హమ్మయ్యా..! బాబా బాగున్నారు !

ట్రస్ట్.. మౌనం!
ఆందోళనకరమే.. భయపడాల్సిన పనిలేదు: మంత్రి రఘువీరా
అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయి
ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది: గాంధీ డైరెక్టర్ అశోక్
బాబా కళ్లు తెరిచారు.. ఆయన ఆరోగ్యం సంతృప్తి కరం
హారతి ఇవ్వాలా అని అడిగితే కనుసైగ చేశారు: మంత్రి గీతారెడ్డి
బాబా ఆరోగ్యంపై భిన్న ప్రకటనలు.. ప్రపంచవ్యాప్తంగా భక్తుల్లో తీవ్ర ఆందోళన
అయినా నోరు మెదపడి ట్రస్ట్ వర్గాలు.. ఆస్పత్రి డైరెక్టర్ ప్రకటనలే ఆధారం
పుట్టపర్తిలో గంభీర వాతావరణం.. భారీ ఎత్తున బారికేడ్లు

"సత్యసాయి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. అయినా భయం లేదు. రెండు రోజుల కిందటితో పోలిస్తే ఆయన ఆరోగ్యం మెరుగు పడింది. బాబా కళ్లు తెరిచారు. హారతి ఇవ్వాలా? అని అడిగితే కనుసైగ చేశారు. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగానే పని చేస్తున్నాయి. కిడ్నీలు మాత్రం సహకరించడం లేదు''... బాబా ఆరోగ్య పరిస్థితిపై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయాతోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు చేస్తున్న భిన్న ప్రకటనలివి.
బాబా ఆరోగ్యంపై ఒక్క పుట్టపర్తిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లోని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని, బాబాను దర్శించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే.. ప్రపంచవ్యాప్తంగా 1200 సేవా సంస్థల ద్వారా మానవాళికి సేవలు అందిస్తూ కోట్లాదిమంది భక్తులు దైవ స్వరూపుడిగా కొలుస్తున్న బాబా ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న విషయంపై ఆయనను సంరక్షిస్తున్న ట్రస్టు వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు.
బాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత, మీడియా ద్వారా ప్రపంచానికి విషయం తెలియడంతో ఆయన సోదరుడి కుమారుడు, ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ మొదటిరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. బాబా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు సెంట్రల్ ట్రస్ట్‌లో బాధ్యత కలిగినవారెవరూ సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై నోరు మెదపడం లేదని పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అస్వస్థతకు గురైన బాబా మార్చి 28న పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బాబా ఎవరి సంరక్షణలో ఉన్నారు? తీవ్ర అస్వస్థతకు గురి కాకముందు ఆయనకు సేవలు అందించినవారు ఎవరు? ఒక్కసారిగానే ఆయన అస్వస్థతకు గురయ్యారా? లేకపోతే, ఎంతకాలం నుంచి బాబా అనారోగ్యంతో బాధ పడుతున్నారు? అంటూ భక్తులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పేవారే కరువయ్యారు.
అదే సమయంలో, బాబా ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నా భయపడాల్సిన పని లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడిన మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి డైరెక్టర్ అశోక్ మంగళవారం పుట్టపర్తికి చేరుకుని ఆస్పత్రి వర్గాలతో చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. సత్యసాయి శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగానే పని చేస్తున్నాయని, కిడ్నీలు మాత్రం సహకరించడం లేదని తెలిపారు.
సీఆర్ఆర్‌టీ (కంటిన్యువస్ రీనల్ రిప్లేస్‌మెంట్ థెరపీ) చికిత్స ద్వారా ఆయన ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. ఇక, కొద్ది రోజులుగా పుట్టపర్తిలోనే ఉన్న రాష్ట్ర మంత్రి గీతారెడ్డి మంగళవారం బాబాను దర్శించుకున్న తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు తాను మూడుసార్లు బాబాను దర్శించుకున్నానని, ఆయన శరీరంలో కదలికలు వచ్చాయని, కళ్లు తెరిచారని చెప్పారు.
