బాబా.. భక్తకోటికి ఇంటి వెలుగు, కంటి దైవం. ఇప్పుడాయన మంచం పట్టారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు. ఏకంగా 20 రోజుల నుంచి. లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. డాక్టర్లు అంతా బాగానే ఉదంటున్నా.. ఇంకా విషమమేనంటూ చేస్తున్న ప్రకటనలు ఆయన భక్తులకు కంటిమీద కునుకు కరవు చేస్తోంది. బాబాను కనీసం చూపించవచ్చు కదా? అన్నది వారి వాదన. కుదరదన్నది డాక్టర్ల మొండి జవాబు. ఎందుకింత రహస్యం? పక్షం రోజుల్లో బాబాను మందిరానికి చేరుస్తామని అంతకుమునుపు డాక్టర్లు చేసిన ప్రకటన ఉత్తిదేనా? బాబా ఆరోగ్యంపై నిఖిల ప్రపంచ ఆందోళనకు డాక్టర్లు ఎందుకు సానుకూలంగా స్పందించడం లేదు? బాబా ఆరోగ్యం బయటపెట్టలేనంత విషమంగా ఉందా? ఇక బాబా దర్శనం భక్తులకు శాశ్వతంగా లభించనట్లేనా? అంటే.. దశాబ్దాల నుంచి సేవించు-ప్రేమించమని సందేశమిచ్చిన భగవాన్ పుట్ట పర్తి సాయిబాబా ఇక సజీవ సమాధికి వెళ్లినట్లేనా?... డాక్టర్ల మౌనం- సెంట్రల్ ట్రస్టు గుంభనం తీరే ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. అసలు బాబాకు ‘బయటకు ప్రకటించలేని ప్రమాదం’ జరిగిపోయిందని, డాక్టర్ల హడావిడి భక్తుల కళ్లనీళ్లు తుడిచేందుకేనన్న అనుమానాలు సైతం జనిస్తున్నాయి. అవన్నీ పుకార్లేనని నిరూపించుకునే బాధ్యత వైద్యులు, వారిని నియంత్రిస్తోన్న ట్రస్టుదే!
ఏం జరుగుతోంది?
మన్మోహన్ ఆరా
నివేదిక ఇవ్వాలని ఆర్థిక, హోం శాఖలకు ఆదేశం
రాష్ట్రానికీ నిర్దేశం.. ప్రధానికి భగవతి నివేదిక!?
సత్యసాయి ట్రస్టులో ఆర్థిక లావాదేవీలు, వేల కోట్ల ఆస్తులు, నిధులు స్వాహా అయ్యాయన్న ఆరోపణలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ విషయంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రస్టు సభ్యుడిగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భగవతి ఇప్పటికే ప్రధానమంత్రికి ఒక నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక, హోం శాఖలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రధాని నివేదిక కోరారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కాగా, బాబాకు పరమ భక్తుడు, పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ కూడా ప్రశాంతి నిలయం వ్యవహారాలపై తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు తెలిసింది. ట్రస్టులో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే సజీవంగా ఉండగానే బాబా అప్రతిష్ఠ పాలవుతారని ఢిల్లీలో కీలక స్థానాల్లో ఉన్న బాబా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బంగారం పాయె!
రెండు ట్రక్కుల్లో.. అట్టె పెట్టెల్లో.. ఆభరణాలు, పసిడి
పుట్టపర్తి నుంచి బెంగళూరుకు తరలింపు
దేహనహళ్లి వద్ద పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
సత్యసాయి ట్రస్టువని వదిలేసిన వైనం
చేతులు కాలాక పోలీసుల హడావుడి
ఐటీ కోర్ బిల్డింగ్, యజుర్మలాందిరాలపై డేగకన్ను

ఆశ్రమం నుంచి విలువైన వస్తువులు బయటకుపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. బాబా అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని చేతివాటం ప్రదర్శించాలనుకునే వారికి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటాం. అక్కడి నుంచి ట్రస్టు అనుమతి లేకుండా పూచిక పుల్ల కూడా బయటకు వెళ్లడానికి వీల్లేకుండా పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశాం.
-ఇది డీజీపీ అరవిందరావు 15వ తేదీన చేసిన ప్రకటన.
ప్రశాంతి నిలయం ఓ బంగారు కొండ. బాబాకు నగదు రూపంలో వచ్చిన కానుకల కంటే బంగారం రూపంలో అందిన విరాళాలే అధికమని చెబుతారు. వజ్ర వైఢూర్యాలూ లెక్కలేనన్ని ఉన్నట్టు సమాచారం. సుమారు 10 టన్నుల బంగారాన్ని బాబా సేదదీరే మందిరంలో భద్రపరిచినట్టు తెలుస్తోంది. సూత్ర ధారుల దృష్టి ఈ బంగారంపైనే కేంద్రీకృతమైంది.
-ఇది 17వ తేదీన ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం.
సత్యసాయి బాబా నివాసమైన యజుర్మందిరాన్ని, ప్రశాంతి నిలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ భవనాల్లోకి రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. లోపలికి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు వారు ఏమైనా తెస్తున్నారా అని తనిఖీలు చేస్తున్నారు. పూచికపుల్ల కూడా బయటికి పోవడానికి వీల్లేదని కట్టడి చేశారు.
