మూడు నెలలుగా అన్నం లేదు
ఆరు నెలలుగా మాట్లాడింది లేదు
'భగవాన్'కు గంజిలో నిద్రమాత్రలు
ఆప్తులనూ రానివ్వని సహాయకులు
తనువు చాలించాలన్న వ్యథతో బాబా!
చికిత్స ఒకటి.. చెబుతున్నది మరోటి
ఐసీయూలో వైద్యం తెలియని వ్యక్తి
ఎముకల గూడులో సత్యసాయి
అందుకే బయటికి రాని ఫోటోలు?
ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం
'భగవాన్'కు గంజిలో నిద్రమాత్రలు
ఆప్తులనూ రానివ్వని సహాయకులు
తనువు చాలించాలన్న వ్యథతో బాబా!
చికిత్స ఒకటి.. చెబుతున్నది మరోటి
ఐసీయూలో వైద్యం తెలియని వ్యక్తి
ఎముకల గూడులో సత్యసాయి
అందుకే బయటికి రాని ఫోటోలు?
ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం
ఆయన పాద పద్మాలను ఫొటోల్లో చూసుకుని సైతం తన్మయత్వానికి గురయ్యే అఖిల భక్త జనానికి ఇదో చేదు నిజం... మూడు నెలలుగా 'ప్రత్యక్ష దైవానికి' ప్రత్యక్ష నరకం! ముప్పూటలా పంచభక్ష్యాలు ఆరగిస్తున్న 'జిత్తు'ల మారి సహాయకులు.. మూడు నెలలుగా 'దివ్య పురుషుడికి' ఒక్క ముద్ద అన్నం పెట్టని దైన్యం! గంజిలో నిద్ర మాత్రలు వేసి.. 'దేవుడిని' నిద్రలో ముంచేసిన చిత్రం!
నిత్యం భక్తితత్వం ప్రబోధించే 'భగవాన్'.. ఆరు నెలలుగా బలవంతపు మూగ నోములో బందీ అయిన వైచిత్రి! సత్యజిత్ అనే సహాయకుడి చేతుల్లో సత్యసాయిబాబా బందీ! అసలు ఆయన అనారోగ్యానికి కారణం కూడా ఈ సత్యజిత్తే! ఇది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పరిశోధనలో వెల్లడైన పచ్చి నిజం! సహాయకుల ముసుగులో బాబాను చెరపట్టిన వైనం ఎప్పటికైనా భక్తులకు తెలియాలనే ఉద్దేశంతో ప్రశాంతి నిలయంలో 1968 నుంచి ఉంటున్న ప్రొ. శ్యాంసుందర్ రాసి పెట్టుకున్న ఒక లేఖను ఆంధ్రజ్యోతి సంపాదించింది.
అవును.. ప్రశాంతి నిలయం.. ఇప్పుడు అశాంతి నిలయమైంది! ప్రేమ భావనలు బోధించిన వేద మూర్తికి.. అది మానసిక వేదన మిగిల్చింది! భక్తితత్వం బోధించిన కాషాయధారికి.. కపట శిష్యగణం ఖైదు విధించింది!! అసలు.. సత్యజిత్ అనే అల్ప జీవి.. సాక్షాత్తూ సత్యసాయినే తన గుప్పిట్లోకి ఎలా తీసుకున్నాడు? దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి?
శ్యాం సుందర్ లేఖలో ఏముందంటే?
...బాబా అందరికీ దేవుడు కావచ్చేమో కానీ తనకు, సత్యజిత్‌కు మాత్రం దేవుడు కాడని శౌరి తరచు అనేవారు. ...ఈ దశలో శౌరి సత్యజిత్‌కు ఒక సలహా ఇచ్చారు. బాబాకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టేయమని! అప్పట్నుంచి బాబాకు నిద్రమాత్రలు వేయడం మొదలైంది.
...2006లో భగవాన్ బృందావన్ నుంచి తిరిగి వచ్చారు. ఇకపై నిద్ర మాత్రలు వేసుకోనని చెప్పారు. అయితే ప్రశాంతి నిలయం చేరుకున్నాక నిద్రమాత్రలు వేసుకోవడం ప్రారంభించారు. కాలం గడిచేకొద్దీ బాబా కదలికలు మందగించాయి.
...సత్యజిత్ చెప్పేవరకూ ఏ డాక్టరూ బాబా దగ్గరకు రావడానికి వీల్లేదు. స్వామి ఏ సమయంలో దర్శనం ఇవ్వాలో నిర్ణయించేది సత్యజితే. కిందకు తీసుకురావాలా, వద్దా అనేది కూడా ఆయన ఇష్టమే.
...ప్రతి శనివారం లేదా ఆదివారం లేదా సెలవు రోజు ఇద్దరు డాక్టర్లు వచ్చి యజుర్మందిర్‌లో ఉంటారు. కానీ వారు వచ్చేది వైద్యం చేయడానికి కాదు... అర్ధరాత్రి వరకూ సినిమాలు చూస్తూ గడపడానికి.
...గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖ పక్షవాతంతో బాధపడడం చూస్తున్నాను. ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా? దాని గురించి ఎవరూ మాట్లాడరు. వారికి ఆ అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి కావచ్చు.
...భగవాన్ గుండె జబ్బుతో బాధపడుతున్నారనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. ఆ సమస్య కొద్ది రోజుల కిందటే ఏర్పడిందా? లేదంటే చాలా నెలల క్రితం నుంచే ఉందా? చాలా నెలల క్రితం నుంచే ఉందని వైద్య పరీక్షల నివేదికలు చెబుతున్నప్పుడు మరి చికిత్సను ముందుగానే ఎందుకు ప్రారంభించలేదు?
ఇప్పుడైనా నేను నోరు విప్పకపోతే దేవుడు క్షమాంచడు: ఆదికేశవులు
బాబాను నేను కలిసిన సమయంలో ఆయనలో వైరాగ్యం కనిపించింది. కొన్ని రోజులుగా ఆయన మనసు విప్పి మాట్లాడడం లేదు. మూడు నెలలుగా అన్నం ముట్టడం లేదని తెలిసింది. ఈ స్థాయిలో ఆరోగ్యం క్షీణించే దశకు చేరడం వెనుక ట్రస్టు నిర్లక్ష్యం ఉంది. ఈ స్థితిలో కూడా నేను నోరు విప్పి మాట్లాడకపోతే దేవుడు కూడా నన్ను క్షమించడు. అక్కడ చాలా జరుగుతోంది.