హారతి ఇవ్వాలా? అని అడిగినప్పుడు ఇవ్వాలంటూ కనుసైగల ద్వారా బాబా చెప్పారని వివరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బాబా ఆరోగ్యంపై గంటసేపు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో మాట్లాడానని, అన్నివిధాలా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణులు బాబాకు చికిత్సలు అందిస్తున్నారన్నారు.
అదే సమయంలో, మంగళవారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో "బాబా ఆరోగ్యం సోమవారం ఎలా ఉందో మంగళవారం కూడా అలాగే ఉంది'' అని డాక్టర్ సఫాయా పేర్కొన్నారు. సత్యసాయి ఆరోగ్యం విషమంగా ఉందని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాబా ఆరోగ్యంపై ఇన్ని భిన్న ప్రకటనలు వెలువడుతున్నా.. సత్యసాయిని సంరక్షిస్తున్న వర్గాలు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పెదవి విప్పడం లేదని భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

భక్తుల పూజలు.. హోమాలు
సత్యసాయి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ పుట్టపర్తిలో పూజలు, హోమాలు చేశారు. గ్రామ దేవత సత్తెమ్మ ఆలయంతోపాటు వివిధ దేవాలయాల్లో పెద్దఎత్తున పూజలు, హోమాలు నిర్వహించారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో భక్తులు సాయి నామస్మరణతో భజనలు చేశారు. సాయిబాబా తిరిగి దర్శనమివ్వాలని, సాయికుల్వంత్ హాల్‌కి పూర్వపు శోభ రావాలని భక్తులు వేడుకుంటున్నారు.
పుట్టపర్తికి పలువురు ముఖ్యులు
పుట్టపర్తికి మంగళవారం పలువురు ముఖ్యులు విచ్చేశారు. వీహెచ్‌పీ అధినేత అశోక్ సింఘాల్‌తోపాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్, జాతీయ విపత్తుల సలహా సంఘం సభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి వచ్చారు. ఇక, జిల్లాస్థాయి అ«ధికారులు మొత్తం పుట్టపర్తిలోనే మకాం వేశారు. కలెక్టర్ జనార్దన్ రెడ్డి, డీఐజీ చారుసిన్హా, ఎస్పీ షానవాజ్ ఖాసీంలతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు ప్రముఖులకు బందోబస్తుతోపాటు బాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపుతూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

డాక్టర్ సఫాయా.. ఈ పేరు తొమ్మిది రోజులుగా ప్రముఖంగా వినిపిస్తోంది. సత్యసాయి పేరుతో పాటు డాక్టర్ సఫాయా పేరు కూడా ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సత్యసాయి మెడికల్ కళాశాల డెరైక్టర్‌గా సఫాయా కొన సాగుతున్నారు. సఫాయా కాశ్మీర్ వాసి. గతంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) డెరైక్టర్‌గా పనిచేశారు. బాబా భక్తుడైన ఇతను తరచూ సాయి దర్శనం కోసం పుట్టపర్తికి వచ్చేవారు. ఇలా సఫాయా అంటే బాబాకు ప్రత్యేక అభిమానం. ఈ క్రమంలో సఫాయా ఎయిమ్స్ డెరైక్టర్ పదవికి రాజీనామా చేసి బాబా సేవలోనే గడిపేందుకు ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సఫాయాను బాబా 1992లో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెరైక్టర్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆస్పత్రి సేవలను విస్తృత పరచటంలో సఫాయా కీలక పాత్ర పోషించారు. తొమ్మిది రోజులుగా బాబా ఆరోగ్యంపై రోజూ మెడికల్ బులిటిన్‌లు విడుదల చేస్తూ వార్తల్లోకెక్కారు.