-ఇది మంగళవారం పుట్టపర్తిలో పరిస్థితి.
అయితే పూచిక పుల్లేమిటి? పుత్తడే పోయింది. అది కూడా కాస్తా కూస్తా కాదు... రెండు ట్రక్కుల్లో బంగారం. పోలీసుల హడావుడి మొదలు కావడానికి ముందే, నాలుగైదు రోజుల క్రితమే, సత్యసాయి భవన్ సముదాయాల నుంచి బంగారాన్ని, విలువైన ఆభరణాలను చిన్న చిన్న అట్ట పెట్టెల్లో పెట్టి రెండు ట్రక్కుల్లో బెంగళూరు తరలించేశారు. కస్టమ్స్ అధికారులు వీటిని పట్టుకున్నా అవి సత్యసాయి ట్రస్టువనే కారణంతోనూ, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతోనూ వదిలేశారని సమాచారం. హత విధీ!
సత్యసాయి బాబా ఆస్పత్రి పాలైనది మొదలు, ట్రస్టులో జరుగుతున్న గోల్‌మాల్ వ్యవహారాలపై 'ఆంధ్రజ్యోతి' పుంఖానుపుంఖాలుగా కథనాలు రాస్తున్నా, ఎవరికి వారు 'మాకు సంబంధం లేదం'టూ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. కానీ జరగాల్సిన అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి. సత్యసాయి భవన్ సముదాయాల నుంచి బంగారం, అత్యంత విలువైన ఆభరణాలను, సమాచారాన్ని బెంగళూరుకు తరలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రశాంతి నిలయంలోని విలువైన ఆభరణాలను, బంగారాన్ని అట్టపెట్టెల్లో పెట్టి, 4 రోజుల క్రితం 2 ట్రక్కుల్లో బెంగళూరుకు పంపించినట్టు తెలిసింది. కంప్యూటర్లు కూడా ఈ ట్రక్కుల్లో ఉన్నట్టు సమాచారం. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నలుగురు సాధారణ తనిఖీల్లో భాగంగా బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి వద్ద వీటిని ఆపి వాటిలోని అట్ట పెట్టెలను సోదా చేశారు. అందులో బంగారం, ఆభరణాలు ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది.
తాము పుట్టపర్తి నుంచి వస్తున్నామని, ట్రక్కులోని సామగ్రికి పూర్తి అనుమతులు ఉన్నాయని వాహనదారులు పేర్కొన్నట్టు తెలిసింది. తమ వాదనకు మద్దతుగా, ట్రస్టు సభ్యుల అనుమతితోనే వీటిని బెంగళూరుకు తరలిస్తున్నట్టు రికార్డులూ వారు చూపించినట్టు తెలిసింది. ఒకవైపు ఈ సోదాలు సాగుతుండగానే, కర్ణాటక ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో అధికారులు ఆ ట్రక్కులను వదిలేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని ఆభరణాలను, బంగారాన్ని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఆశ్రమానికి తీసుకు వెళుతున్నట్టు కూడా వాహనదారులు చెప్పినట్టు సమాచారం.
చిన్న చిన్న బాక్సుల్లో విలువైన ఆభరణాలను రెండు ట్రక్కుల్లో తరలించిన మాట వాస్తవమేనని, రికార్డులు సక్రమంగా ఉండడంతో వాటిని వదిలేశామని సంబంధిత వర్గాలు అంగీకరించాయి. పుట్టపర్తిలోని రెవెన్యూ అధికారులు కూడా సామగ్రి తరలిపోతున్న సంగతిని అనధికారికంగా అంగీకరిస్తున్నారు. అయితే ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదని, అందువల్ల అధికారికంగా తామే మీ చెప్పలేమనీ, తమను ఇరికించవద్దని వారు కోరారు. పుట్టపర్తి వ్యవహారాల గురించి స్థానిక అధికారులెవరిని కదిలించినా నేరుగా, అధికారికంగా మాట్లాడడానికి జంకుతుండడం గమనార్హం.
ఆభరణాల తరలింపు గురించి అనంతపురం ఎస్పీ షానవాజ్‌ను 'ఆన్‌లైన్' ప్రశ్నించగా, "పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి, సత్యసాయి ట్రస్టు అనుమతి, వే బిల్లులతో వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేసే ఆనవాయితీ లేదు. ఇప్పుడు ఆరోపణలు వచ్చాయంటున్నారు కనుక ఇకమీదట వచ్చే వాహనాలను తనిఖీ చేశాకే పంపిస్తాం'' అని పేర్కొన్నారు. 'అన్నీ సత్యసాయి అనుమతితోనే' జరుగుతాయని సోమవారం ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే!
మరి, గతనెల 28వ తేదీ నుంచి సత్యసాయి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉండగా... ఎవరి అనుమతితో ఇంత సంపదను పుట్టపర్తి నుంచి తరలించారు? ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు... ఆ నిర్ణయం తీసుకున్నదెవరు? ఈ ప్రశ్నలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాలి! సత్యసాయి మందిరాల్లో నిల్వ ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలు గల్లంతవుతున్నాయని, ఐటీ కోర్ బిల్డింగ్ నుంచి ఆన్‌లైన్‌లో నగదు తరలింపు జోరుగా సాగుతోందని ఆంధ్రజ్యోతి ఇదివరకే బట్టబయలు చేసింది.