స్వామి చిత్ర వధ కంటే ఎక్కువ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. హెల్త్ బులెటిన్‌ను సైతం ట్రస్టు, ప్రభుత్వ వైద్యులు వేరు వేరుగా ఇస్తున్నారు. లక్షలాది భక్తులు ఆరాధించే దివ్య పురుషుడైన బాబాకు ఈ పరిస్థితి రావడం బాధాకరం. దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితి నన్ను వేధిస్తోంది. దీనిని సహించేది లేదు. సత్యజిత్‌ను విచారించాలి. బాబా ఆరోగ్యం బాగుపడాలి. త్వరలో ఆయన భక్తులకు దివ్యదర్శనం ఇవ్వాలి.
- బాబా భక్తుడు ఆదికేశవులు నాయుడు
హైదరాబాద్, ఏప్రిల్ 14 : కోట్లాది భక్తులకు ప్రత్యక్ష దైవం కొంత కాలంగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారా? ఏకుల్లా వచ్చి మేకులైన వారు బాబాను గుప్పిట్లో పెట్టుకొని, నిర్బంధించి, సకాలంలో సరైన వైద్యం అందకుండా చేశారా? ఆస్పత్రిలో చేర్చక ముందు రోజూ బాబా గదికి తాళం వేసి, ఆయనను తీవ్ర మనోవేదనకు, ఆనారోగ్యానికి గురి చేసిన వ్యక్తి.. ఇప్పుడు బాబా చికిత్స పొందుతున్న ఐసీయూలో ఏం చేస్తున్నట్లు?
ప్రభుత్వం పంపిన డాక్టర్లను కాదని, ఇతరులు బాబాకు చేస్తున్న చికిత్స ఏమిటి? బాబాకు గత కొన్ని నెలలుగా వాడిన మందులు ఏంటి? అవి సరైన చికిత్స కోసం వాడినవేనా? వీటన్నింటికీ సమాధానం దొరికితే ప్రశాంతి నిలయంలో సాగుతున్న అశాంతి కార్యకలాపాలు బట్టబయలవుతాయి! వీటిలో కొన్నింటికి 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కూపీ లాగింది. విస్తుబోయే విషయాలను బయటకు తీసింది. భక్త కోటి నిర్ఘాంతపోయే నిశీధి నిజాలను తవ్వితీసింది.
బాబాకు సరైన వైద్య చికిత్స అందించాలని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, బాబాకు సన్నిహితులైన టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు వంటివారు ఆరు నెలల కిందటే ఎంత మొత్తుకున్నా.. పరిస్థితి విషమించే వరకు ఉపేక్షించి, బాబాను తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేశారు. బాబా తొమ్మిదేళ్ల కిందట ప్రమాదవశాత్తూ కింద పడ్డారు. ఆ ఘటనలో ఆయన తుంటి ఎముక దెబ్బతింది.
అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయనకు సపర్యలు చేసే బాధ్యతలు స్వీకరించిన సత్యజిత్ అనే వ్యక్తి ఇపుడు మొత్తం కథ నడిపిస్తున్నారు. 2005 నుంచి బాబాను దాదాపుగా బందీ చేశారు. మొదట్లో ఉన్న పూర్ణచంద్ర హాలు నుంచి యజుర్మందిరంలోకి బాబాను మార్చారు. బాబాను ఎవరూ దర్శించుకోవడానికి వీలు లేకుండా గేట్లకు తాళాలు వేసేవారని తెలియవచ్చింది.
సత్యజిత్ నిర్లక్ష్యం వల్లే!
బాబాకు ఆహారం అందించడంతో పాటు అనేక విషయాల్లో సత్యజిత్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న ఆరోపణ వినిపిస్తోంది. బాబాకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా సత్యజిత్ అనుమతి ఉండాలన్న రీతిలో వ్యవహారం నడిచినట్టు చెబుతున్నారు. సాయి వ్యవహారాలతో పాటు ఆయన ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ట్రస్ట్ వర్గాలు ఆధిపత్య పోరులో మునిగిపోవడం కూడా బాబా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యానికి కారణమయ్యాయన్న అనుమానాలున్నాయి.
సత్యజిత్ వ్యవహారం కారణంగానే సత్యసాయి నేడు అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా సెంట్రల్ ట్రస్ట్‌లో సభ్యత్వం కావాలని సత్యజిత్ గతంలో డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి.
సెంట్రల్ ట్రస్ట్‌లో సభ్యత్వం విషయంలో ఇతరులు సత్యజిత్‌ను అడ్డుకున్నట్టు ప్రచారముంది. సాయి ఆరోగ్యం విషయంలో మొదటి నుంచి ఉన్న వారిపై కూడా సత్యజిత్ తన ఆధిపత్యం ప్రదర్శించి ఒక్కొక్కరినీ దూరం చేస్తూ వచ్చారని శ్యాంసుందర్ అనే ప్రొఫెసర్ పేర్కొనడం గమనార్హం. ఇలా ఎవరికి వారు సత్యసాయిపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చి ఆయనను మానసికంగా తీవ్ర క్షోభకు గురి చేసినట్టు ప్రచారముంది.
వైద్య బృందం కోసం పట్టుబట్టిన ఆంతరంగికులు!
అడపాదడపా బాబానే బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చి వెళ్లేవారు. బాబా ఆరోగ్య పరిస్థితి క్రమేపీ దెబ్బ తింటున్నట్లు గుర్తించిన ట్రస్టు సభ్యులు, ఆంతరంగికులు, ఆయన చికిత్సను పర్యవేక్షించేందుకు ఒక వైద్యుల కమిటీని నియమించాలని సూచించారు. మంత్రి గీతారెడ్డి కూడా పట్టుపట్టారు కానీ ఏ కారణాల వల్లనో అది ఆచరణలోకి రాలేదు.