బాబాకు ఏదో అయిందని భక్తుల్లో ఆందోళన. ఆసుపత్రి వద్ద తండోపతండాలుగా భక్తులు గుమికూ డారు. లోపల ఏం జరుగుతున్నదో తెలీదు. బైటికొచ్చి వాస్తవం చెప్పరు. దాంతో అనుమానాలు..అవి మరింత పెరిగి పెను భూతాలు. సత్య సాయిబాబా ట్రస్ట్ మీద ఆగ్రహం. ప్రభుత్వం మీద కోపం. అదంతా అక్కడికి ఎవ్వరు వెళితే వారి మీద ప్రతిఫలించింది. దానికి తోడు డాక్టర్ల బులెటిన్లు సృష్టించిన అయోమయం. బాబా కోలుకుంటున్నారని ఒక సమాచారం. ఇంతలోనే రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి బాబా పరిస్థితికి భోరున విలపించారని మరో వర్తమానం. ఈ రెండింటిలో దేనిని భక్తులు ప్రామాణికంగా తీసుకుంటారు? దేన్ని తీసుకోవాలో దాన్నే తీసుకున్నారు. బాబా క్షేమంగా ఉంటే మంత్రి విలాపమెం దుకని ప్రశ్న. దానికి సమాధనం లేదు. బాబా పరిస్థితిలో మార్పు లేదని మరో ప్రకటన. బాబా ఆరోగ్యం కోసం భక్తులు ప్రార్ధనలు చేయాలని ప్రధాన డాక్టర్ హితవు. అంటే డాక్టర్లు ఇక చేతులెత్తేసినట్లేనా అని భక్తుల సందేహం. బాబా కాళ్లు కదుల్తున్నాయని ఒక వార్త. ఇలా రకరకాల వర్తమానాలు.
ఏదో తెలీని గోప్యం. సమన్వయ లోపం. ఒ బులెటిన్‌కి, మరో బులెటిన్‌కి బోలెడు వ్యత్యాసం. అంతే కాదు ఒకే బులెటిన్‌లోనే భిన్న స్వరాలు. బాబా కోలుకుం టున్నారని అంటూనే అంతలోనే ఆ వాక్యం తర్వాత..బాబా పరిస్థితి నిన్నటిలానే ఉందని మరో వాక్యం. ఇలాంటి పొంతన లేని ప్రకటనలతో భక్తులు తీవ్ర మానసిక వేదన అనుభవించారు. ఈ లోగా గ్రామ దేవత హఠాత్ రంగ ప్రవేశం. బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ఆ మధ్య శిధిలమైన గ్రామ దేవత సత్యమ్మ విగ్రహాన్ని ఊరి చెరువులో నిమజ్జనం చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టింపచే శారు.
ఆ అనర్ధ ఫలితమే బాబాకు అనారోగ్యమని ఒక వాదన తెరమీదికొచ్చింది. ఇకనేం..గ్రామస్థులు రాత్రంతా ఆ చెరువులో వెదికారు. తెల్లారేసరికల్లా విగ్రహాన్ని బైటికి తీశారు. దాన్ని ఊరేగించి ఎక్కడ ఉందో అక్కడే దాన్ని ప్రతిష్టించారు. అదే సమయంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి సానుకూల పవనాలు. చికిత్సకు బాబా స్పందిస్తున్నారని తొలి సంకేతం. నిన్న భోరున విలపించిన గీతారెడ్డే ఈ తొలి వార్త మోసుకొచ్చారు. బాబాను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య మూత్రపిండాలే. మామూలు డయాలసిస్ పనిచేయడం లేదని సీఆర్‌ఆర్‌టీ డయాలసిస్ మొదలుపెట్టారు. రాత్రంతా అది పని చేసింది. మంగళవారం పగలు కిడ్నీలు స్పందించడం ఆరంభిం చాయి. ఇక వైద్యుల ఆనందానికి అవధుల్లేవు. కిడ్నీలు స్పందిస్తే సమస్యంతా పరిష్కారమైనట్లేనని వారు మొదటే చెప్పారు. ఇప్పుడా సమస్యని అధిగమించారు. జ్వరం తగ్గిపోయింది. గుండె బాగానే కొట్టుకుంటున్నది. రక్తపోటు సాధారణ స్ధాయిలోనే ఉంది. బాబా స్పృహలోనే ఉన్నారు. కళ్లు తెరిచి చూస్తున్నారు.
మాటలు వింటున్నారు. తల ఊపుతున్నారు. వెంటి లేటర్లు పని చేస్తున్నాయి. మరో పది రోజుల దాకా బాబా ఆసుపత్రిలోనే ఉండే అవకాశాలున్నాయి. ఎట్టకేలకు డాక్టర్ సఫాయా నోరు విప్పారు. వైద్యుల మధ్య వైరు ద్యాలేమీ లేవని, సమన్వయంతో వ్యవహరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో బాబా నిక్షేపంగా ఉన్నారని, ఆయనకు ఎటువంటి ఢోకా ఉండదని ఆయన భరోసా ఇస్తున్నారు. తాము చేస్తున్న వైద్యంలో ఎలాంటి గోప్యతా లేదని, తాము ఏదో దాచిపెట్టి తిమ్మిని బమ్మి చేయడం లేదని అంతా పారదర్శకంగానే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బాబాకు ఐసీయూలో చికిత్స జరుగుతున్నదని, ఆ గదిలోకి ఎవ్వరు వెళ్లినా బాబాకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, అందుకే ఎవ్వర్నీ లోనికి అనుమతించలేదని, అంతే తప్ప మరేమీ కారణాలు లేవని ఆయన వెల్లడించారు. బాబా కోలుకుంటున్నారన్న సంకేతాలు రాగానే పుట్టపర్తి యావత్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అప్పటి దాకా పుట్టపర్తి, ఆ చుట్టుపక్కల గ్రామస్థులంతా ఒక్కుమ్మడిగా ట్రస్టు సభ్యుల మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
బాబాకు ఏదన్నా జరిగితే సహించబోమని కూడా హెచ్చరికలు వినిపించాయి. మొత్తం మీద బాబా కోలుకుంటున్నారని తెలియగానే వారంతా శాంతించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం పుట్టపర్తి వెళ్లాల్సి ఉంది. కాని చివరి క్షణాల్లో ఆ ప్రయాణం రద్దయింది. అలాగే చంద్రబాబు ప్రయాణం కూడా. ప్రముఖ నేతలు పుట్టపర్తి వెళితే భక్తులకు తప్పుడు సంకేతాలు అందుతాయని ఒక వాదన ఉంది. అయితే బాబా కోలుకుంటున్నందున ఇప్పటి కిప్పుడు వెళ్లకుండా డాక్టర్ల సేవలకు అంతరాయం కలిగించకుండా ఉండటమే మేలని వారు ప్రయాణం మానుకున్నట్లు తెలిసింది. అదీ కాకుండా ఐసీయూలోకి ఎవ్వర్నీ అనుమతించడం లేదు గాబట్టి వీళ్లు పుట్టపర్తి వెళ్లినా, ఆసుపత్రిలో ఐసీయూలోకి వెళ్లి బాబాను చూసే అవకాశం లేనందున ప్రయాణం విరమించుకున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలోకి ఇన్ని రోజులూ వాహనాలను అనుమతించలేదు. ఇప్పుడా నిబంధనను కాస్తంత సడలించారు. పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు.

బాబాకు భక్తులకు మధ్య..
అడ్డుగోడగా మారిన ట్రస్టు
స్థానికులను దూరంగా ఉంచారు
బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచారు
చక్రవర్తి చెప్పిందే వేదం.. చెప్పు చేతల్లో సేవాదళ్
ఢిల్లీ స్థాయిలో సంబంధాలు.. ప్రముఖులపైనా ఆంక్షలు

"బాబా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అయినా భయపడాల్సిన పనిలేదు. ఆయన ఆరోగ్యంపై దాచాల్సిందేమీ లేదు.''
- ప్రభుత్వం తరఫున రఘువీరా
"బాబా ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. నేను బాబాను చూసినప్పుడు కళ్లు తెరిచారు. కనుసైగలతో మాట్లాడారు. హారతి ఇవ్వాలా? అని అడిగితే ఇవ్వాలంటూ సైగలతోనే బాబా చెప్పారు.''
- విలేకరులతో మంత్రి గీతారెడ్డి
"సత్యసాయి శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగానే పని చేస్తున్నాయి. కిడ్నీలు మాత్రం సహకరించడం లేదు. అందుకు సీఆర్ఆర్‌టీ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. తద్వారా, ఆయన ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.''
- గాంధీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అశోక్
దర్మవరం, ఏప్రిల్ 5 : భగవాన్ సత్య సాయిబాబా ఒకవైపు! కోట్లాది మంది భక్తులు మరో వైపు! మధ్యలో... ట్రస్టు! అదో అడ్డుగోడ. భగవంతుడి నుంచి భక్తులను దూరం చేస్తున్న శక్తి! సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం సత్యసాయి నియమించిన ట్రస్టే ఆయనకూ, బయటి ప్రపంచానికీ మధ్య దూరాన్ని పెంచిందనే వాదన వినిపిస్తోంది. స్థానికులకూ, బాబాకూ మధ్య బంధాన్ని పూర్తిగా తెంచేసిందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి పేరు వింటేనే జనం మండిపడే పరిస్థితి నెలకొంది.
స్థానికులు, ఇతర వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... కోట్లమంది భక్తులు... 180 దేశాలు... 1200కుపైగా విద్యా, వైద్య, భక్తి సంస్థలు... వేలకోట్ల ఆస్తులు! ఇది సత్య సాయిబాబా సువిశాల సామ్రాజ్యం! భక్తి, సేవా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు బాబా 1972లో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీనికి బాబాయే అధ్యక్షుడు. ట్రస్టు కార్యదర్శిగా తమిళనాడుకు చెందిన కె.చక్రవర్తి ఉన్నారు. ఆయన మన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. అనంతపురం కలెక్టర్‌గా వచ్చారు.
1981లో కలెక్టర్‌గిరీకి రాజీనామా చేశారు. సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌కు రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. తర్వాత ట్రస్టు సభ్యుడిగా మారారు. అప్పట్లో తమిళనాడుకే చెందిన చిరంజీవి కార్యదర్శిగా ఉండేవారు. అప్పటి నుంచే పుట్టపర్తిలో, ట్రస్టులో చక్రవర్తి హవా మొదలైంది. స్థానికులకూ, సత్యసాయికీ మధ్య ట్రస్టు అడ్డుగోడలా మారింది. గతంలో సత్యసాయి వస్త్రాలను శుభ్రం చేసే రజకులు నేరుగా బాబా వద్దకు వెళ్లేవారు.
భక్తులను 'ఏం బంగారూ! బాగున్నావా!' అని పలకరించడం బాబా అలవాటు. ఇలా రజకులనూ పరామర్శించేవారు. ట్రస్టు ప్రాబల్యం పెరిగాక... రజకులకు మందిరం (బాబా నివాసం) లోపలికి ప్రవేశం నిషిద్ధంగా మారింది. వస్త్రాలే బయటికి రావడం మొదలైంది. పత్రికల్లో స్థానిక సమస్యలపై వచ్చే వార్తలను చూసి బాబా సత్వరం స్పందించేవారు. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునేవారు. కొన్నాళ్లకు బాబా వద్దకు పత్రికలు వెళ్లడం ఆగిపోయింది.
ఇక... భక్తులకు, భగవాన్ సాయిబాబాకు మధ్య మిగిలిన ఏకైక అనుసంధానకర్త జానకిరామయ్య. ఆయన బాబాకు సోదరుడు. స్థానికంగా ఎలాంటి సమస్య వచ్చినా స్వామి (స్థానికులు సత్యసాయిని స్వామి అని పిలుచుకుంటారు) వద్దకు వెళదాం పదండి! అంటూ స్థానిక ప్రముఖులను మందిరానికి తీసుకెళ్లేవారు. జానకి రామయ్య ఉన్నన్ని రోజులు ట్రస్టులోని మిగిలిన సభ్యులు నియంత్రణలోనే ఉండేవారు.
ఆయన మరణంతో స్థానిక భక్తులకు, బాబాకు మధ్య ఉన్న అనుసంధానం తెగిపోయింది. ప్రశాంతినిలయం వ్యవహారాలు పూర్తిగా ట్రస్టు చేతిలోకి వెళ్లిపోయాయి. తర్వాత జానకిరామయ్య కుమారుడు రత్నాకర్ ట్రస్టులో సభ్యుడిగా చేరినా మునుపటి పరిస్థితులైతే రాలేదు!
ప్రశాంతి నిలయం అంటేనే... ట్రస్టు సామ్రాజ్యం. ఇక్కడ ట్రస్టు చేసిందే శాసనం. చెప్పిందే వేదం. ఎస్పీ, కలెక్టర్‌తోసహా ఎవరైనా సేవాదళ్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. సేవాదళ్ పూర్తిగా ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి కనుసన్నల్లో విధులు నిర్వహిస్తుంది. చక్రవర్తికి ఢిల్లీ స్థాయిలోని అనేక మంది ప్రముఖులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలోని వాళ్లను లెక్క చేయరనే విమర్శ కూడా ఉంది. మంత్రులు, ముఖ్యమంత్రులు సత్యసాయి దర్శనానికి వచ్చినప్పుడు ట్రస్టు సభ్యులే కీలక పాత్ర పోషిస్తారు.
ఇలాంటి వీవీవీఐపీలను సైతం దర్శనం కోసం గంటలకొద్దీ వేచి చూసే పరిస్థితులు కల్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వెరసి... ప్రశాంతి నిలయం వ్యవహారాల్లో ట్రస్టు ఒక 'ప్రబల శక్తి'గా మారింది. ప్రస్తుతం సత్యసాయి సెంట్రల్ ట్రస్టులో రత్నాకర్ మినహా మిగిలిన వాళ్లంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే. అందులోనూ తమిళుల ఆధిపత్యమే ఎక్కువ. వీరి వ్యవహార శైలిపై స్థానికుల్లో ఎన్నాళ్ల నుంచో అసంతృప్తిగా ఉంది.
సత్యసాయి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఈ అసంతృప్తి ఆగ్రహంగా మారింది. బాబా సమీప బంధువులను కూడా ఆస్పత్రిలోకి అనుమతించక పోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై దాగుడు మూతలు ఆడటం, ట్రస్టు తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారిక ప్రకటనలు చేయకపోవడంతో భక్తులు రగిలిపోతున్నారు. దీంతో... పోలీసులు ట్రస్టు సభ్యులకు గన్‌మన్ సౌకర్యం కల్పించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సత్తెమ్మ వచ్చింది.. సత్యసాయి వస్తారు
ఫలించిన భక్తుల అన్వేషణ.. విగ్రహం లభ్యం
పుట్టపర్తిలో పునఃప్రతిష్ట
భక్తాన్వేషణ ఫలించింది. సత్తెమ తల్లి పాలరాతి విగ్రహం లభించింది. పునఃప్రతిష్ఠ కూడా పూర్తయింది. ఇక సత్యసాయి బాబాకు స్వస్థత చేకూరుతుందనే విశ్వాసం మరింత పెరిగింది. పుట్టపర్తి గ్రామ దేవత సత్తెమ్మ తల్లి. ఈ విగ్రహం విరిగిపోవడంతో నాలుగు నెలల కిందట సత్యసాయి సోదరుడి కుమారుడు, సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్ కొత్త విగ్రహ ప్రతిష్ఠాపన చేయించారు. అనంతరం పాత విగ్రహాన్ని బుక్కపట్నం చెరువులో నిమజ్జనం చేశారు.

ఆ తర్వాత ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అటుపైన బాబా అనారోగ్యానికి గురికావడంతో అత్యంత మహిమ కలిగిన సత్తెమ్మ విగ్రహం తొలగించడమే ఈ అరిష్టాలకు కారణమని భక్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. అలాగే సాక్షాత్తూ సత్తెమ్మ తల్లి ఓ మహిళను ఆవహించి ఈ విషయం వెల్లడించిందని గ్రామస్థులు కొందరు చెప్పడంతో సత్యసాయి కుటుంబంలో అరిష్టాలకు దారితీసిన పరిణామాలపై వారం తా చర్చించుకున్నారు.

పరిస్థితులను చక్కదిద్దాలంటే సత్తెమ్మ తల్లి పాత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడమే మార్గమని వారు విశ్వసించారు. దీంతో ఒక్కసారిగా పాత విగ్రహం వెలికితీతకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గజ ఈతగాళ్లను బుక్కపట్నం చెరువులో దింపి, సోమవారం సాయంత్రం నుంచీ విగ్రహాన్వేషణ ప్రారంభించగా మంగళవారం ఉదయం 8:45 గంటలకు వారి ప్రయత్నం ఫలించింది. సత్తెమ్మ తల్లి విగ్రహం లభించింది.
మరికాసేపు వెదికిన తర్వాత విరిగిన చెయ్యి కూడా దొరికింది. దీంతో సాయిభక్తులు ఆనంద తాండవమే చేశారు. విగ్రహానికి అక్కడికక్కడే పూజలు చేశారు. పల్లకీ కట్టారు. బుక్కపట్నం, జానకంపల్లి, కర్ణాటక నాగేపల్లి మీదుగా పుట్టపర్తికి ప్రదర్శనగా తీసుకొచ్చారు. దారి పొడవునా మహిళలు సత్తెమ్మకు హారతులు పట్టారు. కొబ్బరికాయలు కొడుతూ, నిమ్మపండ్లు కోస్తూ, పన్నీరు చల్లుతూ సాగారు.

సాయి భక్తులతోపాటు విదేశీయులు కూడా సత్తెమ్మకు ఘనస్వాగతం పలకడం విశేషం. ఉదయం 11:45గంటల సమయంలో పుట్టపర్తిలో సత్తెమ్మ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. సాయిబాబా ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయన తిరిగి దర్శనం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ గుడిలో పూజలు చేశారు. అనంతరం 'సత్తెమ్మ వచ్చింది... సత్యసాయి మళ్లీ దర్శనమిస్తారు' అని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.

పుట్టపర్తి: సత్యసాయి బాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సిమ్స్‌కు వాస్తు దోషం ఉండటం వల్లే బాబా త్వరితగతిన కోలుకోలేక పోతున్నారని వాస్తు నిపుణుడు, పరిశ్రమల శాఖ డిప్యూటీ డెరైక్టర్ మదన్‌మోహన్‌శెట్టి పేర్కొన్నారు. లక్షలాది మంది రోగులకు ఉచిత సేవలు అందజేస్తున్న ఈ ఆస్పత్రిపై గతంలో కూడా అపవాదులు రావటానికి కారణం వాస్తు ప్రభావమేనని ఆయన చెప్తున్నారు. ఉత్తర ముఖద్వారం కలిగిన ఆస్పత్రి ప్రాంగణం ఈశాన్య భాగం కోతకు గురైందని, అదే రీతిలో తూర్పు ఆగ్నేయం పెరిగిందని పేర్కొన్నారు. లక్షలాది మంది రోగులకు ప్రాణదాతగా భక్తులు భావిస్తున్న సత్యసాయికి కిడ్నీ సమస్య ఎదురు కావటం వాస్తు ప్రభావమేనని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికైనా సత్యసాయిని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలిస్తే ఆరోగ్యం తక్షణం మెరుగవుతుందన్నారు. అమోమయం
![]() బాబాకు చికిత్సపై సిమ్స్, ట్రస్టు వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని భక్తుల ఆందోళన సత్యసాయి పరిస్థితి పొద్దున బాగుందని, సాయంత్రం బాగోలేదని, రాత్రికి మళ్లీ బాగుందని.. గందరగోళంగా ఎందుకు చెప్తున్నారు? వీడియో మెడికల్ బులెటిన్‌లో చికిత్స చేస్తున్న దృశ్యాలేవి? పుట్టపర్తిలో భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు ఎందుకు? హిల్‌వ్యూ స్టేడియంలో బారికేడ్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్లు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ట్రస్ట్‌ల