మొదట్లో దీనిని తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం...కర్ణాటక దేవనహళ్లి వద్ద రెండు ట్రక్కుల ఆభరణాలు తనిఖీల్లో బయటపడ్డాయని, ట్రస్టు పెద్దలు వీటిని తరలించారని తెలిసిన తర్వాత అప్రమత్తమైంది. మంగళవారంనాడు పుట్టపర్తిలో పోలీసుల హడావుడి ఎక్కువైంది. ఐటీ కోర్ బిల్డింగ్‌తోపాటు బాబా నివాసమైన యజుర్మందిరాన్ని, ప్రశాంతి నిలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇప్పటివరకూ ఈ భవనాలన్నీ సత్యసాయి సేవాదళ్ రక్షణలో ఉండేవి. పోలీసులు ఎక్కడో దూరంగా, ఉత్సవ విగ్రహాల్లా ఉండేవారు.
కానీ మంగళవారం పరిస్థితి రివర్స్ అయింది. ఈ భవనాల్లోకి రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. లోపలికి వెళ్లే సిబ్బందిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు ఏమైనా తెస్తున్నారా? అని తనిఖీ చేస్తున్నారు. అయితే ఒక రోజు ముందే రెండు ట్రక్కుల బంగారం 'పోయిందని' తెలిసి ఇక్కడున్న పోలీసులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. బాబా ఆస్తి ట్రస్టు పరిధిలోకి వస్తుంది. దాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. కానీ ట్రస్టు సర్వాధికారి అయిన బాబా అచేతన స్థితిలో ఆసుపత్రిలో ఉండగా, ఎవరికీ తెలియకుండా బయటకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న!
బాబాకు భక్తులు సమర్పించిన విలువైన ఆభరణాలు చాలావరకు రికార్డులకు ఎక్కలేదు. కొన్ని డాక్యుమెంట్లను ఇప్పుడు నమోదు చేస్తున్న విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది. చెక్కులు, డీడీలు, ఇతర ఆస్తుల పత్రాలను మాత్రం రికార్డులకు ఎక్కిస్తూ, లెక్కల్లో లేని వందల కోట్ల విలువైన ఆభరణాలను ముందుగానే తరలించారని అర్థమవుతోంది. దేవనహళ్లిలో పట్టుకున్న ఆభరణాలను 'రికార్డులన్నీ' ఉన్నందున వదిలేసినట్లు చెబుతున్నారు. అయితే ఉన్నవి కేవలం వే బిల్లులు మాత్రమే.
భక్తులిచ్చిన ఈ ఆభరణాలన్నీ అసలు సత్యసాయి ట్రస్టులో రికార్డులకు ఎక్కాయా? బెంగళూరు తరలించిన ఆ ఆభరణాలు ట్రస్టుకు కాకుండా 'చేరాల్సిన' చోటికి చేరిపోయాయా? అనేవి ప్రశ్నార్థకాలు. సత్యసాయి ఆరోగ్యం దిగజారడంపై సహేతుకమైన అనుమానాలున్నాయి, వాటికి ఆధారాలూ ఉన్నాయి. ట్రస్టులో అక్రమాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వం ముందుగానే పటిష్ఠ చర్యలు చేపట్టాలి. పుట్టపర్తి నుంచి ఆస్తులేవీ తరలిపోకుండా పోలీసు స్టేషన్లను, చెక్ పోస్టులను, పొరుగు రాష్ట్రాలను అప్రమత్తం చేయాల్సింది.
కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తన కేం పట్టిందన్నట్టు వ్యవహరిస్తుండడం వెనుక 'ఏ స్థాయి' ఒత్తిళ్లు పనిచేస్తున్నాయో? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం సత్యసాయి ట్రస్టు వ్యవహరాలపై దృష్టి సారించింది. అసలు ట్రస్టులో ఏం జరుగుతోంది? ట్రస్టు ఆస్తుల వివరాలేమిటి? బాబా పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై ట్రస్టు సభ్యులతో కేంద్ర పెద్దలు మాట్లాడినట్లు సమాచారం.

సత్య సాయిబాబా ఆరోగ్యం మరింతగా క్షీణించింది. కాలే యంలో తీవ్ర సమస్యలు... మరోవైపు ఎంతమాత్రం తగ్గుముఖం పట్టని కామె ర్లు ఆయన ఆరోగ్యం పట్ల అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా వుంటే... మంగళవారం ప్రత్యేక పోలీసు బలగాలను పుట్టపర్తిలో మోహరించడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ భక్తులను ఉక్కిరిబిక్కిర చేస్తున్నది. జిల్లా ఎస్పీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా మని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆందోళనలను ఎప్పటికి కుదుటపడుతుంది? ఇది దేశవిదేశాల్లోని లక్షలాది భక్తుల సూటి ప్రశ్న. సాయి సెంట్రల్ ట్రస్ట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వర్గాల గుంభన వ్యవహార శైలితో విసిగి వేసారిన భక్త జన కోటి ఇకెంత మాత్రం ఓపిక పట్టే వాతావరణం కనిపించడం లేదు.