గత మూడు నెలలుగా బాబా ఆరోగ్య పరిస్థితిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తీవ్రమైన మనోవేదనను, వైరాగ్యాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తపరిచేవారు. భక్తులకు దర్శనం ఇవ్వడం కూడా తగ్గించేశారు. తన ఆశయం సిద్ధించిందని తనువు చాలిస్తానని కూడా ఆంతరంగికుల వద్ద అనేవారు. దాదాపు మూడు నెలలు మానసికంగా, శారీరకంగాతీవ్ర మనోవేదనను, హింసను అనుభవించారు. ఆయనకు అన్నం పెట్టకుండా కేవలం గంజిలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేవారని తెలుస్తోంది.
పరిస్థితి చేజారి పోతున్న సమయంలో మార్చి 28న బాబాను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్చి 27న బాబా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఆయన ఆప్తులకు దిగ్భ్రాంతికర విషయం తెలిసింది. 27వ తేదీన బాబా ఉన్న గదితో పాటు లిఫ్టుకు సైతం తాళాలు వేశారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న బాబాను ఆస్పత్రికి పంపకుండా, సన్నిహితులకు చూపకుండా తాళాలు ఎందుకు వేశారు? ఎవరికీ అంతుపట్టదు! ఇది గడచిన చరిత్ర! బాబాకు జరుగుతున్న వైద్యమేంటి?
మార్చి 28 తర్వాత ఆస్పత్రిలో జరుగుతున్నదేమిటి! ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! బాబాకు ఒట్టి అనారోగ్యమేనా? ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఇన్ఫెక్షన్ క్రమేపీ తగ్గుతోందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. మరి బాబాకు సీటీ స్కాన్ చేసిన విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. ఐసీయులోకి ప్రభుత్వ వైద్యుల బృందాన్ని అనుమతించడంలేదు.
బాబాకు గత కొన్ని నెలలుగా వాడిన మందుల వివరాలన్నీ వైద్య విభాగం డైరెక్టర్ రవిరాజ్ దగ్గర ఉన్నాయి. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి... గొడవల చెలరేగుతాయి.. అనే భావంతో ఆ విషయాలను బయటపెట్టడం లేదు. లోపలి అవయవాలతో పాటు శరీరంపైన కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు తేల్చాల్సి ఉంది. అదే సమయంలో చికిత్స పొందుతున్న బాబాను ఎందుకు చూపించడం లేదన్నది మరో ప్రశ్న. తీవ్ర అనారోగ్యానికి గురైన బాబా.. ఎముకల గూడుగా మారిపోయారని, అందుకే ఆయన వీడియో క్లిప్పింగ్‌ను గానీ, కనీసం ఫొటోను గానీ బయటికి రానీయడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఆస్పత్రిలో వైద్యుల కంటే వైద్యం తెలియనివారే ఎక్కువగా ఉండటం విశేషం. ఐసీయూను తన కంట్రోల్‌లో ఉంచుకున్న కార్డియాలజిస్ట్ అయ్యర్ కూడా ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా ఐసీయూలో ఉన్న పేషెంట్‌ను అత్యవసరమైతే గానీ కదపరు. అటువంటిది... సత్యసాయిని పిల్లి.. పిల్లలను మార్చినట్లు ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్‌కు తెగ తిప్పేస్తున్నారు. 18 రకాల యాంటీబయాటిక్స్‌ను ఆయన శరీరంలోకి పంపుతున్నారు. ఇదంతా బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదు.
సత్యసాయి బందీగా మారిన పరిస్థితి ఈనాటిది కాదు. ఒక్క రోజులో జరిగిన పరిణామమూ కాదు. ఏళ్ల తరబడి కొందరి చేతుల్లో చిక్కుకుపోయిన సత్యసాయి.. శారీరకంగా దుర్భలుడిగా మారుతున్న కొద్దీ ఆ దుర్మార్గులు విజృంభించారు. ఈ విషయాన్ని సాయికి అత్యంత సన్నిహితంగా ఉండే పలువురు ముందుగానే సర్కారు చెవిన వేసినా ఫలితం లేకపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది.
ఎందుకింత రహస్యం పాటిస్తున్నారు? ఏమిటీ దాగుడు మూతలు? త్వరలో ఈ గుట్టూ రట్టు కాక మానదు! ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. సత్యజిత్ సహా ట్రస్ట్‌లోని ముఖ్యులను సైతం ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇంతటి సాహసానికి ప్రభుత్వం పూనుకుంటుందా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే!!

బాబా భక్తులారా.. వినగలిగే శక్తి ఉందా?
భగవాన్‌ను ఈ స్థితికి తెచ్చింది శౌరీ, సత్యజిత్‌లే..
వాస్తవాలు బయటపెట్టిన ప్రొ. శ్యాంసుందర్!
ఆయన రాసినట్లు చెబుతున్న లేఖ పూర్తి పాఠం ఇదీ...
భగవాన్ బాబా భక్తులారా! మీకు వినగలిగే శక్తి ఉంటే వినండి. భగవాన్ ఆరోగ్యాన్ని ఈ స్థితికి తెచ్చింది శౌరి, సత్యజిత్‌లే. ఎవరూ నమ్మకపోయినా ఇది ముమ్మాటికీ నిజం. Ever Effervescent Anil Kumar
![]() | ![]() | ||
![]() | ![]() | ||
![]() | Narrating the scintillating story of His Glo |
* బాబా అందరికీ దేవుడు కావచ్చేమో కానీ తనకు, సత్యజిత్‌కు మాత్రం దేవుడు కాడని శౌరి తరచు అనేవారు.
* ఈ దశలో శౌరి సత్యజిత్‌కు ఒక సలహా ఇచ్చారు. బాబాకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టేయమని! అప్పట్నుంచి బాబాకు నిద్రమాత్రలు వేయడం మొదలైంది.
* గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖ పక్షవాతంతో బాధపడడం చూస్తున్నాను. ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా? దాని గురించి ఎవరూ మాట్లాడరు. వారికి ఆ అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి వచ్చు.
సత్యజిత్ చెప్పేవరకూ ఏ డాక్టరూ బాబా దగ్గరకు రావడానికి వీల్లేదు. స్వామి ఏ సమయంలో దర్శనం ఇవ్వాలో నిర్ణయించేది సత్యజితే. స్వామిని దర్శనం కోసం కిందకు తీసుకురావాలా, వద్దా అనేది కూడా ఆయన ఇష్టమే.
