తెలియదు!
సర్కారుకు ఇదొక్కటే తెలుసు..!
పుట్టపర్తిలో వేలు పెట్టలేని రాష్ట్ర ప్రభత్వం
ట్రస్టుపై సమాచారమే లేని అధికారులు
ఆంధ్రా 'వాటికన్'లో ఏమవుంతుదో లెలియదు
ఆంధ్రా 'వాటికన్'లో ఏమవుంతుదో లెలియదు
పుట్టపర్తి ట్రస్టులో ఏం జరుగుతోంది?
ట్రస్టుకు ఎన్ని ఆస్తులున్నాయి?
మార్చి 28 కంటే ముందు సాయి ఆరోగ్యం ఎలా ఉండేది?
- ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్న సమాధానం ఒక్కటే!
'ఏమీ.. తెలియదు'!
సత్యసాయి ట్రస్టుకు సంబంధించి మన ప్రభుత్వానికి
తెలిసింది ఇదొక్కటే!
ఎన్నో సంక్షోభాలు.. ఎన్నెన్నో ఉపద్రవాలు... మరెన్నో కల్లోలాలు... అన్నింటినీ తట్టుకుని ప్రజలను ముందుకు తీసుకెళ్లే సత్తా ప్రభుత్వానికి ఉంటుంది. ఎవరి జీవితం వారిదే కానీ, అందరికీ దిశా నిర్దేశం చేయాల్సింది ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వానికే 'మైండ్ బ్లాంక్' అయింది. లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తులు! కోట్ల మంది భక్తుల ప్రేమానురాగాలను పొందిన వ్యక్తి!! కానీ అక్కడ ఏమవుతోందో... ఏం జరుగుతోందో... ప్రభుత్వానికి ఏమీ తెలీదు.
పుట్టపర్తిలో జరుగుతున్న వ్యవహారాలపై 'ఆంధ్రజ్యోతి' శరపరంపరగా కథనాలు ప్రచురిస్తుండటంతో బాబా పట్ల భక్తి విశ్వాసాలున్న అనేకమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి అసలేం జరుగుతోందో తెలపాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీనిపై అనంతపురం కలెక్టర్ స్పందిస్తూ పుట్టపర్తి సత్యసాయి ట్రస్టుకు సంబంధించి తన వద్ద తక్షణ సమాచారం ఏదీలేదని, మార్చి 28 తర్వాత ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్స గురించి మాత్రమే తెలుసునని సమాధానమిచ్చారు.
దీంతో ప్రభుత్వం మరో ప్రయత్నం మొదలు పెట్టింది. సత్యసాయి ట్రస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంపించాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి రమణాచారి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం ముఖ్య కార్యదర్శి మృత్యుంజయ సాహులకు డీవో లెటర్లు పంపింది. వారినుంచి ఇంకా నివేదికలైతే రాలేదు కానీ... తమ వద్ద సమాచారం ఏది లేదని మాత్రం వారు చెబుతున్నారు.
ఎప్పుడో 30 ఏళ్ల కిందటే సత్యసాయి ట్రస్టుకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఆదాయపు పన్నూ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపులతోపాటు ఏటేటా వార్షిక అకౌంట్ల నివేదికలను దేవాదాయ శాఖకు పంపాలన్న నిబంధనల నుంచి కూడా సడలింపు ఇచ్చింది. అంతే! గత 30 ఏళ్లలో సత్యసాయి ట్రస్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఒక్క కాగితం ముక్క కూడా లేదు. సాధారణంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు, దాతృత్య, ధార్మిక సంస్థలకు ప్రభుత్వం మినహాయింపులు ఇస్తుంది. వాటి దైనందిన కార్యకలాపాల్లో వేలు పెట్టదు.
అలాగని ఎక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వదిలేసి కూర్చోవడంపైనే ఇప్పుడు విమర్శలు తలెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థలే! స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలే. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూనే ఉంది. ప్రపంచంలో వాటికన్ సిటీకే ప్రత్యేక హోదా ఉంది. దాని పరిపాలన మొత్తం పోప్ పర్యవేక్షణలో జరుగుతుంది. పుట్టపర్తిలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. సత్యసాయి వ్యవహారాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని కానీ, జోక్యం చేసుకోవాలని కానీ ఎవరూ కోరడం లేదు.
అయితే పెను సమస్య తలెత్తినప్పుడు కూడా ప్రభుత్వం అక్కడ ద్వితీయశ్రేణి పౌరురాలిగా మారడమే తీవ్ర అభ్యంతరకరమన్న వాదన తలెత్తుతోంది. ట్రస్టులో వేలు పెట్టకూడదన్నది నిజమే కానీ, ప్రశాంతి నిలయంలో ఏం జరుగుతోందో... ఏ మందిరం కింద సెల్లార్లు ఉన్నాయో... ఆ సెల్లార్లలో ఏం జరుగుతోందో... ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి అత్యంత దీనస్థితిలో ఆస్పత్రి పాలైతే అందుకు దారి తీసిన కారణాలేమిటో ప్రభుత్వం పట్టించుకోకపోవడమే విశేషం. మరీ ఏమీ పట్టించుకోలేదంటే జనం దుమ్మెత్తి పోస్తారని భావించి సమన్వయకర్తలుగా మంత్రి గీతారెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంలను పంపింది.
వారిద్దరూ బాబా భక్తులు. దీంతో వారు ట్రస్టును అజమాయిషీ చేస్తున్నారా, ట్రస్టు సభ్యులే వారిని కంట్రోల్‌లో పెట్టుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందంటే ట్రస్టు మీద వస్తున్న విమర్శలకు అటు ట్రస్టు, ఇటు ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో... సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్.భగవతిని ఉపయోగించుకుంటున్నారు. ఇదీ మన ప్రభుత్వం!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు
మంథని: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, దేశ విదేశాల్లోని దాని అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపించాలంటూ కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన తోట భాస్కర్ శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియాకు ఫిర్యాదు చేశారు. ట్రస్టు ఆర్థిక అవకతవకలపై 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'లో వరసగా వస్తున్న కథనాల ఆధారంగా ట్రస్టు, దాని అనుబంధ సంస్థల్లో నల్లధనాన్ని గుర్తించి పన్నుల ఎగవేత, చట్టాల ఉల్లంఘనపై దర్యాప్తు చేయించాలని కోరారు. 1972 నుంచి 2011 మధ్య కాలంలో సత్యసాయి సేవాసంస్థల పేరిట జరిగిన ఆర్థిక లావాదేవీలు, ట్రస్టు సభ్యుల సొంత ఖాతాలు, వారి ఆస్తులపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కోరారు.
మరికొన్ని అవయవాలూ..
బాబా శరీరంలోని మరికొన్ని అవయవా లు పనిచేయని స్థితికి చేరుకుంటున్నాయి. పూర్తిగా వెంటిలేటర్‌పైనే ఉన్నందున హృద య స్పందన స్థాయి స్పష్టంగా చెప్పలేం.
- వైద్య విద్యా సంచాలకుడు రవిరాజ్
...మీరూ ప్రార్థించండి
సత్యసాయి బాబా త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నాతోపాటు నా అభిమానులు కూడా దేవుణ్ని ప్రార్థిస్తారని తలుస్తున్నాను.
- ట్విట్టర్‌లో సచిన్ టెండూల్కర్

మెదడు స్పందన తగ్గిపోయింది!
వైద్యుల్లో తీవ్ర ఆందోళన
వెంటిలేటర్‌పై వివాదం!
27 రోజులుగా కృత్రిమ శ్వాస
ఎంత కాలం ఇలా?
తొలగింపునకు ట్రస్ట్ నిరాకరణ!
నేడు సభ్యుల వీడియో కాన్షరెన్స్
అనంతరం విలేకరుల సమావేశం
ఎంత కాలం ఇలా?
తొలగింపునకు ట్రస్ట్ నిరాకరణ!
నేడు సభ్యుల వీడియో కాన్షరెన్స్
అనంతరం విలేకరుల సమావేశం
ధర్మవరం, ఏప్రిల్ 23: సత్యసాయిబాబా మెదడు వైద్య చికిత్సకు స్పందించడం క్రమేపీ తగ్గుతోంది. ఇప్పటివరకూ శరీర అవయవాలు సక్రమంగా పనిచేయకపోయినా మెదడు పనిచేస్తుండడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తులు చికిత్సకు స్పందించకపోయినా మెదడు నుంచి సంకేతాలు ఉన్నందున కృత్రిమ శ్వాసతో వైద్య చికిత్స కొనసాగించారు.
వెంటిలేటర్తొలగించాలనే ఆలోచన వచ్చినా, దానిపై డాక్టర్లు వెనక్కి తగ్గడానికి మెదడు పని చేస్తుండడమే కారణంగా చెబుతున్నారు. అలాంటిది శనివారం రాత్రి 9 గంటల సమయంలో బాబాను పరీక్షించిన వైద్యులు మెదడు దాదాపుగా పని చేయడం లేదని నిర్ధారించినట్లు తెలిసింది. మెదడు చికిత్సకు స్పందించకపోవడంతో ఇక తాము చేయగలిగే చికిత్స దాదాపు ఏమీ లేనట్టేనని వారు తేల్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సత్యసాయి ఆరోగ్యంపై పుట్టపర్తిలోను, ఇతర ప్రాంతాల్లోను ఉన్న ట్రస్టు సభ్యులు ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పుట్టపర్తిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్.భగవతి, మరికొందరు సభ్యులు పుట్టపర్తిలో ఉండగా ఇంకొందరు ఆదివారం ఉదయం చేరుకోనున్నారు. బాబా ఆరోగ్యం విషమంగా ఉండడంతో ట్రస్టు లావాదేవీలపైనా చర్చ జరగనుంది.
బాబాకు గత 27 రోజులుగా వెంటిలేటర్ ద్వారానే కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అయితే ప్రస్తుత వివాదమంతా వెంటిలేటర్ విషయంలోనే కొనసాగుతున్నట్లు సమాచారం. వెంటిలేటర్‌ను తొలగించాలని ప్రభుత్వం... అలా వీలుకాదని ట్రస్ట్‌వర్గాలు, బంధువర్గాల అభ్యంతరం..! ఇలా మొత్తం వ్యవహారం వెంటిలేటర్ చుట్టూ నడుస్తోంది. దాన్ని తొలగించాలా? వద్దా?
తొలగిస్తే పరిస్థితి ఏమిటి? లేదంటే ఎంతకాలం ఇలా? అనే అంశాలపై అటు ట్రస్ట్ వర్గాలు, ఇటు ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాబా మెదడు నుంచి ఎంతో కొంత సంకేతాలు ఉన్నందున వెంటిలేటర్‌ను తొలగించడానికి వైద్యులు జంకుతున్నారు. దీంతో 27 రోజులయినా ఇంటెన్సివ్ కేర్‌లో మొత్తం సపోర్టింగ్ సిస్టంపైనే సత్యసాయికి వైద్య చికిత్సలను అందిస్తూ వచ్చారని సమాచారం.
వెంటిలేటర్ తొలగిస్తే...!
సత్యసాయికి కృత్రిమ శ్వాస అందిస్తున్న వెంటిలేటర్‌ను తొలగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ సత్యసాయిబాబా దర్శనమిస్తారన్న బలమైన విశ్వాసంతో కొందరు భక్తులున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వెంటిలేటర్‌ను తొలగించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని ట్రస్ట్ వర్గాలు ప్రభుత్వ పెద్దల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
దేహాన్ని వీడేది, లేనిది సత్యసాయే నిర్ణయించుకుంటారని ట్రస్ట్ వర్గాలు పేర్కొంటున్నట్లు సమాచారం. భక్తులు కష్టాల్లో ఉంటే కొన్నిరోజుల పాటు వారి కష్టాలు తీర్చడానికి తాను వెళ్లానని, తిరిగి వస్తానని బాబా తనకు కలలో కనిపించి చెప్పినట్లు సింగపూర్‌కు చెందిన ఓ భక్తురాలు సత్యసాయి బంధువు శంకర్‌రాజుకు చెప్పారని పుట్టపర్తిలో ప్రచారం జరుగుతోంది.
తాను 96 ఏళ్లు జీవిస్తానని బాబా గతంలో ఒకసారి చెప్పిన విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటిలేటర్‌ను తొలగిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు అవుతుందని ట్రస్ట్‌వర్గాలతోపాటు కుటుంబీకులు కూడా అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం.
ఎంతకాలం ఇలా...?
సత్యసాయిని ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పై ఎంతకాలం ఉంచాలనే సంశయం ప్రభుత్వంలోను, వైద్యుల్లోను వ్యక్తమవుతోంది. బాబా శరీరంలోని అవయవాలు వైద్యానికి కూడా సహకరించని పరిస్థితి ఉంది. కాలేయం పూర్తిగా దెబ్బతిందని, హృదయ స్పందన కూడా తగ్గిందని వైద్యులు పేర్కొంటున్నారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నప్పటికీ శరీరంలోని అవయవాలు వైద్యానికి సహకరించి పరిస్థితి మెరుగు పడే సూచనలు ఉన్నట్లయితే వైద్యులు కూడా వెంటిలేటర్‌ను తొలగించే పరిస్థితి ఉండదు.
బాబా ఆరోగ్యం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ పరిస్థితిలో సాధారణ వ్యక్తులకైతే ఇక లాభం లేదని బంధువులకు చెప్పి వైద్యులు వాటిని తొలగించే వారని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సత్యసాయిబాబా విషయంలో ఆ సాహసం చేయలేని పరిస్థితి వైద్యుల్లో ఉంది. ఇదే పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని డాక్టర్ రవిరాజ్ కూడా పేర్కొన్నారు.
ప్రభుత్వం కలవరం
సత్యసాయి అనారోగ్యానికి గురైనప్పటినుంచి జిల్లా అధికార యంత్రాంగంతోపాటు, రాష్ట్రస్థాయి అధికారులు కూడా పుట్టపర్తిలో మకాం వేశారు. ఒక వైపు కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అక్కడ కూడా పోలీసు బలగాలు మోహరించారు.
అయినా భారీ ఎత్తున కర్నూలు, చిత్తూరు, జిల్లాల నుంచే కాకుండా గుంటూరు జిల్లా నుంచి కూడా పోలీసు బలగాలు పుట్టపర్తి బందోబస్తుకు తరలివచ్చాయి. అనంతపురం జిల్లాలోని పలు స్టేషన్లు దాదాపు ఖాళీ అయ్యాయి. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని అన్ని డివిజన్ ప్రాంతాల హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు స్టేషన్లలో ఇద్దరు లేదా ముగ్గురు కూడా పోలీసు సిబ్బంది లేరు. దీంతో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే పరిస్థితి ఏమిటన్న కలవరంలో ప్రభుత్వముంది.

హే... బాబా..!

సత్య సాయిబాబా...పేదల కోసం తాను నిర్మించిన అత్యంత ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో.. భక్తులకు కొండంత ధైర్యాన్నిచ్చే తానే కోమాలో.. ఒళ్లు తెలీని స్ధితిలో..నిర్లిప్తంగా..నిస్తేజంగా..26 రోజులుగా.. క్షణ మొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు. మందీ మార్బలానికి తక్కువ లేకపోయినా..ఆసుపత్రిలో ఆయన ఒంటరి. డాక్టర్లు రోజుకి మూడు హెల్త్ బులిటిన్లు విడుదల చేస్తున్నా..అసలు విష యం అంతగా అంతుబట్టని స్థితి. ఏవేవో పడికట్టు పదాలు. వైద్య పరిభాషలో..వైద్యులకే అర్ధమయ్యే సమాచారం తప్ప..బాబా శారీరక కదలికల గురించి గాని, ఆయన ఆంతరంగిక సమాచారం గురించి గాని వీసమెత్తు బయటకు రావడం లేదు. అసలింతకీ బాబా.
పడక మీద ఏ స్థితిలో ఎలా ఉండి ఉంటారన్నది భక్తులకు, సామాన్య ప్రజానీకానికి ఆసక్తి ఆందోళన కలిగిస్తున్న అంశం. అందుకే ‘సూర్య’ ఆ విషయం మీద దృష్టి సారించింది. బాబా భక్తులుగా ఉన్న వైద్య నిపుణులని, బాబాతో సంబంధం లేని డాక్టర్లతోను సంభాషించింది. బాబా ప్రస్తుతం ఆసు పత్రిలో ఎలా ఉండి ఉంటారన్నదానిపై విషయ సేకరణ జరిపింది. డాక్టర్ల అభిప్రాయాలు సేకరించింది. వారి అభిప్రాయం ప్రకారం.. నిజానికి బాబా ఎముకల గూడు మాదిరి బక్క చిక్కి శల్యమై ఓపిక లేని స్థితిలో నీరస నిస్సత్తువలతో ఉన్నారు.

ఏడాది క్రితం బాబా ఆకృతిని గుండె ల్లో దాచుకున్న భక్తకోటి నేటి బాబా ఆకృతిని చూసి తట్టుకోలేకపోవచ్చు. ఏడాది క్రితం ఎంతో ఆరోగ్యంగా..హుషారుగా కనిపించిన బాబాకు ఇప్పటి బాబాకు పోలికే లేదు. అప్పట్లో బాబా ముఖంలో తెలీని వర్చస్సు. ఏదో మాట్లాడాలని చెంతకు చేరిన భక్తులు ఆ ముఖ వ ర్చస్సుకు దాసోహమై మాటలు రాక అలానే ఆయన వైపు చూస్తూ ఉండిపోయేవారు. ఆ ముఖంలో దివ్య కాంతి కనిపిస్తుం దని భక్తులు చెప్పేవారు. అదే ముఖం ప్రస్తుతం కళావిహీనమై..కనులు లోపల కు పీక్కుపోయి..ఓపిక లేని దశలో..నిస్తేజంగా ఉంది. అప్పట్లో భక్తుల మధ్యకు వస్తే చాలు రెండు చేతులూ పైకెత్తి అరచేతులు చూపుతూ అభయ హస్తమిచ్చే వారు. ఆ చేతులు ప్రస్తుతం పైకి లేవలేక మంచంపై నిర్లిప్తంగా పడి ఉన్నాయి. కాంతులు వెదజల్లే ఆ కళ్లు తెరుచుకోవడం లేదు. కోమాలో మగతగా మూసు కుపోయి ఉన్నాయి.
బంగారు సింహాసనం మీద కూర్చున్న బాబా..బంగారు రథాల మీద ఊరేగిన బాబా..ప్రస్తుతం తన శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి ఒక సపోర్టుతో మాత్రమే క్షణాలు వెళ్లదీస్తున్నారు. బాబా కిందటి నవంబరు మూడో వారంలో తన పుట్టిన రోజు వేడుకల్లోనే అనారోగ్యంగా కనిపించారు. అప్పటికే ఆయనకు పక్షవాతం సోకింది. తల ఒక పక్కకి ఒరిగిపోతున్నది. చేతులు లేవ లేని దుస్థితి. అప్పటికే ఆయన బాగా బరువు తగ్గిపోయారు. మాట చాలా తక్కు వ స్వరంలో వచ్చింది. ప్రధాని సమక్షంలో ఆయన అతి కష్టం మీద ప్రసంగి స్తుంటే ఆయన ప్రసంగ పాఠాన్ని విని తర్జుమా చేసేందుకు సంబంధీకుడు ఆయ నకు అతి దగ్గరగా ఉండి అత్యంత జాగరూకతతో విని తర్జుమా చేయాల్సి వచ్చింది. ఆ అనారోగ్యం నానాటికీ తీవ్రమవుతూ మార్చి నెలాఖరు నాటికి ఆసు పత్రికి వెళ్లక తప్పని స్థితి వచ్చింది. బాబాకు వైద్యులు అందిస్తున్న చికిత్స పూర్తి వివరాలు బయటకు రావడం లేదు. కేవలం డయాలసిస్, వెంటిలేటర్లు.. సీఆర్ ఆర్‌టీ..ఇలా పొడిపొడిగా మాత్రమే చెబుతూ..లోతైన విషయాలు బయటకు చెప్పకపోవడం పట్ల రాష్ట్రంలోని పలువురు వైద్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వైద్య పరిభాషలో చెప్పాలంటే బాబా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కు వని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చికిత్సలకు వయ స్సు ప్రధాన పాత్ర పోషిస్తుందని, బాబాకు ఇప్పుడు అదే పెద్ద అవరోధమైందని వారంటున్నారు. ఇంత పెద్ద వయస్సులో ఏ చికిత్స చేయాలన్నా వయస్సు సహ కరించదని, అవయవాలు సరిగా స్పందించవని, ఎంతటి చికిత్స అయినా ఇక్క డే విఫలమవుతుందని వారు చెబుతున్నారు. ఇన్ని వారాలుగా ఆసుపత్రి మం చం మీదున్న వ్యక్తి..బాగా బరువు కోల్పోవడం సహజమేనని కూడా వారు చెబు తున్నారు. బాబా..ప్రస్తుతం అయిదు నుంచి పది కిలోలకు పైగా బరువు కోల్పో యి ఉండొచ్చని వారి అభిప్రాయం.
బాబాకు ఎదురైన సమస్యల పరంగా చూస్తే..ఇలాంటి కేసుల్లో 50-50 అవకాశాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో కొన్ని నెలల తర్వాత కూడా పురోగతి కనిపించొచ్చని వారంటున్నారు. నిజానికి బాబాకు గతంలో ఎలాంటి అస్వస్ధతలు లేవు. ఎన్నడూ ఇతరత్రా ఆరోగ్య సమ స్యలు రాలేదు. ఆయన ఆహార నియమాలు కచ్చితంగా పాటించేవారు. నూటికి నూరు శాతం శాకాహారమే భుజించేవారు. అది కూడా అత్యంత మితాహారం. కాఫీ, టీలు తాగేవారు కాదు. బిస్కెట్లు, చాక్లెట్లు అంటే ఆయనకు అమితమైన ఇష్టం. రాగి సంకటి, వేరుశెనగ చెట్నీ అంటే మరింత ఇష్టంగా తింటారు.
నారాయణ హృదయాలయ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్ ఈ విష యాలను ‘సూర్య’తో పంచుకున్నారు. ఘనాహారం లేకపోవడం, డయాలసిస్ చేస్తుండటం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారని ఆయన చెప్పారు. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.గ్లోబల్ ఆసుపత్రి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ డాక్టర్ కంచర్ల రవీంద్రనాధ్ ఇదే అంశంపై మాట్లాడుతూ..శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఇతర అవయవాలకు సోకడం వల్ల బాబా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. వయస్సు పెద్దది కావడంతో చికిత్సకు అవయవాలు సహకరించడం లేదన్నారు.
దానికి తోడు రోజురోజుకి ఇతర అవయవాలు కూడా పని చేయకపోతుండటంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర వుతున్నాయన్నారు. కాలేయం చెడిపోయిన తర్వాత తిరిగి పని చేయడమన్నది అసలు జరగదని, ఈ విషయంలో వైద్యులు ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేద న్నారు. వైద్యపరంగా చూస్తే బాబా క్షేమంగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువని కేర్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. చికిత్సకు శరీరం కొంతవరకైనా సహకరించాలని, 25 రోజులుగా అంతా కృత్రిమంగానే నడుస్తోందని ఆయన అన్నారు. హీమో డయాలసిస్ తర్వాత బాబాకు సీఆర్ ఆర్‌టీ చేస్తున్నారని, కిడ్నీలు పని చేయనపుడు సపోర్టివ్ మేనేజ్ మెంట్ అవసర మవుతుందని ఆయన గుర్తు చేశారు. ఇన్‌ఫెక్షన్ తగ్గితే ఇమ్యూ నిటీ పెరుగు తుందని, అయితే ప్రస్తుతం ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment