చెందిన సాకమ్మ అనే భక్తురాలు 'ప్రశాంతి నిలయం' అనే మందిరాన్ని నిర్మించి ఇచ్చారు. 1985లో సత్యసాయి జన్మదిన వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా పది ల క్షలమందికిపైగా భక్తులు హాజరయ్యారు. ఈ పరిణామంపై అప్పట్లో ప్రభుత్వాలు కూడా విస్తుపోయాయి.
Prashanti Nilayam, Puttaparthi, circa 1965

సత్యసాయి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో అపార్ట్‌మెంట్లు, భవనాలు విరివిగా పెరిగాయి. ప్రశాంతి నిలయం మరింత విస్తరించింది. భక్తుల కోసం గదులు వెలిశాయి. 1964లో సత్యసాయి చిన్న ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం అది జనరల్ ఆస్పత్రిగా రూపుదిద్దుకుంది. విద్యాదానం కోసం ఓ చిన్న పాఠశాలను ప్రారంభించారు. 1982లో అది డీమ్డ్ యూనివర్సిటీగా మారింది. తాగునీటి కోసం ప్రత్యేకంగా 2005లో సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. పేదల వైద్యం కోసం 1991లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి అతి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించారు.

ఎయిర్ పోర్టును సైతం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రైల్వే లైన్ పుట్టపర్తికి రావడమూ సత్యసాయి ప్రభావమే. దాదాపు 180 దేశాల నుంచి భక్తులు తరచూ పుట్టపర్తికి రావడమే కాకుండా.. వారిలో చాలామంది స్థానికంగా ప్లాట్లు కొనుక్కుని ఇక్కడే ఉండిపోవడంతో జనాభా పెరిగి పుట్టపర్తి పట్టణమైంది. దీంతో, పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థను ప్రభుత్వమే 1992లో ఏర్పాటు చేసింది. ఆటల పోటీల కోసం సత్యసాయి ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియాలను నిర్మించారు.
వైద్య నారాయణుడు..సాయి!
వైద్యో నారాయణో హరిః! అంటే.. వైద్యుడు దేవుడితో సమానమని. అయితే.. లక్షలాదిమందికి ఉచితంగా ఆరోగ్య భాగ్యాన్ని కల్పించిన సత్యసాయి సాక్షాత్తూ వైద్య నారాయణుడే! దీర్ఘకాలిక, మొండి రోగాలతో చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేక ఎక్కువమంది పేదలు ప్రస్తుతం అకాల మరణానికి గురవుతున్నారు. వారందరికీ నేనున్నారంటూ ఆపన్న హస్తం అందించారు సాయిబాబా. దేశంలో మరే సంస్థ చేయలేని మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
1991 నవంబర్ 22న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఎటువంటి దీర్ఘకాలిక రోగాలకు అయినా అతి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. నాటినుంచి నేటివరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన ఆస్పత్రిలో గుండె, మూత్ర పిండాలు, కళ్లు తదితరాలకు శస్త్రచికిత్సలు చేయడమే కాదు రోగులకు అన్ని ఏర్పాట్లు ఉచితంగా అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా పుట్టపర్తిలోనే అతిపెద్ద సేవా కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికీ రోజుకు ఆరుగురికి గుండెకు సంబంధించిన చికిత్సలు చేస్తున్నారు.
ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందిలో కూడా సాయి ప్రేమతత్వం అడుగడుగునా కనిపిస్తుంది. ఆస్పత్రిలో 400 మంది సిబ్బంది, 55 మంది వైద్యులు పనిచేస్తున్నారు. వీరిలో 15 మంది ఉచితంగా సేవలు అందిస్తున్నారు. వీరుకాక కొన్ని వందలమంది సేవాదళ్ సభ్యులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడకు వచ్చి చికిత్సలు అందుకుంటారు. ఎన్నో బాధలతో వచ్చే రోగులు తిరిగి ఆరోగ్యంగా వెళ్లడమేకాక ఒక పవిత్ర దేవాలయాన్ని చూసి తరించామన్న సంతృప్తితో తిరిగి వెళ్తున్నారు.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోనూ మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించిన సత్యసాయి.. అక్కడ కూడా రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. విలువ కట్టలేని వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న సత్యసాయిని తమకు జీవితాన్ని ప్రసాదించిన పరమాత్మగా రోగులు సంభావిస్తారు. అందుకే, సత్యసాయిని ప్రపంచ మానవాళి ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా ప్రత్యక్ష దైవంగా నిర్మల హృదయంతో పూజిస్తోంది.