![]() | ![]() | ![]() | ![]() | |||
![]() | ![]() | ![]() | ||||
![]() | Sri GK Raman seeking Divine Permission - Swami guided every function and festival | ![]() | ![]() | Sri Ramani, Tamil Nadu State President, offering the day's programme for Divine Blessings and approval | ![]() |
వాస్తవాలివీ...
1) భగవాన్ సాయిబాబా దివ్య ఆశీస్సులతో ఆయన పాదపద్మాల చెంత సేవ చేయడానికి నేను పూర్ణచంద్ర ప్యాలెస్‌లోకి ప్రవేశించాను.
2) 1993లో బాబా పూర్ణచంద్ర ఆడిటోరియానికి మారడానికి ముందువరకూ శౌరి అక్కడ స్టోర్ కీపర్‌గా పనిచేస్తుండేవారు. ఆ తర్వాత కూడా శౌరి అక్కడే ఉంటూ బాబాకు రోజూ వచ్చే పోస్టును చూస్తుండేవారు. శౌరి స్థానంలోకి నేను వచ్చాను.
3) శౌరి పని నత్తనడకన సాగుతుండేది. ఏడాదిన్నర క్రితం వచ్చిన ఉత్తరాలు కూడా క్లియరెన్స్ లేకుండా మూలుగుతుండేవి.
4) అందుకే శౌరిని ఆ బాధ్యతల నుంచి తప్పించి, పోస్టు చూడడానికి నన్ను పెట్టుకున్నట్లు సత్యజిత్ అప్పట్లో నాకు చెప్పారు. పైన చెప్పిన తేదీన శౌరి స్థానంలో బాధ్యతలు స్వీకరించడం కోసం చక్రవర్తి నన్ను పూర్ణచంద్ర ప్యాలస్‌కు తీసుకువెళ్లారు. అయితే శౌరి నాకు బాధ్యతలు అప్పగించకుండా వాయిదా వేశారు. ముందుగా నాకు పని నేర్పాల్సిఉందన్నారు. వాస్తవానికి ఆ పనిలో ఆయన పెద్దగా నేర్పేదేమీ లేదు. అయితే శౌరి తాను మరణించేవరకూ అదే మోసపూరిత విధానాల్ని కొనసాగించారు.
5) నేను ప్రతిరోజూ 5 గంటలకు వచ్చేవాణ్ని. శౌరి, సత్యజిత్ కూడా అదే సమయానికి వచ్చేవారు. సత్యజిత్‌తో ఏకాంతంగా మాట్లాడడం కోసం తనకు కొంత సమయం ఉండాలని శౌరి భావించేవారు. అందుకే నన్ను 6 గంటలకు రమ్మని చెప్పారు. నేను సరైన సమయానికే వస్తానని ముందు చెప్పినా, వారిద్దరి ఒత్తిడికి తలొగ్గి 6 గంటలకు వచ్చేవాణ్ని.
6) 1968లో నేను బాబా చెంతకు తొలిసారి వచ్చాను. అప్పటినుంచీ భగవాన్ నాపై ఎంతో ప్రేమ చూపించేవారు. ఆశ్రమానికి వచ్చి సేవ చేయమని నన్ను ఆదేశించారు. చాలాసార్లు నన్ను భోజనానికి పిలిచేవారు. 1993 నుంచి శౌరికి ఎప్పుడూ ఈ అవకాశం లభించలేదు. బాబాతో నా సాన్నిహిత్యం చూసి శౌరి ఆశ్చర్యానికి, ఆందోళనకు కూడా లోనయ్యేవారు. అప్పట్నుంచీ శౌరి నాపై కుట్రలకు దిగారు. నాకు వ్యతిరేకంగా సత్యజిత్‌ను కూడా తప్పుదారి పట్టించారు. బాబా అందరికీ దేవుడు కావచ్చేమో కానీ తనకు, సత్యజిత్‌కు మాత్రం దేవుడు కాడని శౌరి తరచు అనేవారు. బాబా అతన్ని (నన్ను) తెచ్చారు, నిన్ను తొలగిస్తారేమోనంటూ సత్యజిత్‌కు నాపై నూరిపోశారు. నాపై శౌరి ఫిర్యాదులు, పితూరీలు ఎక్కువయ్యాయి. శౌరి ప్రోద్బలంతో సత్యజిత్ ప్రతిరోజూ నన్ను వేధించేవారు. అయితే బాబా దివ్యత్వాన్ని నమ్ముకున్న నేను ఇవన్నీ పట్టించుకునేవాణ్ని కాను.
7) 2005లో నేను శౌరిని ఒక ప్రశ్న అడిగాను. సత్యజిత్ మెట్లు దిగి కిందికి వచ్చినప్పుడల్లా ఎందుకు నిద్రపోతున్నారని ప్రశ్నించాను. "సత్యజిత్‌కు బాబా రాత్రి నిద్రలేకుండా చేస్తున్నారు. ప్రతి 15-20 నిముషాలకు ఒకసారి మంచంపై తనను ఈ పక్క నుంచి ఆ పక్కకు (ఒత్తిగిలేందుకు) మార్చి పడుకోబెట్టమంటున్నారు. అందుకే రాత్రి నిద్రలేక సత్యజిత్ పగలు నిద్రపోతున్నారు'' అని శౌరి నాకు సమాధానమిచ్చారు. ఈ దశలో శౌరి సత్యజిత్‌కు ఒక సలహా ఇచ్చారు. బాబాకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టేయమని! అప్పట్నుంచి బాబాకు నిద్రమాత్రలు వేయడం మొదలైంది. అది బాబా అనుమతితో మొదలైందో, అనుమతి లేకుండా మొదలైందో మాత్రం తెలియదు.