తాజాగా బుధవారం ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ కూడా మొక్కుబడిగానే ఉంది. బాబా పరిస్థితి నిలకడగానే ఉంది...అయినా ఇంకా ఆందోళనకరమే నంటూ వెలు వరించిన ఆ బులెటిన్ తాజాగా చెబుతున్న దేమిటో డాక్టర్లకే అర్ధం కావాలని భక్తులు అంటు న్నారు. అంతేకాదు అత్యుత్తమ డాక్టర్లతో మేలిరకం చికిత్స అందిస్తున్నా మంటూ డాక్టర్ రమేష్ పేరు మీద విడుదలైన ప్రకటనలోని ఆంతర్యాన్ని భక్తులు ప్రశ్నిస్తు న్నారు. ఇదొక రకంగా సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు ఉం దన్న భావన భక్తుల్లో నెలకొంటున్నది. అంటే జరగ రానిదేదో జరుగుతుండటంతో ఏమీ పాలుపోని స్థితిలో ఆసుపత్రి వర్గాలు తమ లోటుపాట్లను కప్పి పుచ్చుకునే పనిలోనే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
కీలక అవయవాలన్నీ తమ చికిత్సలకు మందకొడిగా స్పందిస్తున్నాయని వారే చెబుతున్నారు. అంటే ఇన్ని వారాలుగా వారు చేస్తున్న చికిత్స వల్ల ఒనగూడిన ప్రయోజనం ఎంతంటే చెప్పుకోలేని దుస్థితిలో డాక్టర్లు ఉన్నట్లు బోధపడుతోంది. బాబాకు తామందిస్తున్న చికిత్స విజయవంతమవుతుందనే ఆశాభావంతోనే ఉన్నా మని చెప్పడం ద్వారా బాబా తన దయ వల్ల తానే బతకాలి తప్ప డాక్టర్ల సేవల వల్ల కాదని చేతులెత్తే స్తున్నారన్న భావనలో భక్తులున్నారు. ఎంత చెప్పినా, ఎన్ని సార్లు బులెటిన్లు విడుదల చేసినా ఇంతకు మించి వేరే సమాచారం రావడం లేదు. బాబా కదులుతున్నారా? ఎవ్వరి సాయం లేకుండా అటు ఇటు మెసులుతున్నారా? బాబాలో కదలికలున్నా యా? కళ్లు తెరిచే స్థితి ఉందా? ఇలాంటి సమాచార మేదీ ఆ బులెటిన్లలో లేకుండా ఆసుపత్రి వర్గాలు ఎందుకు జాగ్రత్త పడుతున్నాయి? ఇదే సాయి భక్త కోటిని కలవరపరుస్తున్న ప్రశ్న.

సాయి ఆరోగ్యం ఇంకా విషమమే !
వదంతులు నమ్మొద్దు
వైద్యశాఖ ముఖ్య కార్యదశ్శి రమేశ్
పుట్టపర్తి సత్యసాయిబాబా 'క్లినికల్లీ డెడ్' అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని.. అయితే పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇరవై రోజులకు పైగా ఐసీయులో ఉన్న పేషెంట్ బతికే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని ప్రశ్నించగా- పేషెంట్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆయన మనోధైర్యం, శరీరంలోని వివిధ భాగాలకు వైద్యం చేస్తున్న వైద్యుల్లో సమన్వయం, అత్యుత్తమ వైద్య సదుపాయాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. వీటిలో బాబా వయస్సు (85) తప్ప మిగతావన్నీ అనుకూలంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.
ప్రతి రోజూ తాను బాబా ఆరోగ్యాన్ని మూడు, నాలుగు సార్లు సమీక్షిస్తున్నట్లు రమేష్ చెప్పారు. సాయి శరీరంలోని అన్ని భాగాలూ పనిచేస్తున్నాయని, అయితే అవన్నీ చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాయన్నారు. అందుకే అన్ని భాగాలకూ పరికరాలను అమర్చాల్సి వచ్చిందన్నారు. గతంలో ఆయనకు ఏం వైద్యం చేశారనేది తాము చెప్పలేమని, తమ దగ్గరకు వచ్చినప్పటి నుంచీ అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
వైద్యుల మధ్య సమన్వయం తీసుకువచ్చి, అవసరమైన వారిని వెంటనే పిలిపించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బాబా ఆరోగ్యంలో మార్పు లేకున్నా, కామెర్ల నుంచి మాత్రం కోలుకున్నారని చెప్పారు. బాబా ఆరోగ్యం సంక్లిష్టంగా ఉన్నందున ఆయన్ని వేరే నగరానికి మార్చటం సాధ్యం కాదని, ప్రత్యేక జెట్ విమానం ఏర్పాటు చేసినా ఆయన్ను కదపటం క్షేమం కాదని అన్నారు. కాగా, వైద్య పరికరాలతో ఉన్నందునే బాబా వీడియో క్లిప్పింగ్‌లను విడుదల చేయటం లేదని, ఎవరినైనా ఆ పరిస్థితిలో చూడాలని ఎవరూ కోరుకోరని ఆయన అన్నారు.
వెంటిలేటర్‌పైనే సాయి: సఫాయా
పుట్టపర్తిరూరల్ : సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. ఆయన వెంటిలేటర్ సాయంతోనే శ్వాస తీసుకుంటున్నారని డాక్టర్ సఫాయా తెలియజేశారు. బాబా ఆరోగ్య పరిస్థితిపై తాజా బులిటెన్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. బాబా అవయవాలు సాధారణ స్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. ఆయనకు డయాలసిస్‌లో సీఆర్ఆర్‌టీ పద్ధతిని కొనసాగిస్తున్నామన్నారు.

భౌతిక దేహం ముఖ్యం కాదు
భగవతి, ఇందూలాల్ షా ప్రకటన
సత్యసాయి బాబా ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి జస్టిస్ పి.ఎన్. భగవతి, ఇందూలాల్ హెచ్ షాలు సాయిబాబాఆఫ్ఇండియా అనే వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనను ఉంచారు. వీరిద్దరి సంతకాలతో ఉన్న ప్రకటనలో భగవాన్ అతి త్వరలోనే కోలుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సత్యసాయి ట్రస్ట్‌లో సభ్యులయిన భగవతి, ఇందులాల్‌షాలు వ్యక్తిగతంగా ఈ ప్రకటన చేయటం విశేషం.. ఆ ప్రకటన యథాతథంగా..
"భగవాన్ భౌతిక దేహ ఆరోగ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం కూడా సులభంగానే అర్థం చేసుకోవచ్చు. భగవాన్ భౌతిక దేహం భక్తులందరికి అపరిమితమైన ఆనందాన్ని , అనిర్వచనీయమైన సంతోషాన్ని కలగజేస్తుంది. భగవాన్‌ను భౌతికంగా చూడాలని భక్తులు ఎల్లప్పుడు కోరుకుంటూనే ఉంటారు. భౌతికంగా తన కదలికలపై పరిమితులు విధించుకోవాలని భగవాన్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయులను చేస్తోంది. గతంలో భక్తుల భౌతిక ఇబ్బందులను భగవాన్ స్వీకరించారు.
అప్పుడు కూడా భక్తులు ఆందోళన చెందారు. అయితే కొద్ది రోజుల ప్రార్థనల తర్వాత ఆ ఆందోళన తొలగిపోయింది. ఈ సారి గతానుభవాలను మించి ఎక్కువ సమయం భగవాన్ భౌతిక దేహం ఈ ఇబ్బందులకు గురి అవుతోంది. భగవాన్ అవతారంలో ఈ అంకంలో దాగి ఉన్న నిగూఢమైన ప్రాముఖ్యాన్ని మనందరం అర్థం చేసుకోవాల్సి ఉంది. భౌతికపరమైన పరిమితులకు లోనైన తర్వాత కూడా భగవాన్ ప్రేమను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది భక్తులు వేర్వేరు రూపాలలో పొందుతూనే ఉన్నారు.
భగవాన్ కేవలం తన భౌతికరూపానికే పరిమితమయి లేరని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల అనుభవాలు మనకు చెప్పకనే చెబుతున్నాయి. భగవాన్ దైవత్వం కాల, సమయ, ప్రపంచ పరిమితులను దాటి ప్రసరిస్తూనే ఉంటుంది. మనం ఏ ప్రపంచంలో ఉన్నా ఆయన సాన్నిహిత్యాన్ని మనం పొందుతూనే ఉండచ్చు. భగవాన్ భక్తులుగా మనం సాయి సంస్థల కార్యక్రమాలను ప్రచారం చేయటానికి, ఆధ్యాత్మిక సాధనను చేయటానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. అన్నింటా ఉన్న భగవాన్ రూపాలను గ్రహించి వాటి ద్వారా మార్గదర్శకత్వం పొందటం మనందరి బాధ్యత.
భగవాన్ రూపాలను గ్రహించటం వల్ల మన ఆధ్మాత్మిక సాధనకు, సేవా కార్యక్రమాలను మరొక అవకాశం చిక్కుతుంది. భగవాన్ భౌతిక దేహానికి ఎటువంటి నొప్పి గానీ, బాధ గానీ లేదని.. పరిపూర్ణమైన ఆనందస్థితిలో ఉన్నారని తెలిసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. భక్తుల ప్రార్థనలకు సమాధానంగా భగవాన్ తన భౌతికదేహంపై విధించుకున్న పరిమితులను తొలగించుకుంటారనే ప్రగాఢమైన ఆశ మాకు ఉంది. భగవాన్ మళ్లీ తిరిగి మామూలు స్థితికి వచ్చినప్పుడు కలిగే ఆనందం వల్ల ఆయన ప్రారంభించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరొక్కసారి పునరంకితమవుతాం.
భగవాన్ భక్తులుగా, సాయి సంస్థల కార్యకర్తలుగా- ఈ దశలో మమ్మల్ని ముందుకు నడిపించాలని భగవాన్ పాదపద్మాలకు మా ప్రార్థనలు అర్పిస్తున్నాం. భౌతిక దేహానికి వయస్సు రావచ్చు. కానీ ఆత్మ, పరమాత్మల కలయిక నిత్యయవ్వనం. భౌతికదేహాన్ని విడిచివెళ్లే సమయం ఆసన్నం కావచ్చు. కానీ భగవాన్ ఆధ్మాత్మిక భావన అన్ని కాలాల్లోను వెలుగొందుతూనే ఉంటుంది.
'నా జీవితమే-నేనిచ్చే సందేశం'' అని భగవాన్ చెబుతూ ఉంటారు. భగవాన్ భౌతికదేహంలో ఉన్న సమయంలో మేము కూడా నివసించి ఉండటం గొప్ప గౌరవం.
భగవాన్ సందేశానికి, ప్రేమకు మనమందరం ప్రతిరూపాలుగా మారాల్సిన సమయం ఆసన్నమయింది. భగవాన్ పట్ల సాయి సంస్థల సభ్యులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాలి. మన దైనందిక జీవనంలో చేసే చర్యల ద్వారా వాటిని ప్రతిబింబించాలి. దీనిని మిగిలినవారు ఉదాహరణగా తీసుకొని భగవాన్ సాన్నిహిత్యాన్ని పొందగలుగుతారు. ''
-జస్టిస్ పి.ఎన్. భగవతి, ఇందూలాల్ హెచ్ షా

సేవాదళ్ కార్యకర్తలెక్కడ?
బాబా ఆరోగ్యం గురించి ఎవ్వరు ప్రశ్నించినా నోరు మెదపవద్దని ట్రస్ట్ సభ్యుల నుంచి ఖచ్చితమైన ఆదేశాలున్నట్లు ప్రశాంతి నిలయం వర్గాల ద్వారా తెలుస్తోంది. బాబాకు వేలాది మంది సాయి సేవా దళ్ కార్యకర్తలున్నారు. వారంతా నిస్వార్ధంగా సేవల్లో పాల్గొంటుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సేవా దళ్ కార్యకర్తలున్నారు. అంతే కాదు. కర్ణాటక, తమిళనాడు, మహరాష్టల్ర, కేరళ తదితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి బాబా ఆశ్ర మంలో సేవలు అందించి వెళుతుంటారు. వారు సైతం నోరు మెదపడం లేదు. నిజానికి వారు ప్రశాం తి నిలయం ఉద్యోగులు కాదు. వేతనం ఉండదు.
కాని వారి సేవలు మాత్రం అపారం. ప్రశాంతి నిల యం ప్రధాన గేటు దగ్గర, లోపల వివిధ ప్రదేశాల్లో, ఆసుపత్రి దగ్గర వారే కనిపిస్తారు. కేవలం రక్షణ విధులకే వారు పరిమితం. ఆశ్రమానికి, అందులోని ఆస్తులకు రక్షణ, సేవలే వారి ఏకైక విధి. ప్రశాంతి నిలయంలోని మ్యూజియం, హిల్ వ్యూ స్టేడియం, నక్షత్రశాల, మ్యూజిక్ కాలేజిలకు వీరే సెక్యూరిటీ గార్డులు. పుట్టపర్తి టౌన్‌లో ఉండే జనరల్ ఆసు పత్రిలోనూ వీరే కనిపిస్తారు. పుట్టపర్తికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసు పత్రిలోనూ వారే విధులు నిర్వర్తిస్తారు. ఆ ఆసుపత్రి కాకుండా లోపల జనరల్ ఆసుపత్రి ఉంటుంది. ఎయిర్‌పోర్టులోనూ వీరి సేవలే ప్రధానం. ఇంకా పుట్టపర్తిలో అనేక కాలేజీలు, పాఠశాలలు ఉన్నాయి. ఎల్‌కేజీ నుంచి ఎంబీయే దాకా చదువులున్నాయి.
ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే లేవు. ఆయా కాలేజీలన్నింటికీ సేవాదళ్ కార్యకర్తలే ప్రధాన సేవా పోషకులు. ఇంకా ప్రశాంతి నిలయం లోపల జన రల్ స్టోర్స్ ఉంది. దానికి బయట కాపలా ఈ సేవా దళ్ కార్యకర్తలే. ఇంటికి కావాల్సిన సరకులన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. బయటివారొచ్చి ఇక్కడ సరకులు కొనుక్కువెళుతుంటారు. ఎలాంటి పన్ను లు లేకుండా చౌకధరలకు దొరుకుతాయి. బయట కాపలా మాత్రం సేవాదళ్ కార్యకర్తలే. లోపల సేల్స్ కౌంటర్లలో ప్రశాంతి నిలయం ఉద్యోగులుంటారు. వారికి మాత్రం జీతాలుంటాయి. వీరి నియామకా నికి పెద్దగా అర్హతలేమీ ఉండవు. బాబాకు నిస్వా ర్ధంగా సేవ చేయాలనుకునేవారు ట్రస్ట్ అనుమతితో కొద్ది రోజులు అక్కడ పని చేయాలి. ట్రస్ట్‌కు నమ్మకం కుదిరితే వారి అడ్రసులు తీసుకుంటారు.