అపర భగీరథుడు సత్యసాయి
తీవ్ర వర్షాభావ జిల్లా అయిన అనంతపురంలో ఎన్నో గ్రామాల ప్రజలకు తాగునీరు సైతం అందుబాటులో లేదన్న విషయాన్ని గుర్తించిన సత్యసాయి.. తాగునీరు అందించడానికి 1995లో శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. గొంతెండుతున్న గ్రామాలకు దీంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. మొదటి సారిగా రూ.200 కోట్లు పైగా వెచ్చించి, వెయ్యి కిలోమీటర్ల పైపులైను ఏర్పాటు చేయగా, 300 గ్రామాలకు తాగునీటి సదుపాయం కలిగింది.
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు.. సత్యసాయి తాగునీటి పథకాన్ని పుట్టపర్తిలో సత్యసాయి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రారంభించారు. అది నేడు జిల్లాలోని వెయ్యి గ్రామాలకు విస్తరించింది. అనంతపురం జిల్లాకే కాక కరీంనగర్, మహబుబ్‌నగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో సత్యసాయి తాగునీటిని అందిస్తున్నారు. చెన్నై ప్రజల తాగునీటికై బాబా 2002లో రూ.100కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు.

బాబా ఆరోగ్యంపై బాల్య స్నేహితుల ఆందోళన
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరోగ్యం విషమించడంపై.. ఇక్కడి ఆయన స్నేహితులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం పట్టణంతో సత్యసాయిబాబాకు విడదీయరాని అనుబంధం ఉంది. బాబా తన చిన్నతనంలో కమలాపురం పట్టణంలోని తన మామ రామరాజు ఇంట్లో ఉండి చదువుకొనే వారు. ఈయన చదివిన పాఠశాలకు ప్రస్తుతం భగవాన్ సత్యసాయి బాబా పాఠశాలగా నామకరణం చేశారు.
కాగా.. బాబా వయస్సు వారు పలువురు ఇప్పటికే తనువు చాలించారు. ఉన్న కొద్ది మంది స్నేహితులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. "బాబా చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలు కలిగిన గొప్ప వ్యక్తి. తోటి విద్యార్థులకు అనేక మహిమలను ఆయన చూపారు. హైస్కూల్ విద్యను అభ్యసించే వయస్సులో బాబా స్కౌట్ గ్రూపునకు లీడర్‌గా ఉండి తోటి విద్యార్థులను పలు ప్రాంతాలకు తీసుకుపోయేవారు.
ఈ సందర్భంగా ఒకసారి పుష్పగిరి క్షేత్రానికి తోటి స్నేహితులతో కలిసి వెళ్ళి అక్కడ పెన్నా నదిలోని ఇసుకను వారికి ఇవ్వగా అది చక్కెరగా మారింది'' అని ఆయన స్నేహితులు తెలిపారు. బాబా మరో సారి నీటిపై తేలియాడుతూ.. తన మహిమలను చూపారు. ఇది చూసిన ఆయన తోటి స్నేహితులు.. సత్యసాయిని అప్పట్లోనే బాబాగా పిలవడం మొదలు పెట్టారు.
బాబా మామ రామరాజు ఇంటి పక్కనే ఉన్న అంబటి రెడ్డమ్మతో కలిసి పాచికలు ఆడేవారని స్థానికులు తెలిపారు. బాబా అరోగ్యం విషమించడంపై ఈమె తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కమలాపురం నుంచి పుట్టపర్తికి బాబా చేరుకున్నాక.. ఆయన మహిమలతో అనేక మంది భక్తులుగా మారారు.

No comments:
Post a Comment