8) 2006లో భగవాన్ వైట్‌ఫీల్డ్‌లోని బృందావన్ నుంచి తిరిగి వచ్చారు. భక్తుల ఒత్తిడితో తానొక నిర్ణయం తీసుకున్నానని, ఇకపై నిద్ర మాత్రలు వేసుకోనని నాకు చెప్పారు. అయితే ప్రశాంతి నిలయం చేరుకున్నాక తిరిగి నిద్రమాత్రలు వేసుకోవడం ప్రారంభించారు. అందుకే ఆయన ఉదయం దర్శనానికి రాకపోవడం, లేదా ఆలస్యంగా రావడం చేసేవారు. మొదట్లో నడవడం, మాట్లాడడం అన్నీ మామూలుగానే ఉండేవి. అయితే కాలం గడిచేకొద్దీ బాబా కదలికలు మందగించాయి. కళ్లు వాలిపోతుండడం, గొంతు నీరసించడం, శరీరంలో నిస్సత్తువ వంటివన్నీ మొదలయ్యాయి.
9) పూర్ణచంద్ర ప్యాలస్‌లో కావచ్చు, యజుర్మందిర్‌లో కావచ్చు... డాక్టర్ అయ్యర్ రహస్యంగా ఈ మందుల్ని అందించేవారు. రహస్యంగా అని ఎందుకు చె బుతున్నానంటే... నేను ఎప్పుడైనా తెలియక అకస్మాత్తుగా అక్కడికి వెళితే ఆ మందుల్ని నా కంట పడకుండా దాచేసేవారు. వాటిని ఎందుకు దాచేవారు? దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి?
10) అన్నింటికన్నా దారుణమేమిటంటే వంటవారిని హింసించడం. వంటగదిలో పని చేసే చాలా మందిని సత్యజిత్ వేధించే వారు. కుశల్ అనే పేరున్న ఒక కార్మికుడు నాకు తెలుసు. అతడు ఉదయమే పైకి వెళ్లి, ఏడుస్తూ కిందికి తిరిగి వచ్చేవాడు. ఇది చాలా నెలలపాటు కొనసాగింది. ఈ వేధింపుల గురించి అతడు తన తల్లిదండ్రులకు చెప్పుకుని ఏడ్చాడు. వారు దీనిపై ఆశ్రమ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకపోయిందని తెలిసింది. కుశల్ వెళ్లిపోయే ముందు నాకు చెప్పాడు... సత్యజిత్ తన (కుశల్) ప్యాంట్‌ను విప్పేవారని, ప్రతిఘటిస్తే కొట్టేవారని!
11) గిరీశ్ సంగతి కూడా ఇలాంటిదే. రాత్రి 10-10.30 మధ్య సత్యజిత్ కిందికి వచ్చేవారు. వంటగదిలో 15-20 నిముషాలుండి గిరీశ్ కళ్లలోకి చూస్తూ నిల్చుని, అతణ్ని తన దారికి తెచ్చుకునేవారు. ఆ తర్వాత ఏం జరిగేదో తెలియదుగానీ, పైకి వెళ్లి రెండు గంటలు గడిపేవారు. వంట పనంతా సేవాదళ్‌తో చేయించేవారు.
12) మూడేళ్ల కిందట స్వామి ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు నేను ఆశ్రమ అధికారుల్ని కలిసి స్వామిని చూసుకోవడానికి ఒకరు చాలరని, ఇద్దరు ముగ్గురు మనుషులుంటే బాగుంటుందని కోరాను. స్వామికి సంబంధించి ఒకరే సరైన సమాచారం ఎలా ఇవ్వగలరని, ఒక వ్యక్తి మీదే స్వామి ఎందుకు ఆధారపడాలని ప్రశ్నించాను. ఇదే పరిస్థితి కొనసాగితే స్వామి తన పరాధీనతకు మరింత మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పాను. కానీ అదే పరిస్థితి కొనసాగింది.
13) గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖ పక్షవాతంతో బాధపడడం చూస్తున్నాను. ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా? దాని గురించి ఎవరూ మాట్లాడరు. వారికి ఆ అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి కావచ్చు.
14) బాబా తరచు బ్రాంకైటిస్‌తో బాధపడుతుంటారు. దానిని పూర్తిగా తగ్గించేందుకు ఏమైనా చికిత్స అందించారా?
15) భగవాన్ గుండె జబ్బుతో బాధపడుతున్నారనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. ఆయనకు ఆ సమస్య కొద్ది రోజుల కిందటే ఏర్పడిందా? లేదంటే చాలా నెలల క్రితం నుంచే ఉందా? చాలా నెలల క్రితం నుంచే ఉందని వైద్య పరీక్షల నివేదికలు చెబుతున్నప్పుడు మరి చికిత్సను ముందుగానే ఎందుకు ప్రారంభించలేదు?
16) ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే... సత్యజిత్ చెప్పే వరకూ ఏ డాక్టరూ బాబా దగ్గరకు రావడానికి వీల్లేదు. స్వామి ఏ సమయంలో దర్శనం ఇవ్వాలో నిర్ణయించేది సత్యజితే. స్వామిని దర్శనం కోసం కిందకు తీసుకురావాలా, వద్దా అనేది కూడా ఆయన ఇష్టమే.
17) ప్రతి శనివారం లేదా ఆదివారం లేదా సెలవు రోజు ఇద్దరు డాక్టర్లు వచ్చి యజుర్మందిర్‌లో ఉంటారు. కానీ వారు వచ్చేది వైద్యం చేయడానికి కాదు... అర్ధరాత్రి వరకూ సినిమాలు చూస్తూ గడపడానికి. అయితే వారు ఆ పై స్వామిని వీల్‌ఛెయిర్‌లో భక్తుల ముందుకు తీసుకువెళ్లి తాము ఏదో గొప్పగా వైద్యం చేసేస్తున్నట్లు పోజిస్తుంటారు. బాబా మనోభీష్టానికి వ్యతిరేకంగా ఆ డాక్టర్లు యజుర్మందిర్‌లోనే తిష్ఠ వేశారు. వారు సత్యజిత్‌కు మంచి స్నేహితులు కావడమే అందుకు కారణం.
18) బాబా త్వరలోనే కోలుకోవాలని ఆయన పాదపద్మాల చెంత మేం ప్రార్థిస్తున్నాం. బాబా తన వెలుగులతో తిరిగి తమ చెంత నిలవాలని ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ ప్రార్థిస్తున్నారు.
![]() | |||
![]() | |||
![]() | The Lord within and the Lord without - Swami at Sri Venkatamuni's residence |
సత్యజిత్ చేతిలో సాయి బందీ!