వారికి గుర్తింపు కార్డులిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎన్ని రోజులు పని చేయాలో తర్వాత వారికి ఫోన్ ద్వారా కబురు చేస్తారు. వారొచ్చి వారికి నిర్వేశించిన స్ధలంలో నిర్దేశించినన్ని రోజులు ఉచితంగా పని చేసి వెళ్లిపోతారు. వారికి అంతకు మించి ఎటువంటి లింకులు ఉండవు. ఆ కార్యకర్తలు నోరు విప్పరు. వారికి అసలు ఏమీ తెలీదు కూడా. ఈ కార్య కర్తలంతా ట్రస్ట్ చైర్మన్ చక్రవర్తి అధీనంగా ఉంటారు. చక్రవర్తి ఒక్కో వింగ్‌కి ఒక్కొక్కరిని ఇన్ చార్జిలను నియమించుకున్నారు. వారే ఈ కార్యకర్తల్ని నేరుగా పర్యవేక్షిస్తారు. ఈ కార్య కర్తలతో మాట్లాడేందుకు పత్రికల వాళ్లు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. వారసలు మాట్లాడటానికే ఇష్టపడటం లేదు. వారి పేరు చెప్పటానిక్కూడా వారు భయపడే పరిస్థితి నెలకొని ఉంది. తమకేమీ తెలీదని, తమనేమీ అడగొద్దని వారు చేతులెత్తి నమస్కరించడం చూస్తుంటే ట్రస్ట్ వారి నోళ్లు ఎంతగా మూసివేసిందో ఇట్టే అర్ధమవుతుంది
నమ్మినవారి నుంచే ప్రాణహాని
ఆస్తుల కోసం ఆయన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు..
శివసాయిబాబా ఆరోపణలు
సత్యసాయిబాబా నమ్మినవారే ఆయనకు ప్రాణహాని కలిగిస్తున్నారని చిక్కబళ్లాపూర్ మఠాధి పతి సింగేపల్లి శివసాయిబాబా ఆరోపించారు. 'సత్యసాయి ట్రస్ట్‌లోని విదేశీ ఆస్తులను పంచుకునేందుకే సాయిబాబా ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. అందుకే ఆయనను ప్రజలకు చూపించడం లేదు. ఆరోగ్యాన్నీ గోప్యంగా ఉంచారు' అని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌లో సింగేపల్లి సంగమేశ్వర ఉత్సవాల్లో మంగళవారం శివసాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించిన మహాతత్వవేత్త సత్యసాయిబాబా ఆర్యోగంపై నిజనిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని.. కిడ్నీలు సహకరించడం లేదని చెబుతున్న డాక్టర్ సఫాయాకు ఇన్ని అంశాలను పరిశీలించిదగ్గ నిపుణత ఉందా? అని ప్రశ్నించారు.
సఫాయా, సత్యజిత్ తదితరులు వాటాలు పంచుకునేందుకే బాబా ఆరోగ్యాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. సాయిబాబా ఏనాడో మరణించి ఉంటారన్న వదంతులు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయమై వాస్తవా లు తెలుసుకునేందుకు పుట్టపర్తి వెళ్లనున్నట్లు తెలిపారు. బాబా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.

బాబా పాదాల చెంత.. మైనపు విగ్రహం నుంచి సుగంధ నూనె
పుట్టపర్తిలో వింత.. తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తులు
పుట్టపర్తిలో మంగళవారం ఓ 'వింత' చోటుచేసుకుంది. మైనంతో చేసిన సత్యసాయి బాబా విగ్రహం పాదాల నుంచి సుగంధ నూనె జాలు వారింది. ఇది సత్యసాయి మహత్యమేనని ప్రచారం జరిగింది. దీంతో, బాబా విగ్రహాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అయితే, ఇంటి లోపల ఉన్నప్పుడు వచ్చిన సుగంధ నూనె.. విగ్రహాన్ని బయట పెట్టిన తర్వాత నిలిచిపోయింది.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన రహీం చిత్రకారుడు. మూడేళ్ల కిందట పుట్టపర్తికి వలస వచ్చి చిత్రాలను వేసి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే బాబా విగ్రహాన్ని తయారు చేసి విక్రయించాడు. మరో విగ్రహాన్ని 120 కేజీల మైనంతో తయారు చేశాడు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో.. ఓ గదిలో ఉన్న విగ్రహాన్ని చూడడానికి రహీం గది తలుపులు తెరిచాడు.
దీంతో, సుగంధ ద్రవ్యాల వాసన వచ్చింది. విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించానని, పాదాల నుంచి నూనె కారడం కనిపించిందని ఆయన తెలిపారు. ఆ నోటా ఈ నోటా తెలిసి విగ్రహాన్ని చూడడానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. పరిసర గ్రామాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు వచ్చారు. పలువురు భక్తులు ఇది ముమ్మాటికీ సత్యసాయి మహత్యమేనని చెప్పారు.
బాబా త్వరగా కోలుకుంటారని, ఆయన మహిమల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందని అన్నారు. విషయం తెలుసుకున్న డీ ఎస్పీ నరసింహులు తన సిబ్బందితో విగ్రహం ఉన్న స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున భక్తులు రావడంతో విగ్రహాన్ని ఆరు బయట ఏర్పాటు చేశారు. అప్పటినుంచి నూనె కారడం ఆగిపోయింది. విగ్రహం నుంచి నూనె కారడానికి కారణం బాబా మహత్యమేనని రహీం వివరించారు.
అది బాబా మహిమే: బాబుల్‌రెడ్డి
సత్యసాయి విగ్రహం నుంచి నూనె రావడం నిజంగా దైవ మహిమే.
త్వరలోనే దర్శనమిస్తారు: ఈశ్వరమ్మ
బాబా దయదలచి తన మహిమల ద్వారా భక్తులకిలా దర్శనమిస్తున్నారు. త్వరగా కోలుకుని అందరికీ దర్శనమిస్తారు.

ట్రస్ట్‌లో ఎవరెక్కడ ?
ప్రశాంతి నిలయంలో ట్రస్ట్ సభ్యుల్లో కొందరే అందుబాటులో ఉంటారు. చక్రవర్తి, ఎస్ వి గిరి, రత్నాకర్ మాత్రమే ప్రశాంతి నిలయంలో ఉంటారు. బాబా బంధువు రత్నాకర్‌కి పుట్టపర్తి టౌన్‌లో సొంత ఇల్లు ఉంది. ఆయన రోజూ ఆక్కడి నుంచే వచ్చిపోతుంటారు. రత్నాకర్‌కి మూడు నెలల క్రితం ప్రమాదం జరిగింది. రెండు కాళ్లూ విరిగాయి. చక్రాల బండిలోనే ఆయన ప్రయాణం. ఎక్కడికీ వెళ్లరు. ప్రశాంతి నిలయం..ఇల్లు..ఇదే ఆయన కాలక్షేపం. ఇక చక్రవర్తి, గిరి మాత్రం ప్రశాంతి నిలయంలోనే ఉంటారు. వారిద్దరికీ వేర్వేరు బంగ్లాలున్నాయి.
అందులో వారు తమ కుటుంబాలతో ఉంటారు. అవన్నీ వారికి ఉచిత వసతులే. మామూలుగా అయితే గతంలో వీరిద్దరూ రోజూ కార్యాలయానికి వచ్చి వెళుతుండేవారు. బాబా ప్రియ శిష్యుడిగా తనకు తాను ముద్ర వేసుకున్న సత్యజిత్తు ప్రస్తుతం ఆసుపత్రిలోనే మకాం వేశారు. ఆయన బాబా దగ్గరే ఉంటున్నారు. బాబా ఆసుపత్రిలో చేరిన దగ్గర్నుంచీ సత్యజిత్తు ప్రశాంతి నిలయానికే రాలేదు. ఆయనొక్కరికే ఆసుపత్రిలోని ఐసీయూలోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. ఆ మాటకొస్తే డాక్టర్లకి కూడా ఆయనే ఆనుమతి ఇవ్వాల్సిన స్థితి అక్కడ నెలకొంది. బాబా బంధువులను కూడా ప్రస్తుతం ఆసుపత్రికి రానివ్వడం లేదు. బాబా సోదరుడి కొడుకైన రత్నాకర్, బాబా మనవడు, మేనల్లుడు అయిన శ్రావణ్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతున్నారు.
వారి ద్వారానే బంధువులకు సమాచారం అందుతున్నట్లు తెలిసింది. రత్నాకర్‌కు ట్రస్ట్‌లో సభ్యత్వం ఉంఇ. అయితే ఆయన శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. కాని ట్రస్ట్‌లో ఉన్న వర్గాల కారణంగా ఆయనకు అది లభ్యం కాలేదు. రత్నాకర్, ఆదికేశవులు నాయుడు ఒక వర్గంగా ముద్ర పడ్డారు. మంత్రి గీతారెడ్డి, చక్రవర్తి, సత్యజిత్తు, చారుసిన్హా వీరంంతా భావ సారూప్యం గల వర్గంగా గుర్తింపు పడ్డారు. గిరి, మిగతా వారంతా మధ్యస్తంగా ఉన్నారు. బాబా ఆరోగ్యం గురించిన వాస్తవాలను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలన్న అంశం మీద వీరిలో ఏకాభిప్రాయం మృగ్యమైంది. అందుకే ఇప్పటి దాకా అది సాధ్యపడలేదు. సత్యజిత్తు ఇందుకు ససేమిరా అంటున్నారని తెలిసింది.
బాబా ఆరోగ్యంపై సర్కారు నాటకం
వాస్తవాలు చెప్పని మంత్రులు
టీడీపీ నేత ముద్దకృష్ణమ ధ్వజం
సత్యసాయి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నాటకమాడుతోందని, భక్తులకు వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతోందని టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. ఆయన మంగళవారం కడపలో ఎమ్మెల్యేలు లోకేశ్వరరావు, రామకృష్ణ, ప్రభాకర్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు.
బాబా భక్తులు వజ్రాలు, బంగారం, నగదుతో ఎన్నో విరాళాలు ఇచ్చారని, రూ. 1.50 లక్షల కోట్ల ఆస్తులున్నాయని చెప్పారు. రోజుకు రెండు బులెటిన్లతో భక్తులను, ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. మంత్రులు వాస్తవాలను చెప్పట్లేదన్నారు. ఇందులో గీతారెడ్డి పాత్రను స్పష్టం చేయాలన్నారు. బాబాను చూసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా వెళ్లకపోవడం దారుణమన్నారు.
క్రిమినల్ కేసులు పెట్టాలి
సత్యసాయి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సత్యజిత్, చక్రవర్తిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో మంగళవారం వీరిద్దరి దిష్టిబొమ్మలను తెలుగుయువత నేతలు దహనం చేశారు.

No comments:
Post a Comment