తీరును నిలదీస్తున్న సాయి భక్తులు బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని మూడు బులెటిన్లలో సిమ్స్ ప్రకటన వీడియో సీడీలో చికిత్స వివరాలను వెల్లడించిన సిమ్స్ డెరైక్టర్ సఫాయా సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష ప్రభుత్వం తరఫున సమన్వయం కోసం పుట్టపర్తికి ఇద్దరు ఐఏఎస్‌లు కిరణ్, చంద్రబాబు, జగన్ పుట్టపర్తి ప్రయాణాలు రద్దు పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్య స్థితిగతులపై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, సత్యసాయి ట్రస్టు వర్గాలు వెల్లడిస్తున్న అంశాలు బాబా భక్తుల్లో అయోమయం రేకిత్తిస్తున్నాయి. బాబా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు విడుదల చేస్తున్న మెడికల్ బులెటిన్లలో ఒకదానికి మరొకదానికి పొంతన లేకపోవటం బాబా భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. సోమ, మంగళవారాల్లో అటు ఆస్పత్రి వర్గాలు ఇటు ట్రస్టు వర్గాలు వ్యవహరిస్తున్న తీరుపై బాబా భక్తులు మండిపడుతున్నారు. సత్యసాయి ఆరోగ్యం పట్ల ఆస్పత్రి, ట్రస్టు వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధి (హార్ట్ డౌన్‌ఫాలింగ్)తో సత్యసాయిబాబాను మార్చి 28న సత్యసాయి ట్రస్టు వర్గాలు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం విదితమే. తొమ్మిది రోజులుగా ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ సఫాయా నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులుగా బాబా ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు మెడికల్ బులిటెన్లలో వెల్లడిస్తున్న పరస్పర విరుద్ధమైన అంశాల పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో అందజేస్తున్న వైద్యంపై నిజాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమిటీ గందరగోళం? ![]() ఆత్మార్పణ చేసుకుంటా... ![]() ![]() పుట్టపర్తిలో సత్యసాయి జన్మదినోత్సవాల సమయంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించటం సాధారణం. కానీ.. సోమవారం సాయంత్రం నుంచే పుట్టపర్తికి భారీ ఎత్తున పోలీసు బలగాలను తరలించి మోహరించారు. ప్రస్తుతం పుట్టపర్తిలో డీఐజీ చారుసిన్హా, ఎస్‌పీ షహనావాజ్ ఖాసీం, ఒక ఏఎస్‌పీ, పది మంది డీఎస్‌పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, వెయ్యి మందికిపైగా పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించటం వెనుక ఆంతర్యమేమిటని సాయి భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఏ భక్తుడిని కదిపినా ఒకటే ప్రశ్నలు.. ఒకటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుట్టపర్తి దిగ్బంధం! |
కొవ్వొత్తుల ప్రదర్శన సత్యసాయి పూర్తిగా కోలుకుని భక్తులకు దర్శనమివ్వాలని ఆకాంక్షిస్తూ మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో భక్తులు కొవ్వొత్తులు చేబూని ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణంలో ఆంజనేయస్వామి గుడి నుంచి గణేశ్ గేటుదాకా సాగిన ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా బాబా చిత్రపటంతో భక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపు నిర్వహించారు. వేణుగోపాలస్వామి, శివాలయంతోపాటు మండలంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ గుడిలో రుత్విక్కులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. |
No comments:
Post a Comment