ఏబీఎన్ చర్చలో వక్తల స్పందన
బాబా క్షోభను అనుభవిస్తున్నారు: ఆదికేశవులు
విదేశాల్లో ధనం తెచ్చేందుకే నాటకం: శివసాయి
ఐసీయూలో ఎక్కువ రోజులుంచితే ఇబ్బందే: డాక్టర్ విజయ్‌కుమార్
బాబా ప్రేమతోనే ఈ బాధను అనుభవిస్తున్నారు: డాక్టర్ శ్రీనివాస్

గత 19 రోజులుగా ఐసీయూలో చికిత్స పేరిట బయటి ప్రపంచానికి కనిపించనివ్వని బాబా వాస్తవ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు దేవుడిగా పేర్కొనే సత్యసాయిని ఆయన అనుచరుడు సత్యజిత్, అతడి బృందం బందీచేసిందని ఆరోపిస్తున్నారు. 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' చర్చలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 
నోరు విప్పకపోతే దేవుడు క్షమించడు: ఆదికేశవులు
బాబాకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. డబ్బు సంబంధ అంశాలూ ఇందులో ఉన్నాయి. నేను బాబాను కలిసినప్పుడు ఆయనలో వైరాగ్యం కనిపించింది. కొన్నిరోజులుగా ఆయన మనసు విప్పి మాట్లాడడంలేదు. మూడు నెలలుగా అన్నం ముట్టడం లేదని తెలిసింది. ఈ స్థాయిలో ఆరోగ్యం క్షీణించే దశకు చేరడం వెనుక ట్రస్టు నిర్లక్ష్యం ఉంది. డాక్టర్లు కాని వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు.
ఇటీవల నేను బాబాను కలిసే ప్రయత్నం చేసినా అనుమతించలేదు. సత్యజిత్ అనే వ్యక్తి బయటకు రావడం లేదు. ఆయనే లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ స్థితిలో కూడా నేను నోరు విప్పి మాట్లాడకపోతే దేవుడు కూడా నన్ను క్షమించడు. స్వామి చిత్రవధ కంటే ఎక్కువ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. హెల్త్‌బులెటిన్‌ను సైతం ట్రస్టు, ప్రభుత్వ వైద్యులు వేరు వేరుగా ఇస్తున్నారు.
బాబా ఆరోగ్య పరిస్థితిపై కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించాను. వైఎస్ సీఎంగా ఉన్న ప్పుడు బాబా ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలని కోరాను. దివ్య పురుషుడైన బాబాకు ఈ పరిస్థితి రావడం బాధాకరం. ఈ పరిస్థితి నన్ను వేధిస్తోంది. దీనిని సహించేది లేదు. ఇక్కడి విషయాలను ఇప్పటికే ప్రభుత్వానికి వివరించాను. సత్యజిత్‌ను విచారించాలి. బాబా ఆరోగ్యం బాగుపడాలి. త్వరలో ఆయన భక్తులకు దివ్యదర్శనం ఇవ్వాలి.
డబ్బుల కోసమే ఈ తతంగం: శివసాయిబాబా
విదేశాల్లో, స్విస్‌బ్యాంకుల్లో ఉన్న డబ్బు రావాలంటే బాబా ప్రాణాలతో ఉండాలని ఈ పన్నాగం చేస్తున్నారు. ఆ డబ్బు తేవాలంటే కనీసం 20 రోజులు పడుతుంది. బాబాపై వారికి ప్రేమ లేదు. నేను త్రినేత్రంతో చెబుతున్నా. ఇది పరమ రహస్యం. ఆఖరులో సత్యసాయిబాబాకు అపక్తీరి తెస్తున్నారు.
ఐసీయూలో ఎక్కువ రోజులు ఉంచకూడదు: డాక్టర్ విజయ్‌కుమార్
ఐసీయూలో ఎక్కువ రోజులు ఉంచితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. బాబా కూడా మానవుడే. ఆయనకూ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ట్రస్టు కొద్ది మంది చెప్పుచేతల్లోకి వెళ్లింది. వాళ్ల స్వార్థం ఫలితమే ప్రస్తుత బాబా ఆరోగ్యస్థితి. బాబా ఇంకా యంత్రాల సహాయంతోనే ఉన్నారు. బాబా అనుభవిస్తున్న బాధను ఎవరూ కోరుకోరు.
డయాలసిస్ దశకు వచ్చిందంటే కనీసం పదేళ్లుగా కిడ్నీల సమస్య వచ్చి ఉంటుంది. 96 ఏళ్లు బతుకుతానని చెప్పిన బాబా.. 86 ఏళ్లకే క్లిష్టమైన స్థితిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగైతే మంచిదే. ఏదైనా జరిగితే.. బాబా చెప్పింది ఆయన విషయంలోనే నిజం కాలేదనే భావన భక్తుల్లో కలగవచ్చు. బాబా తన ఆస్పత్రిలో గుండెమార్పిడి చికిత్స చేయవద్దని చెప్పేవారు. అది సరికాదు. హై రిస్క్ పేషంట్లకూ పుట్టపర్తిలో చికిత్స ఉండేది కాదు.
బాబా దేహరూపంలో ఉన్న దైవం: డాక్టర్ శ్రీనివాస్
బాబా దేహరూపంలో ఉన్న దైవం. నడిచే దైవం బందీ అయ్యారనడం సరికాదు. 40 ఏళ్ల క్రితం బాబాకు పక్షవాతం వచ్చినా 8రోజుల్లో కోలుకున్నారు. బాబా తన ఆరోగ్య పరిస్థితిని ఆయనే వివరించాలి. బాబా అత్యంత శక్తి వంతుడు. ఆయన చుట్టూ ఉన్న వారు ఎవరూ మలినం కాలేరు.
సత్యజిత్ గురించి నాకు తెలియదు. సత్యజిత్ అలా చేస్తున్నారని ఎలా ఊహించగలం? పక్కవారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పినా ఎవరూ వినలేదు. మతసామరస్యాన్ని పాటించాలన్న గాంధీ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. బాబా పరిస్థితి అలా ఉండవచ్చేమో? సాయిబాబా బెడ్‌రూంలో గతంలో శవం దొరికినట్లుగా జరిగిన ప్రచారం విన్నానే తప్ప నాకు తెలీదు. బాబా ఈ బాధను ప్రేమతో అనుభవిస్తున్నాడు.

ఎవరీ సత్యజిత్?
ఈ ఫొటోలో సాయిబాబాకు కుడివైపున కళ్లద్దాలు పెట్టుకుని నిలబడిన వ్యక్తే సత్యజిత్! ప్రస్తుతం సాయి ఈయన చేతుల్లోనే బందీగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి! బాబా ప్రేమ చూరగొని.. అత్యంత సన్నిహితుడిగా మారిన సత్యజిత్.. అనంతర కాలంలో సత్యసాయి నివాసముండే ప్రత్యేక మందిరాన్ని మొత్తం తన కనుసన్నల్లోకి తెచ్చుకున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
సత్యజిత్ చిన్నప్పుడే సత్య సాయి స్కూలులో విద్యార్థిగా చేరాడు. బాబాకు సపర్యలు చేయడానికి కొందరు చురుకైన విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన సత్యజిత్.. మొదట్లో బాబా వాహనానికి డ్రైవర్‌గా ఉంటూ ఆయన ప్రేమను చూరగొన్నాడు. అప్పటి నుంచి సత్యసాయి ఆంతరంగిక వ్యవహారాల్లో చోటు సంపాదించాడు. 2005లో బాబాకు తుంటి ఎముక దెబ్బతిన్న తర్వాత స్నానం చేయించడం మొదలుకొని బాబా విశ్రమించేవరకు అన్నీ సత్యజిత్తే చూసుకునేవాడు.
బాబా కూడ ఆయనపైనే పూర్తిగా ఆధారపడ్డారు. బాబాకు అనారోగ్యం కలిగినప్పుడు ఆ విషయం బయటకు పొక్కనీయకుండా బెంగళూరుకు చెందిన ఓ కార్డియాలజిస్టుతో చికిత్స చేయించేవాడు. ట్రస్టు సభ్యులు కొందరు ఈ పద్ధతి పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినా, బాబా సత్యజిత్‌నే సమర్ధించడంతో వారు మిన్నకుండి పోయేవారని సమాచారం. అప్పటి నుంచి సత్యసాయి నివాసముండే ప్రత్యేక మందిరం మొత్తాన్ని తన కనుసన్న ల్లోకి తీసుకున్నాడని చెబుతున్నారు. సాయితో అత్యంత చనువుగా వ్యవహరిస్తూ ఇతరులను సైతం శాసించే రీతిలో సత్యజిత్ ఎదిగాడని చెబుతున్నారు.

బాబా కోలుకోవడానికి మరో రెండు వారాలు
స్పృహలోకి వచ్చారు..కళ్లూ తెరిచారు
ఇంకా కృత్రిమ శ్వాసే.. రక్తపోటు 130/80
వైద్య విద్య సంచాలకుడు రవిరాజ్ వెల్లడి
సత్యసాయి ఆరోగ్యపరిస్థితి మెరుగుపడుతోందని రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రవిరాజ్ తెలిపారు. ఆయన కోలుకోవడానికి రెండు వారాలు పట్టొచ్చని వెల్లడించారు. బాబా ఆరోగ్యపరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు గురువారం సాయి ఆరామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిరాజ్ మాట్లాడుతూ బాబా ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
![]() | ![]() | ![]() | ![]() | |||
![]() | ![]() | ![]() | ||||
![]() | The Master Blaster blessed by the Divine | ![]() | ![]() | Sachin's humble offering to the Lord - Cricket balls | ![]() |
![]() | ![]() | ![]() | ![]() | |||
![]() | ![]() | ![]() | ||||
![]() | Bhagavan blesses Sri Yaswant Sinha, former Union Finance Minister, and his family | ![]() | ![]() | From the famous actor to the Divine Director - Swami accepts flowers from Sri Rajnikant | ![]() |
![]() | ![]() | ![]() | ![]() | |||
![]() | ![]() | ![]() | ||||
![]() | Bhagavan receives an offering of a bouquet from Sri Narendra Modi, the Chief Minister of Gujarat | ![]() | ![]() | The Cosmic Governor gifts Vibhuti to the Governor of Tamil Nadu State - Sri Surjit Singh Barnala | ![]() |
'బాబా స్పృహలోకి వచ్చారు. కళ్లు కూడా తెరిచారు. రక్తపోటు 130/80, యూరిన్ ఔట్‌పుట్ 80-90 మిల్లీలీటర్లుగా ఉంది. డయాలసిస్ కొనసాగిస్తున్నాం. గతంలో 24 గంటలకు ఒకసారి చేస్తే.. ప్రస్తుతం 36 గంటలకోసారి చేస్తున్నాం' అని వివరించారు. బాబాకు వయసు కారణంగా అవయవాల పనితీరులో మార్పు వచ్చిందన్నారు. వెంటిలేటర్ సహాయంతో కృత్రిమశ్వాస అందిస్తున్నామని చెప్పారు.
'రోజూ చేస్తున్న సీటీ స్కాన్, ఎక్స్‌రేలను బట్టి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గినట్టు తెలుస్తోంది' అని ఆ యన వెల్లడించారు. ఐదారురోజుల క్రితం బాబాకు కామెర్లు వచ్చాయని.. అమ్మోనియం నిల్వలు శరీరంలో పెరి గాయని, ప్రస్తుతం నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లె రఘు నాథరెడ్డి, పెనుకొండ ఆర్డీఓ ఈశ్వర్ పాల్గొన్నారు.

పుట్టపరిలో ఆందోళనకర పరిస్థితి!
సత్యసాయి బాబా ఆరోగ్యం పరిస్థితి ఏమిటి? ఆయన కోలుకుంటారా? ఎన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉంచి శ్వాస అందిస్తారు? 19 రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉండడమంటే ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టా? బాబా భక్తులతో పాటు ప్రశాంతి నిలయంలోని కొందరుముఖ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి.
వెంటిలేటర్‌పై 19 రోజుల పాటు ఉండడమంటే ఆరోగ్యం మందగించినట్టేనని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాబా ఆరోగ్యంపై ఇప్పటి వరకు భక్తులే వ్యక్తం చేసిన అనుమానాలను తాజాగా ఇతర ముఖ్యులూ వ్యక్తం చేస్తుండడంతో పుట్టపర్తిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.

ట్రస్ట్.. మౌనమే!?
బాబా 19 రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా.. ట్రస్ట్ వర్గాలు మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఆయన ఆరోగ్యంపై ఒక్క ప్రకటనా చేయలేదు. డాక్టర్ సఫాయా బులెటిన్లు తప్పితే.. బాబా పరిస్థితికి కారణాలు ఏమిటన్న విషయంలో ట్రస్ట్ పూర్తి మౌనం పాటిస్తోంది. ట్రస్ట్‌లోని కొందరు ముఖ్యులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే సహాయకుడిని పావును చేశారా? అన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి.
అసలు బాబా ఎప్పటినుంచి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన పరిరక్షణకు ఏర్పాటు చేసినవారి వ్యవహార శైలి ఏమిటి? బాబాకు కొన్ని మందులు కూడా ఉపయోగించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత? ఆస్పత్రిలో ఏం జరుగుతోంది!? ఇలాంటి ప్రశ్నలకు ట్రస్ట్ నుంచి సమాధానాల్లేవు. బాబాను నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత స్థితికి కారణమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయినా, ట్రస్ట్‌ది మౌనమే!!

గ్రీన్ రూమ్‌పైనే అందరి కళ్లూ!
సత్యసాయిబాబా గ్రీన్ రూంపైనే అందరి దృష్టి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రీన్ రూంలో వందల కోట్ల విలువ చేసే కానుకలు ఉన్నట్టు సమాచారం. వీవీఐపీలకు ఇక్కడే బాబా ప్రత్యేక దర్శనం ఇచ్చేవారు. ఆయనను కలవడానికి వచ్చినవారు విలువైన కానుకలు ఇచ్చేవారన్న ప్రచారం ఉంది. అవన్నీ కోట్ల విలువైనవి కావడంతో పలువురు వాటి వ్యవహారంలో తలమునకలైనట్టు ప్రచారం జరుగుతోంది. 
ఎవరికి వారు వాటిపై కన్నేసి తతంగం నడిపిస్తున్నారన్న వాదనలున్నాయి. గ్రీన్ రూంతోపాటు సత్యసాయి నివాసముండే ప్రత్యేక మందిరంలో కూడా అత్యంత విలువ చేసే కానుకలున్నట్టు సమాచారం. వీటి వ్యవహారంలోనే కొందరిమధ్య తేడాలు వచ్చినట్టు తెలుస్తోంది. బాబా ఆరోగ్యపరిస్థితి నేపథ్యంలో ట్రస్ట్ సభ్యులతోపాటు మరికొందరు కూడా గ్రీన్ రూంపైనే దృష్టి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

బాబా ఆరోగ్యంపై సి.ఎం. అత్యవసర సమావేశం
నిజానిజాలు తెలుసుకోవాలని గీతారెడ్డికి ఆదేశం
సత్యసాయిబాబా ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్
హైదరాబాద్, ఏప్రిల్ 15 : పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యపరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ శుక్రవారంనాడు మంత్రి డాక్టర్ గీతారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు, వైద్యనిపుణులతో ఆయన శుక్రవారం సాయంత్రం సమావేశం కానున్నారు.
ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి టి.వి. ఛానల్‌లోనూ, ఆంధ్రజ్యోతి దినపత్రికలోనూ బాబా ఆరోగ్యం పైనా, పుట్టపర్తి ఫ్రశాంతి నియంలో బాబా ట్రస్టు ముసుగులో జరుగుతున్న వ్యవహారాలపైనా వెలువడిన కథనాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించాయి. ఈ అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసలు అక్కడ ఏమి జరుగుతున్నదీ తెలుసుకుని సంపూర్ణ సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. ఆ బాధ్యతను మంత్రి గీతారెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. పుట్టపర్తిలో ఏమి జరుగుతున్నదీ వెంటనే అన్ని కోణాలనుంచీ తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ మంత్రి గీతారెడ్డిని ఆదేశించారు, ఇప్పటివరకు తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని గీతారెడ్డి ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తున్నది.
కాగా, పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యంపై నిజాలు వెల్లడించాలంటూ అనంతపురంజిల్లా, పెనుకొండలో భాష్కర్‌రెడ్డి అనే న్యాయవాది శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు కేసు విచారణను శనివారం నాటికి వాయిదా వేసింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం న్యాయవాది భాష్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాజానికి కావలసిన వ్యక్తి, భగవంతుడుగా భక్తులు అందరూ భావిస్తున్న బాబా విషయంలో రకరకాల కథనాలు వినవస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్టు వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ప్రజా సంఘాల నుంచి, భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నందువల్లే నిజానిజాలు వెల్లడి కావాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన వివరించారు.
మరోవైపు దళిత జన సభ బాబా విషయంలో మానవ హక్కుల సంఘాన్ని (హెచ్ఆర్‌సీ) ఆశ్రయించింది. సత్యసాయి పరిస్థితిపై నిజాలు వెల్లడించాలని, ట్రస్టు బోర్డు, ఆస్పత్రి యాజమాన్యంపై అనుమానాలు ఉన్నాయని, బాబాను ఒక్కసారి భక్తులకు చూపించాలని దళిత జన సభ సంఘం కోరింది. బాబా విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వైద్యం పేరుతో బాబాను ఆస్పత్రిలో బందీ చేశారని సంఘం తమ ఫిర్యాదులో పేర్కొంది. సత్య సాయి ట్రస్టును రద్దు చేసి, ట్రస్టు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బాబాను భక్తులకు చూపించి సందేహాలు నివృత్తి చేయాలని ఆయన కోరారు.
బాబాకు మందులు ఇవ్వడం కంటె ప్రజలలోకి తీసుకువస్తే చాలా మంచిదని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు కోరారు. బాబా ఆరోగ్యం గురించి ఇంతకుముందే తాను అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని ఆదికేశవులు వ్యాఖ్యానించారు. బాబాకు ఇంత కష్టం రావడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment